Yuzvendra Chahal: నా పెళ్లప్పుడు కూడా ఇంత టెన్షన్‌ పడలేదు.. స్పిన్‌ మాంత్రికుడి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

India vs West indies: టీమిండియా క్రికెటర్లలో యుజువేంద్ర చాహల్‌ (Yuzvendra Chahal)ది విభిన్న వ్యక్తిత్వం. మైదానంలో బంతిని గిరగిరాలు తిప్పుతూ బ్యాటర్లను బోల్తాకొట్టింటే ఈ స్పిన్‌ మాంత్రికుడు ఆఫ్‌ ఫీల్డ్‌లో మాత్రం ఎంతో సరదాగా ఉంటాడు. తోటి క్రికెటర్లు, కోచలు, సిబ్బందితో జోకులేస్తుంటాడు.

Yuzvendra Chahal: నా పెళ్లప్పుడు కూడా ఇంత టెన్షన్‌ పడలేదు.. స్పిన్‌ మాంత్రికుడి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్
Yuzvendra Chahal
Follow us

|

Updated on: Jul 26, 2022 | 2:42 PM

India vs West indies: టీమిండియా క్రికెటర్లలో యుజువేంద్ర చాహల్‌ (Yuzvendra Chahal)ది విభిన్న వ్యక్తిత్వం. మైదానంలో బంతిని గిరగిరాలు తిప్పుతూ బ్యాటర్లను బోల్తాకొట్టింటే ఈ స్పిన్‌ మాంత్రికుడు ఆఫ్‌ ఫీల్డ్‌లో మాత్రం ఎంతో సరదాగా ఉంటాడు. తోటి క్రికెటర్లు, కోచలు, సిబ్బందితో జోకులేస్తుంటాడు. ఈక్రమంలో భారత్‌- వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగిన  రెండో వన్డేపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేశాడీ స్పిన్‌ బౌలర్‌. ఇలాంటి టెన్షన్‌ను తన పెళ్లప్పుడు కూడా అనుభవించలేదని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన కరేబియన్‌ జట్టు 312 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడింది. అయితే అక్షర్‌ పటేల్‌ (64 నాటౌట్‌; 35 బంతుల్లో 3×4, 5×6) లోయర్‌ ఆర్డర్‌ ఆటగాళ్లతో కలిసి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. అందుకే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారం అందుకున్నాడు. కాగా నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముగిసిన ఈ మ్యాచ్‌ గురించి అక్షర్‌ పటేల్‌, అవేశ్‌ ఖాన్‌లతో సరదాగా ముచ్చటించాడు చాహల్‌. ఈ సందర్భంగా మ్యాచ్‌లో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నాడు.

ఎవరిని దంచి కొట్టాలని

ఇవి కూడా చదవండి

‘చివరి ఓవర్లలో మ్యాచ్‌ జరుగుతున్నంతసేపు గోళ్లు నములుతూనే ఉన్నారు. ఆ సమయంలో డగౌట్‌లో కూర్చోవడంతో ఎంతో ఒత్తిడికి గురయ్యాను. అలాంటి టెన్షన్‌ నా పెళ్లప్పుడు కూడా ఎదుర్కోలేదు’ అని చాహల్‌ చెప్పిన మాటలకు అక్షర్‌, అవేశ్‌ నవ్వుల్లో మునిగిపోయారు. అనంతరం అవేశ్‌ ఖాన్ మాట్లాడుతూ ‘ డెత్‌ ఓవర్లలో విండీస్‌ బౌలర్లు ఎవరెవరు ఇంకా మిగిలి ఉన్నారు? ఎవరి బౌలింగ్‌ను దంచికొట్టొచ్చనే విషయాలను అక్షర్‌ తో చర్చించాను ‘ అని తన గేమ్‌ ప్లాన్‌ గురించి వివరించాడు. ఇలా ముగ్గురి సరదా సంభాషణలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేసింది బీసీసీఐ. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. కాగా రెండు జట్ల మధ్య ఆఖరి నామమాత్రపు మ్యాచ్‌ బుధవారం( జులై27) జరగనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..