IND vs NZ: వర్షం ఎఫెక్ట్.. ఆలస్యంగా భారత్ vs న్యూజిలాండ్ మ్యాచ్.. టాస్ పడకుండానే?
India vs New Zealand, 1st Test Toss: భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ బెంగళూరులో జరగనుండగా, రెండో మ్యాచ్ పుణెలోని ఎంసీఏ స్టేడియంలో జరగనుంది. అలాగే మూడో మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది.
India vs New Zealand, 1st Test Toss: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఉదయం 9.30 గంటలకు భారత్ , న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన టెస్ట్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఉదయం 9 గంటలకు జరగాల్సిన టాస్ వాయిదా పడింది. వర్షం తగ్గిన తర్వాతే టాస్ నిర్వహిస్తారు. కానీ, బుధవారం బెంగళూరులో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు తొలిరోజు ఆట జరగడం అనుమానమేనని అంటున్నారు.
రెండో రోజు కూడా 80 శాతం వర్షాలు కురుస్తాయని వెదర్.కామ్ నివేదిక వెల్లడించింది. అందుకే తొలి రెండు రోజులు ఆట జరగడం అనుమానమే.
మూడు, నాల్గవ రోజు వర్షం కురిసే అవకాశం 60% ఉంది. అయితే, ఆ రెండు రోజులు కూడా పూర్తి ఆటను ఆశించలేం. అలాగే, ఐదో రోజు కూడా 70 శాతం వర్షం కురుస్తుందని వెదర్ డాట్ కామ్ నివేదిక పేర్కొంది.
అందువల్ల భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరిగే అవకాశం లేదు. అయితే, మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడం దాదాపు ఖాయమైంది.
రెండో టెస్టు మ్యాచ్ ఎప్పుడు?
అక్టోబర్ 24 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో అక్టోబర్ 28 వరకు మ్యాచ్ జరగనుంది. మూడో మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుండగా, ఈ మ్యాచ్ నవంబర్ 1 నుంచి నవంబర్ 5 వరకు జరగనుంది.
రెండు జట్లు..
భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యస్సవి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ , జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్ టెస్ట్ జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, విల్ ఓరూర్క్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, కేన్ విలియమ్సన్ (మొదటి మ్యాచ్‌కు అందుబాటులో లేరు), జాకబ్ డఫీ, విల్ యంగ్, మైకేల్ బ్రేస్‌వెల్ (మొదటి టెస్టు మాత్రమే), ఇష్ సోధి (మొదటి మ్యాచ్‌కు అందుబాటులో లేరు).
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..