AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా.. ఆ మ్యాచ్‌ రద్దు చేసిన బీసీసీఐ.. ఆ సాంప్రదాయానికి స్వస్తి

IND vs AUS: ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్ Aతో జరగాల్సిన వార్మప్ మ్యాచ్‌ను BCCI రద్దు చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో పేలవ ప్రదర్శన, పెర్త్ పిచ్ స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

IND vs AUS: ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా.. ఆ మ్యాచ్‌ రద్దు చేసిన బీసీసీఐ.. ఆ సాంప్రదాయానికి స్వస్తి
Ind Vs Nz 3rd Test
Venkata Chari
|

Updated on: Nov 01, 2024 | 4:42 PM

Share

IND vs AUS: ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న టీమ్ ఇండియా, ఆ తర్వాత ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్ ప్రారంభం కావడానికి 3 వారాలు మాత్రమే మిగిలి ఉంది. న్యూజిలాండ్‌తో మూడో టెస్టు తర్వాత టీమిండియా నవంబర్ 5 తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ నవంబర్ 22 నుంచి పెర్త్‌లో ప్రారంభం కానుంది. అయితే, అంతకు ముందు ఆస్ట్రేలియాలో భారత్ ఏతో టీమ్ ఇండియా మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే, ఇప్పుడు ఈ మ్యాచ్‌ను బీసీసీఐ రద్దు చేసింది.

ప్రాక్టీస్ మ్యాచ్ రద్దు..

వాస్తవానికి ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని ఇండియా ఏ జట్టు ఆస్ట్రేలియా ఎ జట్టుతో వార్మప్ మ్యాచ్‌లో బిజీగా ఉంది. ఈ మ్యాచ్ తర్వాత, టీమిండియా నవంబర్ 15 నుంచి 17 వరకు పెర్త్‌లో ఇండియా ఏతో వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. తొలి టెస్టు మ్యాచ్‌ కూడా ఇదే మైదానంలో జరగనున్నందున, భారత జట్టు బాగా సన్నద్ధం కావడానికి ముందుగా స్వదేశంలో మ్యాచ్‌ ఆడాలని భావించింది. దీంతో బీసీసీఐ ఈ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గింది.

ESPN Cricinfo నివేదిక ప్రకారం, స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ పేలవమైన ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని BCCI ఇప్పుడు వార్మప్ మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మూడు రోజులు రోహిత్ శర్మ సహా జట్టు ఆటగాళ్లంతా నెట్స్‌లో చెమటోడ్చనున్నట్టు సమాచారం.

నిబంధనలను ఉల్లంఘించిన టీమ్ ఇండియా..

ఇంతకు ముందు రెండు ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ భారత జట్టు వార్మప్ మ్యాచ్‌లు ఆడింది. 2018-19 పర్యటనలో, భారత జట్టు క్రికెట్ ఆస్ట్రేలియా XIతో 4-రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. తరువాత 2020-21 పర్యటనలో ఆస్ట్రేలియా A తో 3-రోజుల వార్మప్ మ్యాచ్ ఆడారు. అంతేకాదు టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు ప్రధాన జట్టు, ఇండియా ఏ జట్టు వార్మప్ మ్యాచ్ ఆడాయి. ఈ పద్ధతికి స్వస్తి పలకాలని బీసీసీఐ నిర్ణయించింది.

నెట్ ప్రాక్టీస్‌పై ఎక్కువ దృష్టి..

గౌతమ్‌ గంభీర్‌ టీమ్‌ ఇండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టీమ్‌ ప్లాన్‌లో చాలా మార్పులు వచ్చాయి. దీని ప్రకారం పెర్త్‌లో జరగాల్సిన వార్మప్ మ్యాచ్‌ను రద్దు చేయాలని గంభీర్ నిర్ణయించుకున్నాడు. పెర్త్ పిచ్‌లో బౌన్స్ ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. ఇటువంటి పరిస్థితిలో, ఈ బౌన్స్‌ను అర్థం చేసుకోవడానికి, బ్యాట్స్‌మెన్స్ పిచ్‌పై వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. ప్రాక్టీస్ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌లు తొందరగా ఔటైతే, వారు ఈ అవకాశాన్ని కోల్పోతారు. అందువల్ల, బ్యాట్స్‌మెన్స్ అందరూ ఎక్కువ బ్యాటింగ్ చేయడానికి నెట్ సెషన్‌లలో ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించడమే ఇందుకు కారణంగా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..