AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైభవ్, అభిషేక్ దెబ్బకు హౌస్‌ఫుల్.. మరో విధ్వంసాన్ని చూసేందుకు దూసుకొస్తోన్న 40వేల మంది..!

India vs New Zealand 4th T20: భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న నాలుగో టీ20పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌కు 40 వేల మందికి పైగా అభిమానులు రానున్నారు. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశి వంటి యువ బ్యాటర్ల విధ్వంసకర బ్యాటింగ్‌తో సిరీస్‌పై ఆసక్తి మరింత పెరిగింది.

వైభవ్, అభిషేక్ దెబ్బకు హౌస్‌ఫుల్.. మరో విధ్వంసాన్ని చూసేందుకు దూసుకొస్తోన్న 40వేల మంది..!
Ind Vs Nz 4th T20i Eden Park, Auckland Tickets
Venkata Chari
|

Updated on: Oct 29, 2026 | 3:22 PM

Share

India vs New Zealand 4th T20: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఉత్కంఠభరితంగా మారింది. టీం ఇండియా యువ బ్యాటర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ మూడో టీ20లో తమ విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నారు. వీరిద్దరి దూకుడైన ఆటతీరుతో భారత-న్యూజిలాండ్ టీ20 సిరీస్‌పై ఆసక్తి మరింత రెట్టింపు అయ్యింది. ఈ అద్భుత ప్రదర్శనల నేపథ్యంలో, రేపు శుక్రవారం ఆక్లాండ్‌లోని సుప్రసిద్ధ ఈడెన్ పార్క్‌లో జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌ను వీక్షించేందుకు 40 వేల మందికి పైగా ప్రేక్షకులు వస్తారని అంచనా వేస్తున్నారు.

న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఇప్పటికే ప్రకటించిన విధంగా, ఈ మ్యాచ్ టికెట్లన్నీ పూర్తిగా అమ్ముడయ్యాయి. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు తొలి మూడు మ్యాచ్‌లలో విజయం సాధించి 3-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలబడటంతో, తదుపరి మ్యాచ్‌ లపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కారణంగానే నాలుగో టీ20కి ప్రేక్షకులనుండి ఊహించని స్థాయిలో భారీ స్పందన లభిస్తోంది. ఈడెన్ పార్క్‌లో జరిగే ఈ మ్యాచ్‌కి 40 వేలకు పైగా అభిమానులు హాజరవుతారని న్యూజిలాండ్ క్రికెట్ స్పష్టం చేసింది. ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లలో ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరు కావడం ఇది ఒక కొత్త రికార్డుగా నిలిచే అవకాశం ఉందని న్యూజిలాండ్ బోర్డు వెల్లడించింది.

ఎక్కువమంది చదివినది: IND vs NZ 4th T20I: వైభవ్‌కు షాక్ తప్పదా..? రీఎంట్రీకి సిద్ధమైన ఛోటా ప్యాకెట్..!

మూడో టీ20లో భారత బ్యాటర్లు ఆడిన అసాధారణ ఇన్నింగ్స్‌లు ఈ క్రేజ్ పెరగడానికి ప్రధాన కారణంగా నిలిచాయి. వెల్లింగ్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో యువ సంచలనం అభిషేక్ శర్మ కేవలం 38 బంతుల్లోనే అద్భుతమైన 113 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, 11 సిక్స్‌లు ఉన్నాయి. మరోవైపు, కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశి కూడా అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ కేవలం 19 బంతుల్లో 45 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ యువ ద్వయం తొలి వికెట్‌కు కేవలం ఏడు ఓవర్లలోనే 133 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. దీనితో 99 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు కేవలం 13.2 ఓవర్లలోనే చేధించి ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఎక్కువమంది చదివినది: 5 ఓవర్లలో 100 ఏంటి.. వాళ్లను చూస్తే నాకే భయమేసింది.. పాపం కివీస్ బౌలర్లు..: శ్రేయాస్ అయ్యర్

ఇక ఈడెన్ పార్క్ మైదానం కూడా పరిమాణంలో చిన్నది కావడంతో, మరోసారి బ్యాటర్ల విధ్వంసం ఖాయమని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. చిన్న బౌండరీల కారణంగా పరుగుల వరద పారే అవకాశం ఉంది, ఇది మ్యాచ్‌కు మరింత ఉత్సాహాన్ని అందిస్తుంది. భారత జట్టు ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్నప్పటికీ, యువ ఆటగాళ్ల ప్రదర్శనలు, రికార్డు స్థాయిలో అభిమానుల హాజరు ఈ నాలుగో టీ20ని మరచిపోలేనిదిగా మార్చనున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us