- Telugu News Photo Gallery Cricket photos Ipl 2021 chennai super kings Dhoni team players faf du plesses shardul thakur imran tahir stars before second phase
IPL 2021: జమైకా నుంచి లండన్ వరకు.. ఐపీఎల్ 2021 కి ముందు ధోని కుర్రాళ్ల ఆధిపత్యం.. ఇక దబిడదిబిడే అంటోన్న సీఎస్‌కే ప్లేయర్స్
Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదటి దశలో అద్భుతంగా ప్రదర్శన చేసింది. ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచారు.
Updated on: Sep 12, 2021 | 12:56 PM

Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చివరి సీజన్ చాలా నిరాశపరిచింది. ఏదేమైనా, ఈసారి మూడుసార్లు ఛాంపియన్ మొదటి దశలో అద్భుతమైన ఫామ్‌లో కనిపించింది. ప్రస్తుతం రెండవ దశ ప్రారంభానికి ముందు, ఈ జట్టు అద్భుతమైన ఫామ్‌ని కొనసాగించబోతున్నామంటూ ఆటీం స్టార్ ప్లేయర్లు ఇటీవలి ఫామ్‌తో సంకేతాలు అందించారు.

లీగ్ తొలి దశలో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్. ప్రస్తుతం సీపీఎల్‌లో ఆడుతున్నాడు. అతని బ్యాట్ నుంచి పరుగుల సునామీ కొనసాగుతోంది. సెయింట్ లూసియా తరపును ఆడుతున్నప్పుడు 54 బంతుల్లో 84 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో, అతను నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 155.56గా నమోదైంది. అంతకు ముందు 200 స్ట్రైక్ రేట్‌తో 120 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

ఇటీవల ఇంగ్లండ్‌తో ఆడిన టెస్ట్ సిరీస్‌లో సీఎస్‌కే ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. రెండు మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఇన్నింగ్స్‌లలో 39.00 సగటుతో 117 పరుగులు సాధించాడు. ఈ సమయంలో అతను 14 ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదేశాడు. టెస్ట్ సిరీస్‌లో టీ 20 తరహాలో బ్యాటింగ్ చేశాడు.

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఇమ్రాన్ తాహిర్ కూడా సీపీఎల్‌లో కనిపించాడు. తాహిర్ తొమ్మిది మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీశాడు. ఈ సమయంలో అతని ఎకానమీ రేటు 6.33గా ఉంది. ఇటీవల అమెజాన్ వారియర్స్ గయానా తరపున ఆడుతున్నప్పుడు బార్బడోస్ రాయల్స్‌పై నాలుగు ఓవర్లలో 12 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచులో ఎకానమీ రేటు 3.00 గా ఉంది.

ప్రస్తుత సీపీఎల్ సీజన్‌లో, డ్వేన్ బ్రావో ఏడు మ్యాచ్‌ల్లో 39.00 సగటుతో 78 పరుగులు చేశాడు. అదే సమయంలో, బౌలింగ్‌లో కూడా బ్రావో అద్భుత ఆటతో ఆకట్టుకున్నాడు. అతను బార్బడోస్ రాయల్స్‌పై నాలుగు ఓవర్లలో 26 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఎకానమీ రేటు 6.50గా నమోదైంది.




