IND vs BAN: రెండో టీ20 నుంచి తెలుగబ్బాయ్ ఔట్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు.. ఎందుకంటే?
Indian Cricket Team Predicted Playing 11 vs Bangladesh 2nd T20I: బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. ఇప్పుడు రెండో టీ20 మ్యాచ్ వంతు వచ్చింది. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ బుధవారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పు రావొచ్చు. రెండో మ్యాచ్‌లో ఏ ఆటగాళ్లు ఆడగలరో ఓసారి చూద్దాం..

నితీష్ రెడ్డి స్థానంలో తిలక్ వర్మకు అవకాశం వస్తుందా?
ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా సంజూ శాంసన్, అభిషేక్ శర్మలకు మాత్రమే అవకాశం దక్కవచ్చు. ఈ ఇద్దరు ఆటగాళ్లు మొదటి మ్యాచ్‌లో ఓపెనింగ్ చేశారు. మరోసారి వారే ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మూడో స్థానంలో ఆడవచ్చు. అయితే నాలుగో నంబర్ జట్టులో పెద్ద మార్పు రావచ్చు. గత మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన నితీశ్‌రెడ్డి.. ఆకట్టుకున్నా, ఈ స్థానం నుంచి తప్పుకునే అవకాశం ఉంది. నితీష్ రెడ్డి 2 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి బౌలింగ్ చేయగా, బ్యాటింగ్ చేస్తూ 16 పరుగులు చేశాడు. అతని స్థానంలో తిలక్ వర్మకు ఛాన్స్ రావొచ్చు.
ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్‌లు జట్టులో చేరనున్నారు. గత మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ కారణంగా అతను ఆడటం ఖాయం. దీంతో పాటు ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ కూడా ఆడవచ్చు. ఫాస్ట్ బౌలర్లలో మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ ఆడగలరు. ఈ ఇద్దరు బౌలర్లు గత మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశారు.
బంగ్లాదేశ్‌తో జరిగే రెండో టీ20 మ్యాచ్‌కి భారత్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఇలా ఉండొచ్చు..
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్ రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్.
తొలి టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత జట్టు 11.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..