Video: ట్రోఫీ విజేతలకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం.. వారే మా బ్యాక్ బోన్ అంటోన్న త్రిష, దిృతి

India Wins ICC Womens U19 T20 World Cup Hyderabad: భారత మహిళల అండర్-19 క్రికెట్ జట్టు ఐసిసి మహిళల U19 టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌ను గెలుచుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది. దృతి కేసరి, గొంగడి త్రిష తమ విజయానంతర అనుభవాలను పంచుకున్నారు. త్రిష టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు సాధించి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును గెలుచుకుంది. వారిద్దరూ తమ తల్లిదండ్రులు, కోచ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

Video: ట్రోఫీ విజేతలకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం.. వారే మా బ్యాక్ బోన్ అంటోన్న త్రిష, దిృతి
Women's Under 19 Cricket Te
Follow us
Venkata Chari

|

Updated on: Feb 04, 2025 | 3:05 PM

ICC Womens U19 T20 World Cup Champions: కౌలాలంపూర్‌లో జరిగిన ఐసిసి మహిళల U19 టీ20 ప్రపంచ కప్ నుంచి విజయవంతంగా తిరిగి వచ్చిన భారత మహిళల అండర్-19 క్రికెట్ జట్టుకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టోర్నమెంట్‌ను గెలుచుకున్న భారత జట్టు.. మంగళవారం ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో ఓడించి వరుసగా రెండోసారి ట్రోఫీని గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో భారీ సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకున్న అభిమానులు.. భారత అమ్మాయిలకు స్వాగతం పలికారు. ఈ క్రమంలో ANIతో మాట్లాడిన భారత మహిళ క్రికెటర్లు దృథి కేసరి, గొంగడి త్రిష తమ అనుభవాలు పంచుకున్నారు. ముందుగా దృథి కేసరి మాట్లాడుతూ, “మన దేశం అగ్రస్థానంలో ఉందని, రెండుసార్లు ట్రోపీ గెలిచిన సంగతి తెలిసిందే. నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పటి నుంచి విరాట్ కోహ్లీ నాకు స్ఫూర్తినిచ్చారు. నా కుటుంబం నాకు వెన్నెముక. క్రెడిట్ అంతా నా తల్లిదండ్రులకే చెందుతుంది” అంటూ చెప్పుకొచ్చింది.

ఈ పోటీలో భారత్‌కు ట్రోఫీ అందించడంలో కీలకంగా మారిన గొంగడి త్రిష.. 44(33)* పరుగులతో, ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ ఇన్నింగ్స్‌తో భారత్‌ను విజయ తీరాలకు చేర్చడంలో సహాయం చేసింది. మొత్తంగా టోర్నీలో 309 పరుగులతో ముగించిన త్రిష.. బంతితో ఏడు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను గెలుచుకుంది.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. “ఇది నాకు ఒక ప్రత్యేక క్షణం – ప్రపంచ కప్ గెలవడం, అది కూడా రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కావడం సంతోషంగా ఉంది. నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టింది నాన్న వల్లే. నా తల్లిదండ్రులు లేకుండా నేను ఇక్కడ లేను. ఈ టైటిల్‌తోపాటు సెంచరీని కూడా వారికి అంకితం చేయాలనుకుంటున్నాను. భారత క్రికెటర్ మిథాలీ రాజ్ నా ఆదర్శం” అంటూ ఆమె సంతోషం వ్యక్తం చేసింది.

BCCIలో స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ షాలిని మాట్లాడుతూ, “వీళ్ల ప్రదర్శన ఏమాత్రం ఆశ్చర్యం కలిగించదు. త్రిష బాగా రాణిస్తుందని మేం ఆశించిందే. ఆమె నాకు చిన్నప్పటి నుంచీ తెలుసు. ఈసారి ఆమె అత్యధిక పరుగులు సాధించినందున ఇది ప్రత్యేకంగా ఉంటుంది. ఆమె పట్ల మాకు చాలా గర్వంగా ఉంది” అని తెలిపింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..