AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రవిశాస్త్రి, విరాట్ కోహ్లీల తప్పులేదు.. ఆ విషయంలో వారిని నిందించడం కరెక్ట్ కాదు: టీమిండియా మాజీ క్రికెటర్

Ravi Shastri-Virat Kohli: టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి మొదట ఇంగ్లండ్ పర్యటనలో కోవిడ్ -19 పాజిటివ్‌గా తేలాడు. ఆ తర్వాత మరికొన్ని కేసులు నమోదయ్యాయి. దీంతో చివరి టెస్ట్ రద్దు అయింది.

రవిశాస్త్రి, విరాట్ కోహ్లీల తప్పులేదు.. ఆ విషయంలో వారిని నిందించడం కరెక్ట్ కాదు: టీమిండియా మాజీ క్రికెటర్
Ravi Shastri
Venkata Chari
|

Updated on: Sep 12, 2021 | 8:50 AM

Share

Ravi Shastri-Virat Kohli: భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టీంల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి, నిర్ణయాత్మక ఐదవ టెస్ట్ మ్యాచ్ శుక్రవారం ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, కోవిడ్ కారణంగా జరగలేదు. టీమిండియాలో కోవిడ్ కలకలంతో మ్యాచ్ రద్దు అయింది. మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్ ఆడటానికి భారత ఆటగాళ్లు నిరాకరించడంతో రద్దు చేయక తప్పలేదు. టీమిండియాలో మొదటి కోవిడ్ పాజిటివ్ హెడ్ కోచ్ రవిశాస్త్రి తేలాడు. అతని తర్వాత జట్టు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ కూడా ఈ వైరస్ బారిన పడ్డాడు. అలాగే టీమ్ ఫిజియో నితిన్ పటేల్, మరొక ఫిజియో యోగేష్ పర్మార్ కూడా పాజిటివ్ తేలారు. దీంతో ఐదవ టెస్ట్ పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. మ్యాచ్ రద్దయిన తర్వాత, హెచ్ కోచ్ రవిశాస్త్రిని చాలా మంది నిందించారు. అయితే ఒకరు మాత్రం హెచ్ కోచ్‌ను సమర్థించారు. భారత మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజనీర్ శాస్త్రిని తప్పుపట్టాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చాడు.

నాల్గవ టెస్ట్ మ్యాచ్‌కు ముందు రవిశాస్త్రి తన పుస్తకాన్ని ఆవిష్కరించారు. విరాట్ కోహ్లీ కూడా ఇందులో పాల్గొన్నారు. ఆంగ్ల మీడియా ప్రకారం, ఈ కార్యక్రమంలో కోవిడ్ నియమాలు పూర్తిగా పట్టించుకోలేదు. చాలా మంది మాస్క్‌లు ధరించకుండా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇదే టైంటో అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అనంతరం రవిశాస్త్రికి లక్షణాలు కనిపించాయి. దీంతో ఓవల్‌లో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ చివరి రోజున శాస్త్రి లేకుండానే టీమిండియా మైదానానికి చేరుకుంది. అరుణ్, శ్రీధర్, పటేల్ క్వారంటైన్‌లో ఉన్నారు. అయితే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కావడం ద్వారా శాస్త్రి, కోహ్లీ తప్పు చేయలేదని ఫరూక్ భావిస్తున్నారు.

ఆయన మాట్లాడుతూ “ప్రజలు రవిశాస్త్రిని నిందిస్తున్నారు. అతను భారత క్రికెట్ కోసం ఎంతో చేశాడు. రవి, విరాట్ ఇద్దరూ దేశం కోసం కష్టపడుతూనే ఉన్నారు. పుస్తకావిష్కరణకు వెళ్లినందుకు ఈ ఇద్దరినీ మీరు నిందించలేరు. ఆ వ్యక్తులు హోటల్ నుంచి బయటకు వెళ్లలేదు. వారు లోపల ఉన్నారు. ఒకరిని తప్పుపట్టడం, వేరొకరిపై వేలు చూపడం చాలా సులభం. సెల్ఫీల కోసం ప్రజలు మా వద్దకు వస్తూ ఉంటారు. అలా అని ప్రతిసారీ నో చెప్పలేం. రవి, విరాట్‌లు కూడా అదే చేశారు. అలాగే వ్యక్తులతో కరచాలనం చేశారు. వారిలో కోవిడ్ పాజిటివ్ ఎవరో వారికి ఎలా తెలుస్తుంది? కాబట్టి మీరు రవిశాస్తి, విరాట్‌ను నిందించలేరు. వారిపై అనేక ఆరోపణలు ఉన్నాయని నేను భావిస్తున్నాను” అంటూ వారిని సమర్థించారు.

Also Read:

Cristiano Ronaldo: 12 ఏళ్ల తరువాత ఆ టీం తరుపున గోల్ చేసిన క్రిస్టియానో ​​రొనాల్డో.. రీ ఎంట్రీలో అదరగొట్టిన పోర్చుగల్ స్టార్ ప్లేయర్

ఎస్‌ఆర్‌హెచ్‌ టీంలో విండీస్ స్టార్ క్రికెటర్.. 2019లో ముంబైకి టైటిల్ అందించి, సీపీఎల్‌లో సునామీ సృష్టిస్తోన్న ఆ ప్లేయర్ ఎవరంటే?