IND vs SA: రెండో వన్డేలో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా.. శ్రేయస్‌ ఔట్‌.. సిక్సర్ల ‘రింకూ’ వన్డే అరంగేట్రం

పోర్ట్‌ ఎలిజబెత్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు టాస్‌ గెలిచింది. కెప్టెన్‌ మర్‌క్రమ్‌ మొదట భారత్‌ జట్టును బ్యాటింగ్‌ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా జట్టులో ఒక మార్పు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ కు విశ్రాంతి నిచ్చి

IND vs SA: రెండో వన్డేలో టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా.. శ్రేయస్‌ ఔట్‌.. సిక్సర్ల రింకూ వన్డే అరంగేట్రం
Team India

Updated on: Dec 19, 2023 | 5:52 PM

పోర్ట్‌ ఎలిజబెత్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు టాస్‌ గెలిచింది. కెప్టెన్‌ మర్‌క్రమ్‌ మొదట భారత్‌ జట్టును బ్యాటింగ్‌ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా జట్టులో ఒక మార్పు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ కు విశ్రాంతి నిచ్చి నయా ఫినిషర్‌ సిక్సర్ల రింకూ వన్డే అరంగేట్రం చేశాడు. మరోవైపు సఫారీల జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. ఆండిలే ఫెహ్లూక్వాయో, తబ్రేజ్‌ షంసి రిజర్వ్‌ బెంచ్‌ కే పరిమితమయ్యారు. వీరి స్థానాల్లో హెండ్రిక్స్‌, లిజాడ్‌ విలియయ్స్‌ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్‌లో టీమ్ ఇండియా 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే మరో గేమ్‌ ఉండగానే భారత జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. అదే సమయంలో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ ఆశలను సజీవంగా ఉండాలని కోరుకుంటోంది.

అయితే ఈ మ్యాచ్‌కు ముందు జట్టులోని ఇద్దరు స్టార్ ఆటగాళ్లు గాయం కారణంగా దూరమయ్యారు. నిజానికి తొలి వన్డేలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ ఆండిలే ఫెహ్లుక్వాయో సైడ్ స్ట్రెయిన్ సమస్యతో బాధపడ్డాడు. ఈ కారణంగా అతడు వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇంతలో, ప్రాక్టీస్ సమయంలో ఫాస్ట్ బౌలర్ ఒట్నీల్ బార్ట్‌మన్ కూడా గాయపడ్డాడు. దీంతో అతని స్థానంలో బురాన్ హెండ్రిక్స్‌కు జట్టులో అవకాశం లభించింది. హెండ్రిక్స్ ఆఫ్రికా తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాడు. లుంగీ ఎన్‌గిడి ఔటైన తర్వాత టీ20 సిరీస్‌కు కూడా జట్టులోకి ఎంపికయ్యాడు

ఇవి కూడా చదవండి

 

రెండు జట్ల ప్లేయింగ్ 11..

భారత్‌:

కేఎల్‌ రాహుల్ (కెప్టెన్‌), సాయి సుదర్శన్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకూ సింగ్‌, సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్

 

దక్షిణాఫ్రికా:

ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్‌), టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్‌), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, నండ్రే బర్గర్, బ్యూరాన్‌ హెండ్రిక్స్‌,

 

మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..