IPL 2021 DC vs CSK: ఈ లోపాలతోనే ధోని సేన ఓడింది.. అలా జరగకుంటే మ్యాచ్ మరోలా ఉండేది..!

Venkata Chari

Venkata Chari |

Updated on: Oct 05, 2021 | 1:11 PM

ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్‌ని పాయింట్ల పట్టికలో మొదటి స్థానం నుంచి రెండో స్థానానికి పంపంచి, నంబర్ వన్ కుర్చీని కైవసం చేసుకుంది. జట్టుకు 20 పాయింట్లు ఉండగా, చెన్నైకి 18 పాయింట్లు ఉన్నాయి.

IPL 2021 DC vs CSK: ఈ లోపాలతోనే ధోని సేన ఓడింది.. అలా జరగకుంటే మ్యాచ్ మరోలా ఉండేది..!
Ipl 2021, Dc Vs Csk
Follow us


IPL 2021 DC vs CSK: ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నై సూపర్ కింగ్స్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించి మొదటి స్థానంలో నిలిచింది. లీగ్ దశలో తమ 13 వ మ్యాచ్ ఆడుతున్న రెండు జట్లకు, ఈ మ్యాచ్‌లో విజయం మొదటి రెండు స్థానాల్లో నిలిచేందుకు కీలకంగా మారింది. రిషబ్ పంత్ జట్టు అత్యల్ప స్కోరింగ్‌లో అద్భుత విజయాన్ని దక్కించుకుంది. అయితే, ధోని టీం ఓడిపోవడానకి, ఢిల్లీ టీం గెలవాడానికి గల కారణాలు చూద్దాం.

అక్షర్-అశ్విన్: స్పిన్ ద్వయం అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ ఢిల్లీకి అత్యంత ముఖ్యమైన బాధ్యతను పోషించారు. పవర్‌ప్లే మొదటి రెండు ఓవర్లలో భారీగా పరుగులు ఇచ్చినా.. మూడవ ఓవర్‌లో వచ్చిన అక్షర్, ఫాఫ్ డు ప్లెసిస్‌ను ఔట్ చేయడం ద్వారా మొదటి వికెట్‌ను తీసుకున్నాడు. దీని తరువాత, ఇద్దరూ 7 వ ఓవర్‌ నుంచి 11 వ ఓవర్ మధ్య నిరంతరం బౌలింగ్ చేశారు. మొయిన్ అలీ, రాబిన్ ఉతప్పలను కూడా పెవిలియన్ చేర్చారు. కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్లు పడగొట్టారు. అక్షర్ 4 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టగా, అశ్విన్ 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నాడు.

ధోనీ స్లో ఇన్నింగ్స్ – చెన్నై మొదటి వికెట్ పతనమైనప్పటి నుంచి ఇబ్బందుల్లో కూరకపోయింది. మిడిల్ ఓవర్లలో జట్టు కొన్ని వికెట్లు కూడా కోల్పోయింది. అటువంటి పరిస్థితిలో, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని 9 వ ఓవర్లో క్రీజులోకి వచ్చారు. ఐదో వికెట్‌కు 64 బంతుల్లో 70 పరుగుల భాగస్వామ్యం అందించారు. 20 వ ఓవర్‌లో ధోని ఔట్ అయ్యాడు. ఈ 70 పరుగులలో ధోని 18 పరుగులు మాత్రమే చేశాడు. రవీంద్ర జడేజా చివరి ఓవర్‌లో వచ్చాడు. కేవలం 2 బంతులు మాత్రమే ఆడాడు. మొత్తం ఇన్నింగ్స్‌లో ధోనీ ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. దీంతో చెన్నై స్కోరు 150 కి చేరుకోలేకపోయింది.

గౌతమ్ ఫీల్డింగ్ – స్కోరు చిన్నదై అయినా.. చెన్నై బౌలర్లు కూడా ఢిల్లీని ఇబ్బందుల్లోకి నెట్టారు. 17 ఓవర్లలో ఢిల్లీ టీం కేవలం 109 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన హెట్మైర్ చెన్నై చేతుల నుంచి విజయావకాశాలను లాగేసుకున్నాడు. షిమ్రాన్ హెట్మైర్ 18 వ ఓవర్లో డ్వేన్ బ్రావో వేసిన బాల్‌ను లాంగ్ ఆన్‌లో ఆడాడు. అయితే ప్రత్యామ్నాయ ఫీల్డర్ కృష్ణప్ప గౌతమ్ ఒక సాధారణ క్యాచ్‌ను వదులేశాడు. హెట్‌మైర్ ఆ సమయంలో 11 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేశాడు. క్యాచ్ మిస్ అయిన తర్వాత ఆ బంతి బౌండరీ చేరుకుంది. దీంతో లైఫ్ దొరికిన హెట్మైర్ 18 బంతుల్లో 28 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టును విజయానికి చేర్చాడు.

Gallery Shimron Hetmyer Ipl 2021

హెట్‌మీయర్స్ హీరోయిజం – వెస్టిండీస్ ఆటగాడి తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెన్నై టీం ఓటమిపాలైంది. 4 వికెట్లు కోల్పోయాక అశ్విన్ వచ్చాడు. అది అంతగా విజయవంతం కాలేదు. ఇటువంటి స్థితిలో హెట్మీర్‌పై పెద్ద బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. బంతికి, పరుగుల మధ్య వ్యత్యాసం పెరుగుతోంది. అయితే, హెట్‌మైర్ 18 వ ఓవర్‌లో ఒక లైఫ్‌లైన్‌తో 10 పరుగులు చేశాడు. తర్వాత 19 వ ఓవర్‌లో ఒక సిక్స్ కూడా కొట్టాడు. ఇది మ్యాచ్‌ని ఢిల్లీకి అనుకూలంగా మార్చింది. దీంతో హీరోగా మారిపోయాడు.

Also Read: క్రికెట్ టీంపై దొంగల దాడి.. డబ్బుతోపాటు వాటిని కూడా తీసుకెళ్లారంటూ కీపర్ ఆవేదన.. అసలేం జరిగిందంటే?

Shimron Hetmyer: మ్యాచ్ గెలిపించానోచ్.. బ్రావో భుజాలపైకి ఎక్కి సంతోషాన్ని పంచుకున్న హెట్‌మేయిర్.. వైరలవుతోన్న వీడియో

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu