AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: కేప్‌టౌన్‌లో రికార్డుల వర్షం.. లిస్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. అవేంటంటే?

India vs South Africa, 2nd Test: రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 55 పరుగులకు ఆలౌటైంది. భారత్‌పై అత్యల్ప స్కోరుకే ఆ జట్టు ఔటైంది. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే లంచ్ సెషన్ ముగిసే వరకు కూడా ఆ జట్టు క్రీజులో నిలవలేకపోయింది. ప్రస్తుతం టీమిండియా తొలి ఇన్నింగ్స్ నడుస్తోంది.

IND vs SA: కేప్‌టౌన్‌లో రికార్డుల వర్షం.. లిస్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. అవేంటంటే?
Virat Kohli Rohit Sharma In
Venkata Chari
|

Updated on: Jan 03, 2024 | 5:13 PM

Share

భారత్‌-దక్షిణాఫ్రికా (India vs South Africa) జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ నేటినుంచి మొదలైంది. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయింది. సిరాజ్ 6 వికెట్లతో బ్యాటర్లకు చుక్కలుచూపించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన టీమిండయా వార్తలు రాసే సమయానికి 10 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 58 పరుగులు చేసింది. రోహిత్ 38, గిల్ 6 పరుగులతో క్రీజులో నిలిచారు. యశస్వి జైస్వాల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. కాగా, ఈ మ్యాచ్‌లో ఎన్నో రికార్డులు సృష్టించవచ్చు. ఈ రికార్డుల జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లు కూడా చేరే అవకాశం ఉంది.

ఎందుకంటే ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా-దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మొత్తం 7 రికార్డులు లిఖించే అవకాశం ఉంది. ఆ రికార్డులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

  1. దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 50+ పరుగులు చేస్తే, సేనా దేశాలలో (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) అత్యధిక 50+ స్కోర్లు సాధించిన సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేయవచ్చు. సేనా దేశాల్లో సచిన్ 74 సార్లు 50+ స్కోర్లు సాధించగా, కోహ్లీ 73 సార్లు 50+ స్కోర్‌లతో రెండో స్థానంలో ఉన్నాడు.
  2. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (1909) 91 పరుగులు చేసి దక్షిణాఫ్రికాపై 2000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.
  3. భారత యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ (994) టెస్టు మ్యాచ్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసేందుకు కేవలం 6 పరుగులు మాత్రమే కావాలి.
  4. టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు పూర్తి చేసేందుకు రవిచంద్రన్ అశ్విన్ (490)కు కేవలం 10 వికెట్లు కావాలి. అయితే, ఈ మ్యాచ్‌లో అశ్విన్ చోటు దక్కించుకోలేకపోయాడు.
  5. అంతర్జాతీయ క్రికెట్‌లో 550 వికెట్లు పూర్తి చేయడానికి రవీంద్ర జడేజా (548) రెండు వికెట్ల దూరంలో ఉన్నాడు.
  6. దక్షిణాఫ్రికా పేసర్ మార్కో జాన్సెన్ (48) టెస్టుల్లో 50 వికెట్లు పూర్తి చేసేందుకు 2 వికెట్లు కావాలి.
  7. అంతర్జాతీయ క్రికెట్‌లో 200 వికెట్లు పూర్తి చేసేందుకు దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎన్‌గిడి (199)కు కేవలం ఒక వికెట్ మాత్రమే కావాలి.

రెండు జట్ల ప్లేయింగ్-11..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ.

దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్‌రామ్, టోనీ డిజార్జ్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వేరియన్ (వికెట్ కీపర్), మార్కో యాన్సన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్‌గిడి, నాండ్రే బెర్గర్.

భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యస్సావి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్ , జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ, అభిమన్యు ఈశ్వరన్.

దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టు: డీన్ ఎల్గర్ (కెప్టెన్), డేవిడ్ బెడింగ్‌హామ్, నాండ్రే బెర్గర్, ఐడెన్ మార్క్‌రామ్, వియాన్ ముల్డర్, కగిసో రబడ, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెన్, టోనీ డి జోర్జి, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, లుంగీ ఎన్‌గిడి, కీగన్ పీటర్సన్, హంజా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..