AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDW vs ENGW: ప్చ్.. చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో ఆగిపోయిన స్మృతి మంధాన!

లార్డ్స్‌లో జరిగిన ఏకైక టెస్టు తొలి రోజు భారత మహిళలు అద్భుత ప్రదర్శన కనబరిచారు. స్మృతి మంధాన (83), హర్మన్‌ప్రీత్ కౌర్ (58), దీప్తి శర్మ (57) హాఫ్ సెంచరీలతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులు చేసింది. ఇస్సీ వాంగ్, సోఫీ ఎక్లెస్టోన్ బౌలింగ్‌లో ఇంగ్లాండ్ పుంజుకున్నా, భారత బ్యాటర్లు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పారు.

INDW vs ENGW: ప్చ్.. చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో ఆగిపోయిన స్మృతి మంధాన!
Smriti Mandhana
SN Pasha
|

Updated on: Jul 11, 2026 | 8:32 AM

Share

చారిత్రక మైదానం, క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ ప్రారంభమైన ఏకైక టెస్టు మ్యాచ్ తొలి రోజు భారత్ అమ్మాయిలు ఆకట్టుకున్నారు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతమైన బ్యాటింగ్‌తో 83 పరుగులు చేయగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (58), ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (57) హాఫ్ సెంచరీలతో రాణించారు. వీరి పోరాటంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులు నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు మంధాన మంచి ఆరంభాన్ని అందించింది. చూడచక్కని షాట్లతో ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు నడిపించింది. మరోవైపు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 89 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఒక దశలో భారత్ 300కు పైగా స్కోరు చేసేలా కనిపించింది.

అయితే ఫాస్ట్ బౌలర్ ఇస్సీ వాంగ్ బౌలింగ్‌లో మంధాన ఎడ్జ్ ఇవ్వగా, వికెట్ కీపర్ అమీ జోన్స్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో ఆమె ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో లార్డ్స్‌లో టెస్టు సెంచరీ నమోదు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచే అరుదైన అవకాశం మంధానకు చేజారింది. టీ విరామానికి ముందు చివరి బంతికే ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసిన మ్యాడీ విలియర్స్ బౌలింగ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ అవుటవడం భారత్‌కు మరో ఎదురుదెబ్బగా మారింది. అనంతరం ఇంగ్లండ్ స్పిన్నర్లు మ్యాచ్‌పై పట్టు సాధించారు. ముఖ్యంగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ 3 వికెట్లు తీసింది. మంధాన అవుటయ్యే సమయానికి 190/3తో బలంగా ఉన్న భారత్, చివర్లో కుప్పకూలి చివరి నాలుగు వికెట్లను కేవలం 11 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది.

తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే భారత్ షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ క్రికెట్‌కు ఈ టెస్టు అనంతరం వీడ్కోలు పలకనున్న ఓపెనర్ టామీ బ్యూమాంట్‌ను ఫాస్ట్ బౌలర్ క్రాంతి గౌడ్ కేవలం రెండు పరుగులకే ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ ఒక వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది. ఇంకా భారత్ తొలి ఇన్నింగ్స్ కంటే 264 పరుగులు వెనుకబడి ఉండటంతో, రెండో రోజు ఆట ఇరు జట్లకు కీలకంగా మారింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..
ఏపీకి తొలి వందే భారత్ స్లీపర్.. ముహూర్తం ఖారారు.. అప్పటినుంచే..
32 ఫోర్లు, 17 సిక్సర్లు.. ఎకానా గడ్డ.. సర్పంచ్ సాబ్ అడ్డా
32 ఫోర్లు, 17 సిక్సర్లు.. ఎకానా గడ్డ.. సర్పంచ్ సాబ్ అడ్డా
రోజూ నీరసంగా ఉంటున్నారా? ఈ సహజ ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకోండి
రోజూ నీరసంగా ఉంటున్నారా? ఈ సహజ ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకోండి
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'
'జీవిత భాగస్వామిగా భావించా.. నీకు ఎయిడ్స్ ఉందా? అన్నాడు'
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
అరసవల్లి సూర్యనారాయణ స్వామికి అపురూప ఆభరణాల సమర్పణ.. విలువెంతంటే
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
దసరా, దీపావళికి ఇంటికెళ్తున్నారా..? ఈ రైళ్లల్లో సీట్లు ఖాళీ
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
టీ20I డెబ్యూలోనే దుమ్ములేపిన నమన్ ధీర్
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN