India vs South Africa 2022: ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత టీమిండియా మరో క్రికెట్ సమరానికి సిద్ధమైంది. స్వదేశంలో సౌతాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్‌కు ఒక రోజు ముందు, టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయపడి సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో వికెట్ కీపర్ రిషభ్ పంత్ సారథ్య బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు టెంబా బావుమా సారథ్యంలోని దక్షిణాఫ్రికా పటిష్ఠంగా కనిపిస్తోంది. కాగా తొలిసారిగా టీం ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రిషబ్ పంత్ తన ప్లేయింగ్ ఎలెవన్‌లో కొత్త ఆటగాళ్లకు చోటివ్వలేదు. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన ఫాస్ట్ బౌలర్లు ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ టీమిండియా జెర్సీతో మైదానంలోకి దిగేందుకు మరో మ్యాచ్ వేచి చూడాల్సిందే.
సీనియర్ ఆటగాళ్ల రీ ఎంట్రీ..
కాగా ఈ మ్యాచ్ ద్వారా టీమిండియాకు చెందిన ఇద్దరు సీనియర్ వెటరన్ ఆటగాళ్లు జట్టులోకి తిరిగి వచ్చారు. గుజరాత్ టైటాన్స్ తరఫున ఐపీఎల్ 2022 టైటిల్‌ను గెలుచుకున్న హార్దిక్ పాండ్యా, టీ20 ప్రపంచకప్ తర్వాత తొలిసారి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు. అదే సమయంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో బెస్ట్ ఫినిషర్ పాత్రను పోషించిన దినేష్ కార్తీక్ కూడా దాదాపు 3 సంవత్సరాల తర్వాత టీమ్ ఇండియా ప్లేయింగ్ XIకి తిరిగి వచ్చాడు. ఇషాన్ కిషన్‌తో పాటు కేఎల్ రాహుల్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
భారత్:
రిషబ్ పంత్ (కెప్టెన్-వికెట్ కీపర్ ), ఇషాన్ కిషన్, రితురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్ మరియు అవేష్ ఖాన్
దక్షిణాఫ్రికా:
తంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్), రాసి వాన్ డెర్ డస్సెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పెర్నెల్, డ్వేన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, తబరిజ్ షమ్సీ, కగిసో రబడ, అన్రిక్ నోర్కియా
South Africa have won the toss and elect to bowl first against #TeamIndia
Live – https://t.co/lJK64Efzvg #INDvSA @Paytm pic.twitter.com/etrIPIa0Rv
— BCCI (@BCCI) June 9, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: