IND VS SA: 11 మంది ఆటగాళ్లలో 5గురు ఫ్లాప్.. ఆశలన్నీ బుమ్రా-షమీలపైనే.. రేపటి నుంచే కేప్‌టౌన్ టెస్ట్..!

కేప్‌టౌన్‌లో ఇప్పటి వరకు భారత్‌ టెస్టు మ్యాచ్‌లు గెలవలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి ఈ మైదానంలో టీమిండియా-దక్షిణాఫ్రికా పోరు జరగనుంది.

IND VS SA: 11 మంది ఆటగాళ్లలో 5గురు ఫ్లాప్.. ఆశలన్నీ బుమ్రా-షమీలపైనే.. రేపటి నుంచే కేప్‌టౌన్ టెస్ట్..!
Mohammed Shami
Follow us
Venkata Chari

|

Updated on: Jan 10, 2022 | 9:05 AM

India vs South Africa 2021: జనవరి 11 నుంచి కేప్‌టౌన్‌లో ప్రారంభం కానున్న మూడో, చివరి టెస్టు మ్యాచ్ కోసం అంతా సిద్ధమైంది. కేప్ టౌన్ (Cape Town)లోని న్యూలాండ్స్ మైదానాన్ని పేసర్లకు ప్యారడైజ్ అని పిలుస్తారు. ఈ మైదానంలో ఫాస్ట్ బౌలర్లు సత్తా చాటనున్నారు. ఇది భారత జట్టుకు శుభవార్తతో పాటు చెడు వార్తను కూడా తీసుకొచ్చింది. ఎందుకంటే టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలింగ్ అటాక్ అద్భుతంగా ఉంది. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీతోపాటుశార్దూల్ ఠాకూర్ కూడా అద్భంతంగా ఆడుతున్నాడు. మహ్మద్ సిరాజ్ అన్ ఫిట్ అయ్యాడు. కానీ, అతని స్థానంలో ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ వంటి అనుభవజ్ఞులైన ఫాస్ట్ బౌలర్లు జట్టులో ఉన్నారు. అయితే ఇంత జరిగినా కేప్ టౌన్ లో టీమ్ ఇండియా ఫేవరెట్ కాకపోవడం కొంత నిరాశను కలిగిస్తోంది.

ఆరుగురు బ్యాట్స్‌మెన్‌లలో 5గురు ఫ్లాప్.. కేప్‌టౌన్‌లో టీమ్‌ఇండియా ఫేవరెట్‌గా లేకపోవడానికి కారణం బ్యాట్స్‌మెన్స్‌ మాత్రమే. ఏ బ్యాట్స్‌మెన్ బలంతో టీమ్ ఇండియా ఎన్నో మ్యాచ్‌లు గెలిచిందో.. ప్రస్తుతం అదే జట్టు బలహీనతగా మారింది. టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు బ్యాట్స్‌మెన్‌లు ఫామ్‌లో లేరు. కేఎల్ రాహుల్‌ ఒక్కడే కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఇతర బ్యాట్స్‌మెన్ ఎవరూ దక్షిణాఫ్రికాలో అంతగా ఆకట్టుకోలేదు.

భారత్‌లో పరుగుల వర్షం కురిపించిన మయాంక్ అగర్వాల్ బ్యాట్‌కు గ్రహణం పట్టింది. అతను 4 ఇన్నింగ్స్‌ల్లో 28.25 సగటుతో 113 పరుగులు చేశాడు. మయాంక్ అగర్వాల్ సెంచూరియన్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ సాధించాడు. కానీ, ఆ తర్వాత వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో విఫలమయ్యాడు.

రహానె-పుజారాలను నమ్మలేం! జోహన్నెస్‌బర్గ్ రెండో ఇన్నింగ్స్‌లో రహానే-పుజారా కూడా అద్భుతమైన అర్ధ సెంచరీలు చేశారు. అయితే వీరి ప్రస్తుత ఫాం మాత్రం అంతగా ఆకట్టుకోవడం లేదు. ఈ ఇద్దరు ఆటగాళ్లు చాలా కాలంగా పరుగులు చేయడం లేదు. జట్టులో వీరి స్థానం ప్రశ్నార్థకమవుతోంది. ఈ సిరీస్‌లో పుజారా సగటు 18 మాత్రమే. రహానే 28.25 సగటుతో పరుగులు చేశాడు.

విరాట్-పంత్ కూడా..! కెప్టెన్ విరాట్ కోహ్లి, వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాట్ కూడా తేలిపోయాయి. తొలి టెస్టులో ఆడిన విరాట్ 2 ఇన్నింగ్స్‌ల్లో 53 పరుగులు మాత్రమే చేశాడు. గత రెండేళ్లుగా భారత కెప్టెన్‌కు సెంచరీలు చేయడం లేదు. మరోవైపు రిషబ్ పంత్ 2 టెస్టుల్లో 59 పరుగులు మాత్రమే చేయగలిగాడు. పంత్ ఆడుతోన్న షాట్లు చూస్తే మాత్రం.. జట్టు నుంచి తప్పించడంటూ మాజీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ని సమస్యలతో కేప్ టౌన్ లో టీమ్ ఇండియా ఎలా గెలుస్తుందనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది.

Also Read: IND vs SA: కేప్‌‌టౌన్‌‌లో ఉద్వేగానికి లోనైన భారత స్టార్ బౌలర్.. ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ ట్వీట్..!

AusVsEng: త్రుటిలో మరో ఓటమిని తప్పించుకున్న ఇంగ్లండ్‌.. ఆసీస్‌ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచిన బ్రాడ్‌, అండర్సన్‌..