IPL 2021: ఆరెంజ్ క్యాప్ ఎవరిదో తెలిసిపోయింది.. ఫైనల్లో 32 పరుగులు చేసి క్యాప్ సొంతం చేసుకున్న చెన్నై ఆటగాడు..
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఐపీఎల్ 2021 ఫైనల్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఆరెంజ్ కప్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు....
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఐపీఎల్ 2021 ఫైనల్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఆరెంజ్ కప్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఫైనల్‌కు ముందు సీజన్‌కు ఆరెంజ్ క్యాప్‌ను అందుకోవడానికి కేఎల్ రాహుల్‌ని అధిగమించడానికి రుతురాజ్‌కు కేవలం 24 పరుగులు మాత్రమే కావాలి. ఇయాన్ మోర్గాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్‌కు దిగి ఐపీఎల్ 2021 ఫైనల్‌లో పవర్‌ప్లేలో రాహుల్‌ను రుతురాజ్ అధిగమించాడు.
రుతురాజ్ గైక్వాడ్ 635, అతని తర్వాత డూప్లిసెస్ 633, కేఎల్ రాహుల్ 626, శిఖర్ ధావన్ 587, గ్లెన్ మాక్స్వెల్ 513 ఉన్నారు. ఆరెంజ్ క్యాప్ ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడికి ఇస్తారు. కొంతమంది అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌లు ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నారు. సచిన్ టెండూల్కర్, మాథ్యూ హేడెన్, విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, క్రిస్ గేల్, కేన్ విలియమ్సన్ ఇంకా చాలా మంది ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న వారి జాబితాలో ఉన్నారు.
Read Also.. T20 World Cup: టీ 20 వరల్డ్ కప్‌కు ముందు పాకిస్తాన్‌కు షాక్.. జట్టు హై పెర్ఫార్మెన్స్ కోచింగ్ చీఫ్ రాజీనామా..