AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ప్రమాదంలో ముగ్గురు ఆటగాళ్ల కెరీర్.. భారత టీ20ఐ జట్టులో ఇకపై వీరి రీఎంట్రీ కష్టమే..?

Indian Cricket Team: టీమిండియాలో చోటు కోసం ఎంతోమంది ప్లేయర్లు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే స్థానం సంపాదించిన ప్లేయర్లు తమ స్థానాన్ని కాపాడుకోవడానికి తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం టీ20 జట్టులో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చేందుకు కష్టపడుతున్న ఆటగాళ్లు ముగ్గురు ఉన్నారు. వారు ఎవరు, వారికి ఎవరి నుంచి పోటీ ఉంటుందో చూద్దాం..

Team India: ప్రమాదంలో ముగ్గురు ఆటగాళ్ల కెరీర్.. భారత టీ20ఐ జట్టులో ఇకపై వీరి రీఎంట్రీ కష్టమే..?
Team India T20i Squad
Venkata Chari
|

Updated on: Jan 24, 2025 | 5:52 PM

Share

Team India: భారత జట్టులో స్థానం సంపాదించడం ఎల్లప్పుడూ కష్టమే. ఐపీఎల్ వచ్చినప్పటి నుంచి ఆటగాళ్ల మధ్య చాలా పోటీ ఉంది. ఇప్పుడు ప్రతి స్థానానికి అనేక ఎంపికలు ఉన్నాయి. అందుకే ప్రతి ఆటగాడు తన స్థానాన్ని కాపాడుకోవడానికి స్థిరమైన ఆటను ప్రదర్శించాల్సిన అవసరం ఏర్పడింది. టీమిండియా టీ20 జట్టులోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. భారత్‌లో విపరీతమైన టీ20 ఆటగాళ్లు ఉన్నారు. చాలామంది కీలక ఆటగాళ్లు కొంతకాలంగా టీ20 జట్టులో లేరు. కానీ, ఇప్పటికీ భారత జట్టు నిరంతర విజయాలను అందుకుంటూనే ఉంది.

రీప్లేస్‌మెంట్స్‌గా ఎంపికైన ఆటగాళ్లు టీ20 టీమ్‌లో తమకు వచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకున్నారు. అందుకే వారు ఇప్పుడు ప్రధాన ఆటగాళ్లకు సమస్యగా మారారు. ఎందుకంటే, ఇప్పుడు వారి పునరాగమనం అంత సులభం కాదు.

3. కుల్దీప్ యాదవ్‌కు ముప్పుగా మారిన వరుణ్ చక్రవర్తి..

చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చివరిసారిగా గతేడాది ప్రపంచకప్ ఫైనల్లో భారత్ తరపున టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అతనికి టీ20 జట్టులో అవకాశం రాకపోవడంతో ఇప్పుడు వరుణ్ చక్రవర్తి అతనికి పెద్ద ముప్పుగా మారాడు. వరుణ్ తిరిగి వచ్చినప్పటి నుంచి, అతను విధ్వంసం సృష్టిస్తున్నాడు. ప్రధాన స్పిన్నర్‌గా తన స్థానాన్ని దాదాపుగా సుస్థిరం చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కుల్‌దీప్‌కు పునరాగమనం అంత సులువు కాదు.

2. యశస్వి జైస్వాల్‌ను ఇబ్బంది పెడుతోన్న అభిషేక్ శర్మ..

యశస్వి జైస్వాల్ ఒకప్పుడు టీ20లో క్రమం తప్పకుండా ఆడేవాడు. అయితే కొంతకాలంగా అతను కూడా భారతదేశం కోసం పొట్టి ఫార్మాట్‌లో ఆడలేదు. అతని స్థానంలో అభిషేక్ శర్మకు అవకాశం లభిస్తోంది. ఈ ఆటగాడు తన ప్రదర్శనతో నిరంతరం అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అభిషేక్‌కు ఆరంభం నుంచి వేగంగా పరుగులు సాధించే సత్తా ఉంది. దీనికి తాజా ఉదాహరణ ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో చూశాం. ఇటువంటి పరిస్థితిలో ఇప్పుడు యశస్వి తిరిగి రావడానికి అభిషేక్ శర్మ సవాలును అధిగమించవలసి ఉంటుంది.

1. రిషబ్ పంత్‌ రీఎంట్రీని కష్టంగా మార్చుతోన్న సంజు శాంసన్..

టెస్టు ఫార్మాట్‌లో రిషబ్ పంత్ సాధించినంత విజయాలు వన్డే, టీ20ల్లో అందుకోలేకపోయాడు. అయినప్పటికీ, టీ20లో ఈ ఆటగాడిపై భారత్ నిరంతరం విశ్వాసం వ్యక్తం చేసింది. అయితే, ఇప్పుడు టీమిండియాకు సంజూ శాంసన్ రూపంలో అద్భుతమైన వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ దొరికాడు. శాంసన్‌కి ఇప్పుడు రెగ్యులర్‌ అవకాశాలు అందుకుంటూ ఓపెనర్‌గా దూసుకుపోతున్నాడు. గతేడాది కూడా ఈ ఫార్మాట్‌లో భారత్‌ తరపున మూడు సెంచరీలు సాధించాడు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ రికార్డు ఉన్న పంత్ మళ్లీ టీ20 జట్టులోకి రావడం అంత సులువు కాదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

'జైలర్ ' విలన్‌కు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స.. ఏమైందంటే?
'జైలర్ ' విలన్‌కు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స.. ఏమైందంటే?
CAT 2025లో 12మందికి 100 పర్సంటైల్.. తెలుగు రాష్ట్రాల్లో నో టాపర్
CAT 2025లో 12మందికి 100 పర్సంటైల్.. తెలుగు రాష్ట్రాల్లో నో టాపర్
భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి.. ఎక్కడంటే
భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి.. ఎక్కడంటే
నిరుద్యోగులకు పండగపూట శుభవార్త.. తెలంగాణ RTCలో ఉద్యోగ నోటిఫికేషన్
నిరుద్యోగులకు పండగపూట శుభవార్త.. తెలంగాణ RTCలో ఉద్యోగ నోటిఫికేషన్
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..