IND Vs NZ: టెస్ట్ సిరీస్ ఓడినా.. డబ్ల్యూటీసీలో టీమిండియా టాప్.. కానీ
రెండో టెస్ట్‌లో విజయం సాధించిన కివీస్.. మరో టెస్ట్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. సిరీస్‌లో నిలవాలంటే పోరాడాల్సిన చోట భారత బ్యాటర్లు శాంట్నర్ దెబ్బకు డగౌట్‌కు క్యూ కట్టారు.
సొంతగడ్డపై వరుస టెస్ట్ సిరీస్ విజయాలతో దూసుకుపోతున్న టీమ్ఇండియాకు న్యూజిలాండ్ షాక్ ఇచ్చింది. స్వదేశంలో వరుసగా 18 టెస్టు సిరీస్‌లు సాధించిన భారత జట్టుకు 12 ఏళ్ల తర్వాత ఓటమి ఎదురైంది. స్వదేశంలో బలమైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాలను ఓడించిన భారత్‌ను న్యూజిలాండ్ ఇప్పట్లో కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టింది. బెంగళూరు టెస్టులో 46కే ఆలౌట్ అయిన టీమిండియా.. ఈసారి టర్నింగ్ పిచ్ మీద 156 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లోనైనా పోరాడి సిరీస్ సమం చేస్తుందనుకుంటే.. 245 పరుగులకే చాప చుట్టేసింది.
సిరీస్‌లో నిలవాలంటే పోరాడాల్సిన చోట భారత బ్యాటర్లు మళ్లీ అదే తడబాటును కొనసాగించారు. మిచెల్ సాంట్నర్‌ను ఎదుర్కోలేక వరుసగా డగౌట్ చేరారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో రాణించగా.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, పంత్, సర్ఫరాజ్ ఖాన్ తీవ్రంగా నిరాశపరిచారు. దీంతో న్యూజిలాండ్ 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ 13 వికెట్లు పడగొట్టగా.. మరో ఇద్దరు స్పిన్నర్లు ఫిలిప్స్ 3, అజాబ్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు. ఇటీవల బంగ్లాదేశ్ స్పిన్నర్లపై చెలరేగిన భారత బ్యాటర్లు మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో ఇబ్బంది పడ్డారు. కివీస్‌తో సిరీస్‌ను చేజార్చుకోవడంతో భారత్‌కు ఇక ప్రతి మ్యాచ్ కీలకం కానుంది. ఈ డబ్ల్యూటీసీలో టీమ్‌ఇండియా ఇంకా ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇందులో ఒకటి న్యూజిలాండ్‌తో కాగా.. మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో ఆసీస్‌తో తలపడాల్సి ఉంది. ఈ ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు గెలిస్తేనే టీమ్‌ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశం ఉంది.
India’s lead at the top of the WTC table has been reduced to a thin margin after two straight losses #INDvNZ #PAKvENG pic.twitter.com/IYftv0JCXB
— ESPNcricinfo (@ESPNcricinfo) October 26, 2024
ఇది చదవండి: పటాస్ మూవీలో ఈ చిన్నది గుర్తుందా.? ఇప్పుడు అందంతో మత్తెక్కిస్తోందిగా
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..