AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేవలం 6 ఓవర్లే.. భారత్, పాకిస్థాన్ మధ్య మరో హై-వోల్టేజ్ పోరు.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

India vs Pakistan in Hong Kong Sixes 2026: భారత్, పాకిస్థాన్ మరోసారి క్రికెట్ మైదానంలో తలపడేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈసారి సాధారణ టీ20 లేదా వన్డే మ్యాచ్ కాదు. కేవలం ఆరు ఓవర్ల ఫార్మాట్‌లో జరిగే హాంగ్ కాంగ్ సిక్సెస్ 2026లో ఈ రెండు జట్లు ఢీకొంటున్నాయి. అక్టోబర్ 30న జరిగే ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

కేవలం 6 ఓవర్లే.. భారత్, పాకిస్థాన్ మధ్య మరో హై-వోల్టేజ్ పోరు.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
India Vs Pakistan Hk Sixes Clash Set For Tomorrow
Venkata Chari
|

Updated on: Oct 29, 2026 | 9:27 PM

Share

India vs Pakistan in Hong Kong Sixes 2026: భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతుంది. ఇప్పుడు ఈ రెండు జట్లు మరోసారి తలపడబోతున్నాయి. హాంగ్ కాంగ్ సిక్సెస్ 2026 టోర్నమెంట్‌లో భాగంగా శుక్రవారం ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది.

హాంగ్ కాంగ్ సిక్సెస్ ప్రత్యేకత ఏంటంటే ప్రతి మ్యాచ్ కేవలం 6 ఓవర్లకే పరిమితం అవుతుంది. ఒక్కో జట్టులో ఏడుగురు ఆటగాళ్లు ఉంటారు. అయితే ఆరుగురు మాత్రమే ఫీల్డింగ్ చేస్తారు. వికెట్ కీపర్ మినహా మిగిలిన ఐదుగురు ఆటగాళ్లు ఒక్కొక్క ఓవర్ చొప్పున బౌలింగ్ చేయాల్సి ఉంటుంది.

మ్యాచ్ ఎప్పుడు? ఎక్కడ?

భారత్, పాకిస్థాన్ మ్యాచ్ హాంగ్ కాంగ్‌లోని మోంగ్ కాక్‌లో ఉన్న మిషన్ రోడ్ మైదానంలో జరగనుంది.

ఈ మ్యాచ్ అక్టోబర్ 30, శుక్రవారం ఉదయం 11:45 గంటలకు భారత కాలమానం ప్రకారం ప్రారంభమవుతుంది.

భారత్‌లో మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ టీవీ ఛానెళ్లలో ప్రత్యక్షంగా చూడవచ్చు. డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఫ్యాన్‌కోడ్ యాప్లో మ్యాచ్ అందుబాటులో ఉంటుంది.

టీమిండియా జట్టు ఇదే..

కృనాల్ పాండ్యా (Krunal Pandya) కెప్టెన్సీలో భారత్ బరిలోకి దిగనుంది.

భారత్ జట్టు: కృనాల్ పాండ్యా (కెప్టెన్), నితీశ్ రాణా (Nitish Rana), శశాంక్ సింగ్ (Shashank Singh), రాహుల్ తెవాటియా (Rahul Tewatia), రాహుల్ త్రిపాఠి (Rahul Tripathi), టి. నటరాజన్ (T. Natarajan), కుల్వంత్ ఖేజ్రోలియా (Kulwant Khejroliya).

పాకిస్థాన్ జట్టు..

డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ కూడా బలమైన జట్టుతో టోర్నమెంట్‌లోకి అడుగుపెడుతోంది.

పాకిస్థాన్ జట్టు: అబ్బాస్ అఫ్రిది (కెప్టెన్), అహ్మద్ డానియాల్ (Ahmed Daniyal), ఇర్ఫాన్ ఖాన్ నియాజీ (Irfan Khan Niazi), సాద్ మసూద్ (Saad Masood), ఖ్వాజా నఫే (Khawaja Nafay), అబ్దుల్ సమద్ (Abdul Samad), మహ్మద్ షెహజాద్ (Mohammad Shehzad).

12 జట్లు.. నాలుగు గ్రూపులు

హాంగ్ కాంగ్ సిక్సెస్ 2026లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి.

గ్రూప్ A: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, హాంగ్ కాంగ్ గ్రూప్ B: శ్రీలంక, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ గ్రూప్ C: భారత్, పాకిస్థాన్, యూఏఈ గ్రూప్ D: దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, ఒమన్

డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్..

2025 నవంబర్‌లో జరిగిన హాంగ్ కాంగ్ సిక్సెస్ ఫైనల్లో పాకిస్థాన్ 43 పరుగుల తేడాతో కువైట్‌ను ఓడించి టైటిల్ సాధించింది. ఇది ఈ టోర్నమెంట్ చరిత్రలో పాకిస్థాన్‌కు ఆరో టైటిల్. అందుకే ఈసారి పాకిస్థాన్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.

భారత్‌కు 21 ఏళ్ల తర్వాత ఛాన్స్..

భారత్ చివరిసారిగా 2005లో హాంగ్ కాంగ్ సిక్సెస్ టైటిల్ గెలిచింది. ఫైనల్లో వెస్టిండీస్‌ను ఓడించి ట్రోఫీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత భారత్ మరోసారి ఈ టైటిల్‌ను గెలవలేకపోయింది.

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరోసారి ట్రోఫీపై కన్నేసిన భారత్‌కు తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్ రూపంలో కఠినమైన ప్రత్యర్థి ఎదురైంది. కృనాల్ పాండ్యా నేతృత్వంలోని భారత జట్టు చిరకాల ప్రత్యర్థిపై విజయంతో టోర్నమెంట్‌ను ప్రారంభిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us
ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!
ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!
పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా
పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా
తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు
తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..
ప్రపంచంలోనే ఖరీదైన బాదం.. ఎందుకింత స్పెషల్ అంటే..
తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..
తీరం దాటింది.. ఘోరం మిగిలింది.. నీళ్లిమ్మంటే.. కన్నీళ్లిచ్చిన..
'బ్లాక్ మిల్క్'.. హీరోయిన్ అదాశర్మ అందానికి కారణమిదే.. వీడియో
'బ్లాక్ మిల్క్'.. హీరోయిన్ అదాశర్మ అందానికి కారణమిదే.. వీడియో
12 జట్లు.. 6 ఓవర్లు.. 5 బౌలర్లు.. 31 పరుగులు చేస్తే రిటైర్
12 జట్లు.. 6 ఓవర్లు.. 5 బౌలర్లు.. 31 పరుగులు చేస్తే రిటైర్
 అరటి తొక్కలు పారేయకండి.. ఇలా వాడితే మీ మొక్క గుత్తులుగా పూలు
 అరటి తొక్కలు పారేయకండి.. ఇలా వాడితే మీ మొక్క గుత్తులుగా పూలు
భారత్, పాకిస్థాన్ మధ్య హై-వోల్టేజ్ పోరు.. ఎప్పుడు, ఎక్కడ చూడాలి?
భారత్, పాకిస్థాన్ మధ్య హై-వోల్టేజ్ పోరు.. ఎప్పుడు, ఎక్కడ చూడాలి?