AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India vs Zimbabwe Women 3rd T20 Highlights: 3వ టీ20లోనూ భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్

IND-W vs ZIM-W 3rd T20 highlights in Telugu: రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మొదలైన ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన భారత్ ఇప్పటికే సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది.

India vs Zimbabwe Women 3rd T20 Highlights: 3వ టీ20లోనూ భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
India Vs Zimbabwe Women 3rd T20 Live
Venkata Chari
|

Updated on: Oct 20, 2026 | 10:40 PM

Share

IND-W vs ZIM-W 3rd T20 Highlights in Telugu: జింబాబ్వే మహిళలతో జరిగిన మూడో టీ20లో భారత్ మహిళల జట్టు 92 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. భారత జట్టు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేసింది. షార్నే మేయర్స్ 60 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా, జింబాబ్వేకు విజయం అందలేదు.

భారత్ చేతిలో జింబాబ్వేకు భారీ ఓటమి..

మూడో టీ20లో జింబాబ్వే మహిళల జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. దీంతో భారత్ 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

జింబాబ్వే బ్యాటర్లలో షార్నే మేయర్స్ అత్యధికంగా 49 బంతుల్లో 60 పరుగులు చేశారు. ఆమె ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. మేయర్స్ స్ట్రైక్ రేట్ 122.45గా నమోదైంది.

ఆమెకు తోడుగా బెలోవ్డ్ బిజా 50 బంతుల్లో 44 పరుగులు చేశారు. ఆమె ఖాతాలో 5 ఫోర్లు ఉన్నాయి. వీరిద్దరూ జింబాబ్వే స్కోరును కొంతవరకు ముందుకు తీసుకెళ్లారు.

మిగిలిన బ్యాటర్లలో చిపో ముగేరి-తిరిపానో 5 బంతుల్లో 7 పరుగులు చేశారు. న్యాషా గ్వాంజురా 7 బంతుల్లో 2 పరుగులు చేయగా, కెలిస్ ఎన్‌ద్లోవు ఒక్క పరుగు కూడా చేయకుండా పెవిలియన్ చేరారు. మోడెస్టర్ ముపాచిక్వా 4 పరుగులు చేశారు. చివర్లో టెండాయి మకుషా 1, నోమ్వెలో సిబందా 1 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

షార్నే మేయర్స్ ఒంటరి పోరాటం..

జింబాబ్వే తరఫున షార్నే మేయర్స్ మాత్రమే భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. 49 బంతుల్లో 60 పరుగులు చేసి అర్ధ సెంచరీ పూర్తి చేశారు. అయితే మరో ఎండ్‌లో వికెట్లు పడటంతో జింబాబ్వే భారీ లక్ష్యానికి చేరువ కాలేకపోయింది.

భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో జింబాబ్వే రన్‌రేట్ పెంచుకోలేకపోయింది. చివరకు 20 ఓవర్లు ముగిసే సమయానికి 124/7 వద్ద ఇన్నింగ్స్ ముగించింది.

జింబాబ్వే మహిళలు ప్లేయింగ్ XI: కెలిస్ నధ్లోవు, ప్రియమైన బిజా, చిపో ముగేరి-తిరిపానో, షార్నే మేయర్స్, జోసెఫిన్ న్కోమో(సి), న్యాషా గ్వాన్జురా, మోడెస్టర్ ముపాచిక్వా(w), కుడ్జాయ్ చిగోరా, లోరిన్ ఫిరి, టెండై మకుషా, నోమ్వెలో సిబ్.

భారత మహిళలు ప్లేయింగ్ XI: షఫాలీ వర్మ, స్మృతి మంధాన (సి), అనుష్క శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, నికి ప్రసాద్, రిచా ఘోష్ (w), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, నందనీ శర్మ, క్రాంతి గౌడ్, ప్రేమ రావత్.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 20 Oct 2026 10:14 PM (IST)

    IND W vs ZIM W Result: 3వ టీ20లోనూ భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్

    జింబాబ్వే మహిళలతో జరిగిన మూడో టీ20లో భారత్ మహిళల జట్టు 92 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. భారత జట్టు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేసింది. షార్నే మేయర్స్ 60 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా, జింబాబ్వేకు విజయం అందలేదు.

  • 20 Oct 2026 10:03 PM (IST)

    4 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే

    17.1 ఓవర్లకు జింబాబ్వే 4 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది.

  • 20 Oct 2026 09:54 PM (IST)

    3వ వికెట్ కోల్పోయిన జింబాబ్వే

    15 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది.

  • 20 Oct 2026 09:17 PM (IST)

    ముగిసిన పవర్ ప్లే

    పవర్ ప్లే ముగిసే సమయానికి జింబాబ్వే టీం 2 వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది.

  • 20 Oct 2026 09:02 PM (IST)

    2 వికెట్లు కోల్పోయిన జింబాబ్వే

    జింబాబ్వే 2 వికెట్లు కోల్పోయి 14 పరుగులు చేసింది.

  • 20 Oct 2026 08:54 PM (IST)

    ఫస్ట్ బాల్‌కే వికెట్.. బ్రేకిచ్చిన క్రాంతి గౌడ్

    217 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన జింబాబ్వే ఫస్ట్ బాల్‌కే తొలి వికెట్‌ కోల్పోయింది.

  • 20 Oct 2026 08:35 PM (IST)

    IND W vs ZIM W: జింబాబ్వే టార్గెట్ 217

    భారత జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి జింబాబ్వే ముందు 217 పరుగుల టార్గెట్ అందిచింది. భారత తరపున షఫాలీ వర్మ 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 186.49 స్ట్రైక్ రేట్‌తో 69 పరుగులు చేసి, బిజా బౌలింగ్‌లో మకుషాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. అనుష్క శర్మ 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో (స్ట్రైక్ రేట్ 140.00) 28 పరుగులు చేసి, శిబాందా బౌలింగ్‌లో గ్వాంజురాకు క్యాచ్ ఇచ్చారు. నికి ప్రసాద్ 12 బంతుల్లో 1 ఫోర్‌తో 9 పరుగులు చేసి, గ్వాంజురా బౌలింగ్‌లో ఫిరికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. హర్మన్‌ప్రీత్ కੌਰ కేవలం 41 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో అద్భుతమైన స్ట్రైక్ రేట్ 221.95 తో 91 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. రిచా ఘోష్ 3 బంతుల్లో 1 పరుగు చేసి, బిజా బౌలింగ్‌లో గ్వాంజురాకు క్యాచ్ ఇచ్చారు. దీప్తి శర్మ 3 బంతుల్లో పరుగులేమీ చేయకుండా, మకుషా బౌలింగ్‌లో ముపాచిక్వాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు. అరుంధతి రెడ్డి 2 బంతుల్లో 1 ఫోర్‌తో 4 పరుగులు జోడించి, బిజా బౌలింగ్‌లో చిగోరాకు క్యాచ్ ఇచ్చారు. ప్రేమ రావత్ 2 బంతుల్లో 1 ఫోర్‌తో 4 పరుగులు చేసి శిబాందా మరియు మకుషా చేతిలో రన్ అవుట్ అయ్యారు.

  • 20 Oct 2026 08:29 PM (IST)

    6 వికెట్ డౌన్.. 200లు దాటిన స్కోర్..

    19వ ఓవర్ నడుస్తోంది. ప్రస్తుతం భారత్ 6 వికెట్లు కోల్పోయి 200లు దాటింది.

  • 20 Oct 2026 08:25 PM (IST)

    5వ వికెట్ కోల్పోయిన భారత్..

    18 ఓవర్లకు భారత్ 5 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది.

  • 20 Oct 2026 08:20 PM (IST)

    4 వికెట్ కోల్పోయిన భారత్..

    17 ఓవర్లకు భారత జట్టు 4 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 180 పరుగులు చేసింది.

  • 20 Oct 2026 08:16 PM (IST)

    హర్మన్ ప్రీత్ హాఫ్ సెంచరీ..160 దాటిన స్కోర్

    హర్మన్ ప్రీత్ కేవలం 25 బంతుల్లో తన హాఫ్ సెంచరీ. ఇందులో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి.

  • 20 Oct 2026 08:10 PM (IST)

    షెఫాలీ వర్మ ఔట్..

    షెఫాలీ వర్మ 69 పరుగుల వద్ద పెవిలియన్ చేరింది. దీంతో భారత్ 152 పరుగుల వద్ద 3 వికెట్ కోల్పోయింది

  • 20 Oct 2026 07:57 PM (IST)

    షెఫాలీ వర్మ హాఫ్ సెంచరీ..

    షెఫాలీ వర్మ కేవలం 26 బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఇందులో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి.

  • 20 Oct 2026 07:55 PM (IST)

    10 ఓవర్లకు భారత్ స్కోర్..

    10 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది

  • 20 Oct 2026 07:36 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన భారత్..

    టీమిండియా నయా సెన్సేషన్ నికీ ప్రసాద్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరింది. దీంతో భారత్ ప్రస్తుతం 8 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది.

  • 20 Oct 2026 07:26 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన భారత్..

    అనుష్క శర్మ రూపంలో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. దీంతో భారత్ ప్రస్తుతం 5.2 ఓవర్లలో 54 పరుగులు చేసింది.

  • 20 Oct 2026 07:22 PM (IST)

    4 ఓవర్లకు భారత్ స్కోర్.. 41/0

    4 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు షెపాలీ 10, అనుష్క శర్మ 17 పరుగులతో నిలిచారు. దీంతో భారత్ 34 పరుగులు చేసింది.

  • 20 Oct 2026 06:50 PM (IST)

    ఇరు జట్లు:

    జింబాబ్వే మహిళలు ప్లేయింగ్ XI: కెలిస్ నధ్లోవు, ప్రియమైన బిజా, చిపో ముగేరి-తిరిపానో, షార్నే మేయర్స్, జోసెఫిన్ న్కోమో(సి), న్యాషా గ్వాన్జురా, మోడెస్టర్ ముపాచిక్వా(w), కుడ్జాయ్ చిగోరా, లోరిన్ ఫిరి, టెండై మకుషా, నోమ్వెలో సిబ్.

    భారత మహిళలు ప్లేయింగ్ XI: షఫాలీ వర్మ, స్మృతి మంధాన (సి), అనుష్క శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, నికి ప్రసాద్, రిచా ఘోష్ (w), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, నందనీ శర్మ, క్రాంతి గౌడ్, ప్రేమ రావత్.

  • 20 Oct 2026 06:33 PM (IST)

    IND W vs ZIM W: టాస్ గెలిచిన భారత్..

    టాస్ గెలిచిన భారత జట్టు ముందు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈమేరకు కెప్టెన్ మంధాన మాట్లాడుతూ.. కేవలం మిడిల్ ఆర్డర్‌కు ఎక్కువ ఆడేందుకు సమయం దక్కలేదు. ఈరోజు వారికి కొంత సమయం లభిస్తుందని ఆశిస్తున్నాం” అంటూ చెప్పుకొచ్చాడు.

  • 20 Oct 2026 05:44 PM (IST)

    స్మృతి మంధాన సారథ్యంలో దూకుడు..

    కొత్త కెప్టెన్ స్మృతి మంధాన సారథ్యంలో ‘విమెన్ ఇన్ బ్లూ’ జట్టు రాయ్‌పూర్‌లో జింబాబ్వేను భారీ తేడాతో ఓడించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కైవసం చేసుకుంది.

  • 20 Oct 2026 05:30 PM (IST)

    జింబాబ్వే పరిస్థితి

    భారత్ చేతిలో తాజాగా రెండు ఓటములతో జింబాబ్వే మహిళల జట్టు ఇప్పుడు వరుసగా 22 టీ20ఐ మ్యాచ్‌లలో ఓడిపోయింది. గత సంవత్సరం నమీబియాలో జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఆఫ్రికా రీజియన్ డివిజన్ వన్ క్వాలిఫయర్ 2025 గెలిచినప్పటి నుంచి, జింబాబ్వే యూఏఈ, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మహిళల జట్ల చేతిలో నిరుత్సాహపరిచే సిరీస్ వైట్‌వాష్‌లకు గురైంది.

  • 20 Oct 2026 05:04 PM (IST)

    వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచిన భారత మహిళల క్రికెట్ జట్టు

    ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్‌లో జరిగిన 2026 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ముగిసినప్పటి నుంచి భారత మహిళల క్రికెట్ జట్టు వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచింది. కేవలం గత నెల రోజుల్లోనే, యూఏఈ, జపాన్‌లలో టీమ్ ఇండియా వరుసగా ఎనిమిది మ్యాచ్‌లు గెలిచి 2026 మహిళల ఆసియా కప్, 2026 మహిళల టీ20 ఆసియా క్రీడలను కైవసం చేసుకుంది. 

  • 20 Oct 2026 04:55 PM (IST)

    సిరీస్‌లో భారత్ ఆధిక్యం

    రాయ్‌పూర్‌లో భారత్, జింబాబ్వే మధ్య 3వ టీ20 ప్రారంభమైంది. సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది.

  • 20 Oct 2026 04:25 PM (IST)

    క్లీన్ స్వీప్ లక్ష్యంగా స్మృతి మంధాన సేన

    భారత్ మహిళల జట్టు జింబాబ్వే మహిళలతో 3వ టీ20లో తలపడుతోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్ సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది. రాయ్‌పూర్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో క్లీన్ స్వీప్ లక్ష్యంగా స్మృతి మంధాన సేన బరిలోకి దిగుతోంది.

Published On - Oct 20,2026 4:23 PM

Follow Us