IND vs AUS: రూ. 8.5 కోట్లు ఆఫర్ చేసిన గుజరాత్.. కట్‌చేస్తే.. ఆస్ట్రేలియాలో బీభత్సం సృష్టించిన టీమిండియా ప్లేయర్
IND vs AUS: సాయి సుదర్శన్ తన అజేయ ఇన్నింగ్స్ అంటే 96 పరుగులతో సత్తా చాటాడు. ఇండియా A ఆస్ట్రేలియన్ టూర్‌లో ప్రస్తుతం భారత జట్టు భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే సాయి సుదర్వన్‌కు ఓ గుడ్ న్యూస్ కూడా వచ్చింది.
IND vs AUS: ఇండియా ఏ ఆస్ట్రేలియా పర్యటనలో తొలి ఇన్నింగ్స్‌లో ఫ్లాప్ అయిన బ్యాట్స్‌మన్‌ను గుజరాత్ రూ. 8.5 కోట్లు చెల్లించి అట్టిపెట్టుకుంది. ఆ మరుసటి రోజే ఆస్ట్రేలియాలో సాయి సుదర్శన్ కంగారూ బౌలర్లను చిత్తుగా బాదేశాడు. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ తన రిటెన్షన్ లిస్ట్‌లో సాయి సుదర్శన్‌కు 8.5 కోట్ల రూపాయల మొత్తాన్ని ఇచ్చింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో భారత్-ఏ జట్టులో చోటు దక్కించుకున్న సాయి సుదర్శన్ రెండో రోజు మ్యాచ్‌లో 185 బంతుల్లో 96 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారత్-ఏ ఇప్పుడు మ్యాచ్‌లో 120 పరుగుల ఆధిక్యంలో ఉంది.
30 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్..
మెక్‌కే మైదానంలో తొలి రోజు భారత్ ఏ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగులకు ఆలౌటైంది. ఆ తరువాత, ముఖేష్ కుమార్ తన విధ్వంసక బౌలింగ్‌తో భారత జట్టును పునరాగమనం చేసేలా చేశాడు. ఆరు వికెట్లు పడగొట్టడం ద్వారా ఆస్ట్రేలియా ఏ మొదటి ఇన్నింగ్స్‌ను 195 పరుగులకు పరిమితం చేశాడు. దీనికి సమాధానంగా, మ్యాచ్ రెండో రోజు భారత్-ఏకు శుభారంభం లభించలేదు. స్కోరు 30 పరుగులకే ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (12), రుతురాజ్ గైక్వాడ్ (5) ఇద్దరూ తక్కువ స్కోర్ ఔటయ్యారు.
గర్జించిన సాయి సుదర్శన్ బ్యాట్..
30 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్-ఎ జట్టుకు దేవదత్ పడిక్కల్, సాయి సుదర్శన్ అద్భుతమైన షాట్లు ఆడి ఆస్ట్రేలియా బౌలర్లకు పునరాగమనం చేసే అవకాశం ఇవ్వలేదు. రెండో రోజు ముగిసే సమయానికి సాయి, దేవదత్ మధ్య 178 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొనగా, భారత్-ఎ గట్టి ఎదురుదాడి చేసింది. సాయి సుదర్శన్ 185 బంతుల్లో 9 ఫోర్లతో 96 పరుగులు చేయగా, దేవదత్ 167 బంతుల్లో ఐదు ఫోర్లతో 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో రెండో రోజు ముగిసే సమయానికి భారత్-ఎ రెండు వికెట్లకు 208 పరుగులు చేసి 120 పరుగుల బలమైన ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు గైక్వాడ్ సారథ్యంలోని ఇండియా ఎ.. తొలి మ్యాచ్‌లోనే భారీ స్కోరు సాధించి ఆస్ట్రేలియాను ఓడించాలని భావిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..