9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై టెస్ట్ సిరీస్‌.. ప్లేయింగ్ 11లో ఎంట్రీ ఇవ్వనున్న 33 ఏళ్ల ప్లేయర్..!

India vs Sri Lanka Test Series 2026: సుదీర్ఘ విరామం తర్వాత శ్రీలంక గడ్డపై జరుగుతున్న ఈ సిరీస్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. 33 ఏళ్ల వయసులో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్న సారాంశ్‌ జైన్ ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.

9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై టెస్ట్ సిరీస్‌.. ప్లేయింగ్ 11లో ఎంట్రీ ఇవ్వనున్న 33 ఏళ్ల ప్లేయర్..!
India Vs Sri Lanka Test Series 2026

Updated on: Jul 30, 2026 | 7:20 AM

India vs Sri Lanka Test Series 2026: ఆగస్టు నెలలో శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఏకంగా 9 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత శ్రీలంక గడ్డపై భారత జట్టు రెడ్ బాల్ మ్యాచ్ ఆడనుండటమే ఈ ఆసక్తికి ప్రధాన కారణం. ఈ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఇక అందరి దృష్టీ ఆగస్టు 15న గాలేలో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్ తుది జట్టు కూర్పుపైనే నెలకొంది.

శ్రీలంక టూర్ కోసం బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యుల స్క్వాడ్‌లో ఎక్కువగా పాత ఆటగాళ్లకే ప్రాధాన్యం ఇచ్చినా, 33 ఏళ్ల మధ్యప్రదేశ్ ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ సారాంశ్‌ జైన్‌ ఎంపిక మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ సమయంలో స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడటంతో అతడు ఈ తొలి టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో లైక్-టు-లైక్ రిప్లేస్‌మెంట్‌గా సారాంశ్‌ జైన్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. దేశవాళీ క్రికెట్‌లో సుదీర్ఘకాలంగా రాణిస్తున్న సారాంశ్‌కు భారత జట్టులో చోటు దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇటీవలే ఇండియా-ఏ తరపున శ్రీలంక పర్యటనలో అద్భుత ప్రదర్శన కనబరిచిన అతడు, ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టడమే కాకుండా బ్యాట్‌తో కూడా 70 పరుగులు చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

ఇది కూడా చదవండి: ఐపీఎల్ ఆడకముందే టీమిండియాలోకి పిలుపు.. కట్ చేస్తే.. బెంచ్‌కే పరిమితమైన ఐదుగురు అన్ లక్కీ ప్లేయర్లు..!

ఇవి కూడా చదవండి

అఫ్గాన్ సిరీస్ ఆడిన ముగ్గురిపై వేటు..

ఈ జట్టులో గత అఫ్గానిస్థాన్ టెస్టుకు ఎంపికైన ముగ్గురు ఆటగాళ్లు స్థానం కోల్పోయారు. గాయాల కారణంగా వాషింగ్టన్ సుందర్‌తో పాటు, నితీశ్ కుమార్ రెడ్డిలు జట్టుకు దూరం కాగా, స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి రావడం వల్ల యువ ఆటగాడు హర్ష్ దుబే స్థానాన్ని కోల్పోయాడు. నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో ఎవరినీ తీసుకోకుండా, పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. అయితే బుమ్రా, సాయి సుదర్శన్ ఇద్దరూ తుది జట్టులో ఆడాలంటే ముందుగా వారు ఫిట్‌నెస్ పరీక్షలో పాస్ అవ్వాల్సి ఉంటుంది.

తుది జట్టు అంచనా.. ఆ ముగ్గురు స్పిన్నర్లకు ఛాన్స్..!

తొలి టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న గాలే ఇంటర్నేషనల్ స్టేడియం స్పిన్నర్లకు స్వర్గధామం లాంటిది. దీంతో తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఎంపిక పక్కా అయినట్లే. ఇక మూడో స్పిన్నర్ కోసం పోటీ తీవ్రంగా ఉంది. ప్రత్యర్థి శ్రీలంక జట్టులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు ఎక్కువగా ఉన్నందున, వారిని కట్టడి చేయడానికి ఆఫ్ స్పిన్నర్ అయిన సారాంశ్‌ జైన్‌కే తుది జట్టులో ఆడే అవకాశం దక్కవచ్చు. అదే జరిగితే గాలే వేదికగా అతడు తన అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేయనున్నాడు.

ఇది కూడా చదవండి: ఆ నలుగురు చెత్త ఫీల్డర్లను పీకేయండి.. ఇంకెన్నాళ్లు దాచిపెడతారు..: బీసీసీఐపై గవాస్కర్ ఫైర్..!

బ్యాటింగ్ ఆర్డర్.. పేస్ ద్వయం..

బ్యాటింగ్ విభాగంలో ఎప్పటిలాగే ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లతో పాటు, వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలను జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ తమ భుజాలపై వేసుకునే అవకాశం ఉంది. ఒకవేళ బుమ్రా ఫిట్‌గా ఉంటే అతడే ప్రధాన పేసర్‌గా బరిలోకి దిగుతాడు. దీంతో శుభ్‌మన్ గిల్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న మరో ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్‌కు ఈసారి కూడా నిరాశే మిగిలే అవకాశం ఉంది. అఫ్గానిస్థాన్ సిరీస్ లోనూ అతనికి తుది జట్టులో చోటు దక్కని విషయం తెలిసిందే.

శ్రీలంకతో తొలి టెస్టుకు భారత సంభావ్య తుది జట్టు (అంచనా): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, సారాంశ్‌ జైన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us