‘తలా’ నువ్వే కాపాడాలి!

వర్ష ప్రభావం టీమిండియా టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చింది. కివీస్ బౌలర్లు బంతులను బుల్లెట్లలా విసురుతున్నారు. భారత్ అభిమానులు కొందరు వర్షం పడి మ్యాచ్ రద్దవ్వాలని కోరుకుంటున్నారు. ఆ ఆప్షన్ కాకుండా మరొకరు ఫ్యాన్స్ మదిలో ఆశాదీపంలా ఉన్నాడు. హి ఈజ్ నన్ అదర్ దెన్, ‘తలా’ ధోని. అవును ఇప్పుడు భారత్ అభిమానులంతా ధోనినే ఈ క్రైసిస్ నుంచి కాపాడతాడని భావిస్తున్నారు.  న్యూజిలాండ్ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని చేదించడంలో భారత్ నాలుగు కీలక వికెట్లను కోల్పోయి […]

'తలా' నువ్వే కాపాడాలి!
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 10, 2019 | 5:00 PM

వర్ష ప్రభావం టీమిండియా టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చింది. కివీస్ బౌలర్లు బంతులను బుల్లెట్లలా విసురుతున్నారు. భారత్ అభిమానులు కొందరు వర్షం పడి మ్యాచ్ రద్దవ్వాలని కోరుకుంటున్నారు. ఆ ఆప్షన్ కాకుండా మరొకరు ఫ్యాన్స్ మదిలో ఆశాదీపంలా ఉన్నాడు. హి ఈజ్ నన్ అదర్ దెన్, ‘తలా’ ధోని. అవును ఇప్పుడు భారత్ అభిమానులంతా ధోనినే ఈ క్రైసిస్ నుంచి కాపాడతాడని భావిస్తున్నారు.  న్యూజిలాండ్ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని చేదించడంలో భారత్ నాలుగు కీలక వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది.

ఎన్నో ఆశలు పెట్టుకున్న రోహిత్ , కోహ్లి, రాహుల్ ఒక్క పరుగు చేసి వెనుదిరిగారు. ఇక కొద్దిసేపు నిలకడగా ఆడినట్టే కనిపించిన దినేష్ కార్తీక్ కూడా తక్కువ పరుగుల వ్యవదిలోనే అవుట్ అయ్యాడు .. ప్రస్తుతం భారత్ 15 ఓవర్లకు గాను 43 పరుగులు చేసింది. ఇప్పుడు క్రీజ్‌లో రిషబ్ పంత్ మరియు పాండ్యా ఆడుతున్నారు. 2011 ప్రపంచ కప్‌ ఫైనల్‌లో భారత్‌ని విజయతీరాలకు నడిపించాడు ధోని. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవ్వాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.