AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం ట్విస్ట్ ఇచ్చార్రా మావా.. 8 టెస్టులు.. 96 పాయింట్లు.. ఆసీస్ దెబ్బతో గిల్ సేన మైండ్ బ్లాంక్..!

India WTC 2027 Qualification: ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2027 రేసు మరింత ఉత్కంఠగా మారింది. ఆస్ట్రేలియా చేతిలో బంగ్లాదేశ్ చిత్తుగా ఓడిపోవడంతో భారత జట్టుకు ఊహించని వెసులుబాటు దక్కింది. ప్రస్తుత పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతున్న శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియాకు లండన్ ఫైనల్ చేరేందుకు సమీకరణాలు స్పష్టమయ్యాయి.

ఏం ట్విస్ట్ ఇచ్చార్రా మావా.. 8 టెస్టులు.. 96 పాయింట్లు.. ఆసీస్ దెబ్బతో గిల్ సేన మైండ్ బ్లాంక్..!
India Wtc 2027 Qualification
Venkata Chari
|

Updated on: Aug 23, 2026 | 5:52 PM

Share

India WTC 2027 Qualification: మెకే వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 64, రెండో ఇన్నింగ్స్‌లో 95 పరుగులకే కుప్పకూలింది. ఈ దారుణ పరాజయంతో పాయింట్ల పట్టికలో స్థానాలు మారకపోయినా, బంగ్లాదేశ్ పాయింట్ల శాతం (పీసీటీ) 55.56 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం భారత్ 10 టెస్టుల్లో 64 పాయింట్లతో 53.33% పీసీటీతో ఐదో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్‌కు, భారత్‌కు మధ్య వ్యత్యాసం కేవలం 2.23 శాతానికి తగ్గడం టీమిండియాకు పెద్ద ఊరటనిస్తోంది.

ఎక్కువమంది చదివినది: ఇదెక్కడి మ్యాచ్ భయ్యా.. చెత్త రికార్డులకే చిరాకు తెప్పించారుగా.. లిస్ట్ చూస్తే పరేషానే..!

గిల్ సేన ముందున్న 8 టెస్టుల సమరం..

డబ్ల్యూటీసీ ఫైనల్ 2027 జూన్ 9 నుంచి 13 వరకు లండన్‌లోని ది ఓవల్ మైదానంలో జరగనుంది. ఏప్రిల్ 30, 2027 నాటికి పాయింట్ల శాతంలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు టైటిల్ పోరుకు అర్హత సాధిస్తాయి. ప్రస్తుతం పట్టికలో ఆస్ట్రేలియా (80.00%), దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ (72.22%) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. భారత్ ఫైనల్ చేరాలంటే ఈ మూడింటిలో కనీసం రెండు జట్లను వెనక్కి నెట్టాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

టీమిండియా ఆడాల్సిన మిగిలిన మ్యాచ్‌ల వివరాలు:

శ్రీలంకతో రెండో టెస్టు (కొలంబో)

న్యూజిలాండ్‌తో 2 టెస్టులు (వెల్లింగ్టన్, క్రైస్ట్‌చర్చ్)

ఆస్ట్రేలియాతో స్వదేశంలో 5 టెస్టుల సిరీస్ (నాగ్‌పూర్, చెన్నై, గువాహటి, రాంచీ, అహ్మదాబాద్)

ఫైనల్ చేరడానికి నాలుగు కీలక సమీకరణాలు..

భారత్ ముందు గరిష్టంగా 96 పాయింట్లు సాధించే అవకాశం ఉంది. ఫలితాలను బట్టి పీసీటీ ఎలా మారుతుందంటే:

8 మ్యాచ్‌లూ గెలిస్తే (74.07%): భారత్‌కు తిరుగులేని మార్గం ఇది. మొత్తం 216 పాయింట్లకు 160 పాయింట్లు సాధించి గరిష్ట పీసీటీతో నిలుస్తుంది. ప్రత్యర్థి జట్ల నుంచి పాయింట్లు లాక్కున్నట్లే అవుతుంది.

7 విజయాలు, 1 డ్రా (70.37%): భారత్ 152 పాయింట్లతో 70.37% సాధిస్తుంది. ఈ స్థితిలో ఫైనల్ అవకాశాలు బలంగానే ఉంటాయి, కానీ ఇతర జట్ల ఫలితాలపై కాస్త ఆధారపడాల్సి వస్తుంది.

6 విజయాలు, 2 ఓటములు (62.96%): పీసీటీ 62.96%కి పడిపోతుంది. పైనున్న రెండు జట్లు ఘోరంగా విఫలమైతే తప్ప భారత్‌కు అవకాశం ఉండదు.

5 లేదా అంతకంటే తక్కువ విజయాలు (57.41%): ఈ సమీకరణం భారత్‌ను దాదాపుగా టోర్నీ నుంచి నిష్క్రమింపజేస్తుంది.

ప్రత్యర్థులను నేరుగా దెబ్బ కొట్టే అవకాశం..

న్యూజిలాండ్‌తో జరిగే 2 టెస్టుల సిరీస్ ద్వారా 24 పాయింట్లు సాధించే వెసులుబాటు ఉంది. ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే 5 టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అత్యంత కీలకం కానుంది. ఇందులో 60 పాయింట్లు అందుబాటులో ఉన్నాయి. కంగారూలను 4-1 లేదా 5-0తో ఓడిస్తే పాయింట్ల పట్టిక పూర్తిగా తలకిందులవుతుంది. ఆసీస్‌ను కిందకు నెట్టి భారత్ అగ్రస్థానాల్లోకి దూసుకెళ్లే అవకాశం దక్కుతుంది.

ఎక్కువమంది చదివినది: SL vs IND 2nd Test: శుభ్‌మన్ గిల్ అరుదైన ప్రపంచ రికార్డ్.. ఈ దశాబ్దంలోనే ఎవరికీ సాధ్యం కాలేగా..!

శ్రీలంకతో జరుగుతున్న కొలంబో టెస్టులో విజయం సాధిస్తే భారత్ పీసీటీ వెంటనే 57.58 శాతానికి చేరి బంగ్లాదేశ్‌ను అధిగమిస్తుంది. ఆ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగే కీలక సమరాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తే శుభ్‌మన్ గిల్ సేన వరుసగా మరోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ బరిలో నిలవడం ఖాయం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us