AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటమి తర్వాత ఐర్లాండ్‌కు అయ్యర్ వార్నింగ్! బాగా హర్ట్ అయినట్టు ఉన్నాడుగా..

యువ టీమిండియాకు ఐర్లాండ్ పర్యటనలో షాక్ తగిలింది. టీ20 ప్రపంచ కప్ 2026 విజయం తర్వాత తొలి మ్యాచ్‌లో 'పసికూన' ఐర్లాండ్ చేతిలో ఘోర ఓటమి చవిచూసింది. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడిన శ్రేయస్ అయ్యర్ తీవ్ర నిరాశ చెందాడు. ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకొని, తర్వాతి మ్యాచ్‌లో పూర్తి శక్తితో బరిలోకి దిగుతామని, ఐర్లాండ్‌కు హెచ్చరిక జారీ చేశాడు.

ఓటమి తర్వాత ఐర్లాండ్‌కు అయ్యర్ వార్నింగ్! బాగా హర్ట్ అయినట్టు ఉన్నాడుగా..
Shreyas Iyer
SN Pasha
|

Updated on: Jun 27, 2026 | 8:25 AM

Share

రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన యంగ్ టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. పసికూన ఐర్లాండ్ భారత్‌ను చిత్తుగా ఓడించింది. టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన తర్వాత తొలి మ్యాచ్ ఆడుతూ.. వరల్డ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన భారత్‌ను ఐరిష్ టీమ్ ఒకరకంగా వణికించింది. టాస్ గెలిచి టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఐర్లాండ్ బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేసి 183 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చారు. అయినా కూడా టీమిండియా వద్ద సూపర్ బ్యాటింగ్ పవరుంది.. ఈ స్కోర్ పెద్ద లెక్కకాదులే అని చాలా మంది అనుకున్నారు. కానీ ఐరిష్ బౌలర్లు సూపర్ బౌలింగ్‌తో టీమిండియాను కేవలం 148 పరుగులకే కుప్పకూల్చారు.

అయితే ఈ మ్యాచ్‌తోనే టీ20 కెప్టెన్సీ మొదలుపెట్టిన శ్రేయస్ అయ్యర్ ఇది ఊహించని ఎదురుదెబ్బ అనే చెప్పాలి. టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టును నడిపిస్తూ, కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే పసికూన ఐర్లాండ్‌పై ఓటమి చవిచూశాడు. అయితే ఈ ఓటమితో అయ్యర్ బాగా హర్ట్ అయినట్టు ఉన్నాడు. మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ.. నెక్ట్స్ మ్యాచ్‌‌లో ఆడతామో చెబుతూ ఒక రకంగా ఐర్లాండ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకీ అయ్యర్ ఏమన్నాడంటే.. ‘కెప్టెన్‌గా గొప్ప ఆరంభం (నవ్వుతూ). జరిగిన దాన్ని మేం మర్చిపోవాలి. ఈ మ్యాచ్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తర్వాతి ఆటలో పూర్తి శక్తితో బరిలోకి దిగుతాం. దాని కోసం మేం ఎదురుచూస్తున్నాం.’ అని అన్నాడు.

అలాగే ఇంకా మాట్లాడుతూ.. మొదట్లో బౌలర్లు బాగా బౌలింగ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఆరంభంలోనే రెండు వికెట్లు కూడా తీశారు. దాంతో మాకు మంచి స్టార్ట్ లభించింది, కానీ మధ్యలో మేం సరిగ్గా ఆడలేదు. మేం బౌలింగ్ చేసే సమయంలో కట్టడి చేయాల్సిన టైమ్‌లో పరుగులు సమర్పిచుకున్నాం. ఏదేమైనా ఇక్కడ ఆడటం ఒక గొప్ప అనుభవం. వికెట్ గురించి మంచి అవగాహన వచ్చింది. హర్షిత్ రాణా, శివమ్ దూబే బాగా బౌలింగ్ చేశారు. ఆరంభంలో వారికి పిచ్ నుంచి మంచి సహకారం లభించింది. అయితే దేన్నీ తేలికగా తీసుకోకూడదని నేను అనుకుంటున్నాను. కేవలం వచ్చి మ్యాచ్‌లు గెలిస్తే సరిపోదు. మీరు కష్టపడి పనిచేసి, ఆ క్షణంలో ఉండేలా చూసుకోవాలి. నేను ముందే చెప్పినట్లుగా, మీరు ప్రజెంట్లో ఉండి, ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టే అవకాశం వస్తే, దాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి అని పేర్కొన్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us