Sourav Ganguly: సౌరవ్ గంగూలీ బయోపిక్‌కు రంగం సిద్దం.. వీడియో

Sourav Ganguly: సౌరవ్ గంగూలీ బయోపిక్‌కు రంగం సిద్దం.. వీడియో

Phani CH

|

Updated on: Sep 12, 2021 | 9:43 AM

టీమిండియా హిస్టరీలో ప్రత్యేకమైన అధ్యాయాన్ని లిఖించిన దిగ్గజ క్రికెటర్‌ సౌరవ్ గంగూలీకి సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. తన క్రికెట్‌ కెరీర్‌లో మంచి ప్లేయర్‌గానే కాదు..

టీమిండియా హిస్టరీలో ప్రత్యేకమైన అధ్యాయాన్ని లిఖించిన దిగ్గజ క్రికెటర్‌ సౌరవ్ గంగూలీకి సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. తన క్రికెట్‌ కెరీర్‌లో మంచి ప్లేయర్‌గానే కాదు.. ఓ మంచి కెప్టెన్‌గా కూడా ఎంతో గుర్తింపు పొందిన బెంగాల్‌ టైగర్ జీవితం ఆధారంగా ఓ బయోపిక్‌ రాబోతోంది. దాదా బయోపిక్‌ తీసేందుకు నిర్మాతలు లవ్ రంజన్, అంకుర్ గార్గ్ ఇప్పటికే రెడీ అయ్యారు. లవ్ ఫిలింస్ బ్యానర్‌పై తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే గంగూలీ పాత్రను ఎవరు పోషించబోతున్నారు..? అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు, తన చిన్ననాటి స్నేహితురాలు డోనాను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో పాటు క్రికెట్‌ కెరీర్‌లో సాధించిన అద్భుత విజయాల ఆధారంగా మూవీ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Mercedes Benz: టెస్లాకు పోటీగా మరో సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు.. ఒక్కసారి చార్జింగ్‌తో..!! వీడియో

West Godavari: టీ కొట్టు వ్యక్తికి రూ. 21కోట్ల కరెంట్‌ బిల్లు.. వీడియో