AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN: బంగ్లాతో తొలి టీ20 ఆడే భారత జట్టు ఇదే.. ప్లేయింగ్ 11లో ధోని ఫ్రెండ్‌కు నో ఛాన్స్?

Indian Team Predicted Playing 11: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఇపప్పటికే భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ టీమ్‌లో చాలా ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకున్నారు. మయాంక్ యాదవ్, నితీష్ రెడ్డి వంటి ఆటగాళ్లను టీ20 జట్టులోకి తీసుకున్నారు. ఈ ఆటగాళ్లకు అరంగేట్రం చేసే అవకాశం లభించవచ్చు. నితీష్ రెడ్డి కూడా జింబాబ్వే టూర్‌కు ఎంపికైనప్పటికీ గాయం కారణంగా వైదొలగాల్సి వచ్చింది. ఈసారి అతనికి ఆడే అవకాశం లభించవచ్చు.

IND vs BAN: బంగ్లాతో తొలి టీ20 ఆడే భారత జట్టు ఇదే.. ప్లేయింగ్ 11లో ధోని ఫ్రెండ్‌కు నో ఛాన్స్?
Ind Vs Ban 1st T20i
Venkata Chari
|

Updated on: Sep 30, 2024 | 11:55 AM

Share

Indian Team Predicted Playing 11: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఇపప్పటికే భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ టీమ్‌లో చాలా ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకున్నారు. మయాంక్ యాదవ్, నితీష్ రెడ్డి వంటి ఆటగాళ్లను టీ20 జట్టులోకి తీసుకున్నారు. ఈ ఆటగాళ్లకు అరంగేట్రం చేసే అవకాశం లభించవచ్చు. నితీష్ రెడ్డి కూడా జింబాబ్వే టూర్‌కు ఎంపికైనప్పటికీ గాయం కారణంగా వైదొలగాల్సి వచ్చింది. ఈసారి అతనికి ఆడే అవకాశం లభించవచ్చు.

జట్టు ప్రకటన తర్వాత ప్లేయింగ్ ఎలెవన్‌పై పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎవరికి అవకాశం ఇవ్వవచ్చు. ఎవరిని వదులుకోవచ్చు. టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఏ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వవచ్చు, జట్టు నుంచి ఎవరిని తొలగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనర్లు..

ఓపెనర్‌గా అభిషేక్ శర్మ ఎంపికైనప్పటికీ రెండో ఓపెనర్‌గా ఎవరిని ఆడిస్తారో చూడాలి. ఇది కోచ్, కెప్టెన్ ముందున్న పెద్ద ప్రశ్న. మొత్తం టీమ్‌ను పరిశీలిస్తే, అభిషేక్ శర్మతో ఓపెనింగ్ చేయడానికి సంజు శాంసన్ ఎంపికగా కనిపిస్తాడు. ఆ తర్వాత, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో, రియాన్ పరాగ్ నాలుగో స్థానంలో ఆడవచ్చు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ ఆడవచ్చు.

శివమ్ దూబే కూడా ఎంపికైనప్పటికీ, అతనికి ప్రస్తుతం మొదటి మ్యాచ్‌లో అవకాశం లభించకపోవచ్చు. చాలా కాలం తర్వాత వరుణ్ చక్రవర్తి తిరిగి భారత జట్టులోకి వచ్చాడు. అటువంటి పరిస్థితిలో, అతను ఆడే అవకాశం పొందవచ్చు. రవి బిష్ణోయ్ తొలి మ్యాచ్‌కు దూరంగా ఉండవచ్చు. వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్ ఇద్దరు స్పిన్నర్లుగా ఆడగలరు. ఆ తర్వాత, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా రూపంలో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను ఆడవచ్చు.

బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టీ20 ఆడే భారత ప్రాబబుల్ జట్టు: అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), ర్యాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..