IND vs NZ 3rd Test: ముగిసిన తొలిరోజు.. చివర్లో తడబడిన భారత్.. మరోసారి నిరాశ పరిచిన రోహిత్, కోహ్లీ

India vs New Zealand Highlights, 3rd Test Day 1: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు 235 పరుగులకు ఆలౌటైంది. శుక్రవారం తొలి రోజు భారత్‌ 4 వికెట్లకు 86 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ అజేయంగా వెనుదిరిగారు.

IND vs NZ 3rd Test: ముగిసిన తొలిరోజు.. చివర్లో తడబడిన భారత్.. మరోసారి నిరాశ పరిచిన రోహిత్, కోహ్లీ
Ind Vs Nz 2nd Test
Follow us
Venkata Chari

|

Updated on: Nov 01, 2024 | 5:56 PM

India vs New Zealand Highlights, 3rd Test Day 1: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు 235 పరుగులకు ఆలౌటైంది. శుక్రవారం తొలి రోజు భారత్‌ 4 వికెట్లకు 86 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ అజేయంగా వెనుదిరిగారు. యశస్వి జైస్వాల్ 30, రోహిత్ శర్మ 18, విరాట్ కోహ్లీ 4, మహ్మద్ సిరాజ్ జోరోకే ఔటయ్యారు. అజాజ్ పటేల్ 2 వికెట్లు, మాట్ హెన్రీ 1 వికెట్ తీశారు. కోహ్లీ రనౌట్ కావడం గమనార్హం.

6 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత్..

ఒకానొక సమయంలో టీమిండియా స్కోరు ఒక వికెట్ నష్టానికి 78 పరుగులుగా నిలిచింది. ఇక్కడ నుంచి ఆరు పరుగులకే టీం ఇండియా మూడు వికెట్లు కోల్పోయింది. తొలుత ఎజాజ్ పటేల్ వరుసగా రెండు బంతుల్లో యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్‌లను అవుట్ చేశాడు.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో కివీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. కివీస్ జట్టులో డారిల్ మిచెల్, విల్ యంగ్ హాఫ్ సెంచరీలు సాధించారు. మిచెల్ 129 బంతుల్లో 82 పరుగులు, యంగ్ 138 బంతుల్లో 71 పరుగులు చేశారు. భారత్ తరపున రవీంద్ర జడేజా 5 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు తీశారు. ఆకాష్‌ దీప్‌కి ఒక వికెట్‌ లభించింది.

న్యూజిలాండ్ జట్టు 159 పరుగుల వద్ద 5 వికెట్లు కోల్పోయింది. అయితే, ఇక్కడి నుంచి ఆ జట్టు ఇన్నింగ్స్ తడబడడంతో కేవలం 76 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఇందులో 6 వికెట్లు జడేజా తీయగా, సుందర్ 2 వికెట్లు తీశాడు.

రెండు జట్ల ప్లేయింగ్-11..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.

న్యూజిలాండ్: టామ్ లాథమ్ (కెప్టెన్), డ్వేన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్క్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..