India vs England: కోహ్లీ జడేజాను తెలివిగా ప్రయోగించాడు..! అది సక్సెస్ అయిందంటున్న ఇంగ్లాండ్ మాజీ లెజండరీ
India vs England: హెడింగ్లీలో ఇంగ్లండ్ విజయం సాధించిన తర్వాత టీమ్ ఇండియాను ప్రశ్నించిన వారి స్వరం ఇప్పుడు మారింది. లండన్‌లో జరిగిన ఓవల్ టెస్టులో
India vs England: హెడింగ్లీలో ఇంగ్లండ్ విజయం సాధించిన తర్వాత టీమ్ ఇండియాను ప్రశ్నించిన వారి స్వరం ఇప్పుడు మారింది. లండన్‌లో జరిగిన ఓవల్ టెస్టులో భారత్ భారీ తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. హెడింగ్లీ టెస్ట్ విజయం తర్వాత ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుస్సేన్ చాలా ఉత్సాహంగా కనిపించాడు. కానీ అతను ఇప్పుడు టీమ్ ఇండియా అభిమానిగా మారిపోయాడు. నాలుగో టెస్టులో విజయం సాధించిన తర్వాత ఇండియా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ వేదికపై భారత్ రెండోసారి గెలిచింది. అంతకుముందు 1971లో విజయకేతనం ఎగురవేసింది. అయితే టీమిండియా విజయానికి రవీంద్ర జడేజే కారణమని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ అభిప్రాయపడుతున్నాడు. విరాట్ కోహ్లీ తెలివిగా రవీంద్ర జడేజాను ప్రయోగించాడని అది టీమిండియాకు కలిసి వచ్చిందని చెబుతున్నాడు.
విజయంలో రవీంద్ర జడేజా పాత్ర ముఖ్యమైనది నాసిర్ హుస్సేన్ ఇలా మాట్లాడాడు “కోహ్లీ జడేజాను తెలివిగా ప్రయోగించాడని కానీ జో రూట్ మోయిన్ అలీని అలా ఉపయోగించుకోలేదని అన్నాడు. రూట్ కేవలం ఫాస్ట్ బౌలర్లకు మాత్రమే బౌలింగ్ ఇచ్చాడని ఆరోపించాడు. జడేజా మంచి ప్రదర్శన చేశాడని హసీబ్ హమీద్, మొయిన్ వికెట్లు తీయడమే కాకుండా రివర్స్ స్వింగ్ కోసం అవకాశాలను సృష్టించడానికి అతను లెగ్ స్టంప్‌ను ఎగరగొట్టాడని అన్నాడు. అలాగే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌కు క్రెడిట్ ఇవ్వాల్సి ఉందన్నాడు. ప్రత్యర్థి జట్టు కూడా బాగా ఆడుతుందని మనం మరిచిపోతుంటామని ఇంగ్లాండ్ జట్టును ఉద్దేశించి అన్నాడు”
సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు, శార్దుల్ ఠాకూర్ 2 వికెట్లు, రవీంద్ర జడేజా 2 వికెట్లు సాధించారు. పదునైన బౌలింగ్ ముందు ఇంగ్లాండ్ జట్టు 92.2 ఓవర్లలో 210 పరుగులకే కుప్పకూలింది. నాటింగ్‌హామ్‌లో జరిగిన మొదటి టెస్టు డ్రా అయిన తర్వాత లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది, హెడింగ్లీలో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది. ఐదో, చివరి టెస్ట్ సెప్టెంబర్ 10 నుంచి మాంచెస్టర్‌లో జరుగుతుంది.