Video: పాకిస్తాన్ కెప్టెన్ ని ఢీ కొట్టిన గంభీర్ స్టూడెంట్! తెగ వైరల్ గా మారిన హై వోల్టేజ్ మ్యాచ్‌లోని వీడియో
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో హర్షిత్ రాణా-మహ్మద్ రిజ్వాన్ మధ్య జరిగిన భుజం తట్టే సంఘటన హాట్ టాపిక్‌గా మారింది. రిజ్వాన్ పరుగు తీయడానికి ప్రయత్నించే క్రమంలో హర్షిత్ అతనిని ఢీకొనడం అభిమానుల్లో ఆసక్తి రేపింది. ఈ ఘటనతో క్రికెట్ ప్రేమికులు 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగిన వివాదాన్ని గుర్తు చేసుకున్నారు. చివరికి, కోహ్లీ శతకం బాదడంతో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌లో మళ్లీ ఒక వివాదాస్పద సంఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, భారత యువ పేసర్ హర్షిత్ రాణా మధ్య జరిగిన భుజం తట్టే ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రిజ్వాన్ పరుగులు తీయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో హర్షిత్ అతడితో ఢీకొనడం జరిగింది. దీనిని గమనించిన హర్షిత్ ఒక్కసారిగా ఆశ్చర్యంతో చేతులు చాచాడు. ఇక రిజ్వాన్ మాత్రం కొన్ని క్షణాలు వెనక్కి చూసి, తన పరుగును పూర్తిచేశాడు. ఈ ఘటనను చూసిన అభిమానులు 2017 ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో జరిగిన వివాదాన్ని గుర్తు చేసుకున్నారు.
ఇక, గతంలో కూడా ఇటువంటి వివాదాస్పద సంఘటనలు క్రికెట్‌లో చోటుచేసుకున్నాయి. డిసెంబర్ 2024లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా యువ ఆటగాడు సామ్ కాన్స్టాస్ మధ్య జరిగిన ఘర్షణ హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఘటన కారణంగా కోహ్లీపై 20 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించడంతో పాటు ఐసిసి డీమెరిట్ పాయింట్ విధించింది. అంతేకాదు, ఆస్ట్రేలియా మీడియా కోహ్లీపై వ్యతిరేక ప్రచారం కూడా చేసింది.
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన మ్యాచ్‌లను తటస్థ వేదికలో ఆడుతుండటంతో ఈ మ్యాచ్ దుబాయ్‌లో జరిగింది. ఈ క్రమంలో హర్షిత్ రాణా, రిజ్వాన్ మధ్య జరిగిన ఈ సంఘటన క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. మ్యాచ్ ముగిసే సరికి రిజ్వాన్ 77 బంతుల్లో 46 పరుగులు చేయగా, హర్షిత్ 7.4 ఓవర్లలో 30 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు.
2025 ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా జరిగిన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరిగింది. పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని, 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. సౌద్ షకీల్ 62, మహ్మద్ రిజ్వాన్ 46 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు, హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశారు. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్ ని రోహిత్ శర్మ 20(15) తో మొదలు పెట్టగా, గిల్-కోహ్లీ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 46 వ్యక్తిగత పరుగుల వద్ద గిల్ అవుట్ అవ్వగా, శ్రేయాస్ తో కలిసి విరాట్ భారత్ కి విజయాన్ని అందించే దిశగా కొనసాగించారు. చివరిగా కోహ్లీ శతకం పూర్తిచేసుకోగా, ఇంకా 45 బంతులు మిగిలి ఉండగానే ఇండియా పాకిస్థాన్ పై 6 వికెట్ల తడతో గెలుపొందింది.
Shoulder bump between molvi rizwan and harshit pic.twitter.com/bhouhyfoUy
— ` (@Manan_Vk) February 23, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..