AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: వావ్.. బుల్లెట్‌ కన్నా వేగంగా దూసుకొచ్చిన బంతి.. ఒంటి చేత్తో లేడీ బుమ్రా కళ్లు చెదిరే క్యాచ్‌

Kranti Gaud Stunning One Handed Catch: మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల క్రాంతి గౌడ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కొద్ది నెలల్లోనే టీమ్ ఇండియాకు ప్రధాన పేస్ బౌలర్‌గా మారింది. గతంలో ముంబై ఇండియన్స్ నెట్ బౌలర్‌గా ఉన్న క్రాంతి, అసాధారణమైన ప్రతిభతో తక్కువ కాలంలోనే జాతీయ జట్టులో స్థానం సంపాదించింది.

Video: వావ్.. బుల్లెట్‌ కన్నా వేగంగా దూసుకొచ్చిన బంతి.. ఒంటి చేత్తో లేడీ బుమ్రా కళ్లు చెదిరే క్యాచ్‌
Kranti Gaud Video
Venkata Chari
|

Updated on: Oct 10, 2025 | 6:47 AM

Share

Kranti Gaud Stunning One Handed Catch: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మహిళా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత యువ పేస్ సంచలనం క్రాంతి గౌడ్ అద్భుతమైన ఫీల్డింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. తన బౌలింగ్‌లో వచ్చిన ఓ ప్రమాదకరమైన క్యాచ్‌ను ఒంటిచేత్తో అందుకుని, గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా ఓపెనర్ తాజ్మిన్ బ్రిట్స్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపింది.

ఒంటిచేత్తో అద్భుతం: ‘హ్యాండ్ ఆఫ్ గౌడ్’..

విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో, భారత్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేస్తున్న క్రాంతి గౌడ్ వేసిన ఒక లెంగ్త్ బంతిని తాజ్మిన్ బ్రిట్స్ గట్టిగా డ్రైవ్ చేయబోయింది. బంతి వేగంగా, నేరుగా బౌలర్ వైపు దూసుకొచ్చింది. బంతిని చూసిన వెంటనే క్రాంతి గౌడ్, తన బౌలింగ్ ఫాలో-త్రూలో క్షణాల్లో స్పందించి, ఎడమ చేతిని అమాంతం చాచి, బుల్లెట్ వేగంతో వచ్చిన ఆ బంతిని ఒడిసిపట్టింది.

క్రాంతి గౌడ్ కళ్లు చెదిరే క్యాచ్..

ఈ క్యాచ్ చూసిన వారంతా అవాక్కయ్యారు. క్యాచ్ అందుకున్న వెంటనే క్రాంతి కిందపడిపోయింది. అంత వేగంగా వచ్చిన బంతిని, అద్భుతమైన రిఫ్లెక్స్‌తో ఒంటిచేత్తో పట్టుకోవడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. క్యాచ్ అందుకున్న క్రాంతిని చూసి సహచర క్రీడాకారిణులు, ముఖ్యంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. క్రాంతి ఈ వికెట్ తీయడం ద్వారా భారత్‌కు కీలకమైన, తొలి బ్రేక్‌త్రూ లభించింది. కామెంటేటర్లు కూడా ఈ క్యాచ్‌ను ప్రశంసిస్తూ, ఫుట్‌బాల్ లెజెండ్ డీగో మారడోనా ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ను గుర్తు చేస్తూ, దీన్ని ‘హ్యాండ్ ఆఫ్ గౌడ్’ అని అభివర్ణించారు.

క్రాంతి గౌడ్ సంచలన ప్రయాణం..

మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల క్రాంతి గౌడ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కొద్ది నెలల్లోనే టీమ్ ఇండియాకు ప్రధాన పేస్ బౌలర్‌గా మారింది. గతంలో ముంబై ఇండియన్స్ నెట్ బౌలర్‌గా ఉన్న క్రాంతి, అసాధారణమైన ప్రతిభతో తక్కువ కాలంలోనే జాతీయ జట్టులో స్థానం సంపాదించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో 6 వికెట్లు తీయడం, అంతకుముందు పాకిస్థాన్‌పై అద్భుత ప్రదర్శన చేయడంతో ఆమె ప్రాధాన్యత జట్టులో పెరిగింది. దక్షిణాఫ్రికాపై ఈ అద్భుత క్యాచ్ ఆమె కెరీర్‌లో మరో మరుపురాని క్షణంగా నిలిచింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..