Olympics: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఒలింపిక్స్‌లోనూ ‘ధనాధన్‌’ గేమ్‌.. ఎప్పటినుంచంటే?

క్రికెట్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే వార్త.. ఇకపై ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లోనూ ధనాధన్‌ గేమ్‌ కనిపించనుంది. ఈ విశ్వక్రీడల్లో క్రికెట్‌కు చోటు కల్పిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ (ఐవోసీ) కీలక నిర్ణయం తీసుకుంది. 2028 లాస్‌ ఏంజెలెస్‌ వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు స్థానం కల్పించనున్నామని, టీ 20 ఫార్మాట్‌లో పోటీలను నిర్వహించనున్నట్లు ఈ మేరకు ఐఓసీ ట్వీట్‌ చేసింది.

Olympics: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఇకపై ఒలింపిక్స్‌లోనూ ధనాధన్‌ గేమ్‌.. ఎప్పటినుంచంటే?
Los Angeles Olympic 2028

Updated on: Oct 13, 2023 | 5:57 PM

క్రికెట్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే వార్త.. ఇకపై ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లోనూ ధనాధన్‌ గేమ్‌ కనిపించనుంది. ఈ విశ్వక్రీడల్లో క్రికెట్‌కు చోటు కల్పిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ (ఐవోసీ) కీలక నిర్ణయం తీసుకుంది. 2028 లాస్‌ ఏంజెలెస్‌ వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు స్థానం కల్పించనున్నామని, టీ 20 ఫార్మాట్‌లో పోటీలను నిర్వహించనున్నట్లు ఈ మేరకు ఐఓసీ ట్వీట్‌ చేసింది. క్రికెట్‌తో పాటు బేస్‌ బాల్‌, ఫ్లాగ్‌ ఫుట్‌ బాల్‌, లాక్రోసీ, స్క్వాష్‌ క్రీడలకు కూడా 2028 ఒలింపిక్స్‌లో చేర్చనున్నట్లు ఐఓసీ పేర్కొంది. అంతర్జాతీయ ఒలింపిక్‌ కకమిటీ ప్రెసిడెంట్‌ థామస్‌ బ్యాచ్‌ కూడా ఒలింపిక్స్‌లో క్రికెట్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. టీ20 ఫార్మాట్‌లో ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలను నిర్వహించేందుకు ఆమోదం తెలిపినట్లు థామస్‌ పేర్కొన్నారు. క్రికెట్‌ పోటీలను నిర్వహించేందుకు లాస్‌ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌ నిర్వాహకులు కూడా అంగీకరించినట్లు అందులో వెల్లడించారు. కాగా బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఐఓసీ మెంబర్షిప్‍ ఓటింగ్‍లో క్రికెట్‍కు మద్దతుగా ఇంకా ఎక్కువ ఓట్లు రావాల్సి ఉంది. ఇది పూర్తయితే 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్ గేమ్స్‌లో క్రికెట్ పోటీలు ఖాయం అవుతాయని ఆయన అంటున్నారు. ఈ ఐఓసీ మెంబర్షిప్ ఓటింగ్ ప్రక్రియ సోమవారం (అక్టోబర్ 16) జరగనుంది.

128 ఏళ్ల తర్వాత..

కాగా ఒలింపిక్స్‌లో క్రికెట్‌ ఆడడం ఇదే మొదటిసారి కాదు. 1900లో జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో ఒకసారి ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా చేర్చారు. ఆ సమయంలో ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్ మధ్య బంగారు పతకం కోసం ఒక మ్యాచ్ మాత్రమే జరిగింది. ఆ మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్ క్రికెట్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మళ్లీ ఇప్పుడు సుమారు 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ పోటీల నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. కాగా క్రికెట్‌ను అంతర్జాతీయం చేసేందుకు ఐసీసీ భావిస్తోంది. ఇందుకు ఒలింపిక్స్‌ సరైన వేదికగా భావిస్తోంది. ఇందులో భాగంగానే 2024 టీ20 ప్రపంచకప్‍ను వెస్టిండీస్‍తో పాటు అమెరికాలోనూ నిర్వహిస్తోంది. ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో భారత మహిళల, పురుషుల క్రికెట్ జట్లు స్వర్ణ పతకాలు సాధించాయి. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చినట్లయితే, స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడానికి మన దేశం బలమైన పోటీదారు అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇవి కూడా చదవండి

ఐఓసీ గ్రీన్ సిగ్నల్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..