India vs England, Day 1, Highlights: ముగిసిన తొలి రోజు ఆట.. టీమిండియా స్కోర్ ఎంతంటే..
IND Vs ENG 5th Test Match Live Updates: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1తేడాతో ఆధిక్యంలో నిలిచింది. నేటి నుంచి ప్రారంభమయ్యే టెస్ట్‌లో ఇరుజట్లకు విజయం ఎంతో కీలకంగా మారనుంది.
ఎడ్జ్ బాస్టన్ టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 73 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (146) అద్భుత సెంచరీతో ఆకట్టుకోగా జడేజా (83) రాణించాడు. టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. క్రీజులో జడేజాతో పాటు షమీ (0) ఉన్నాడు.
ఈరోజు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య 5వ టెస్టు మ్యాచ్ జరగనుంది. గతేడాది నిలిచిపోయిన 5వ టెస్టు మ్యాచ్‌ను ప్రస్తుతం నిర్వహించనున్నారు. వాస్తవానికి గత ఏడాది కరోనా కారణంగా ఇరు జట్ల మధ్య జరగాల్సిన 5వ టెస్టు మ్యాచ్ వాయిదా పడింది. సిరీస్‌లో భారత జట్టు 2-1తో ముందంజలో ఉంది. కరోనా దెబ్బకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో జస్ప్రీత్ బుమ్రా ఈ టెస్టులో జట్టుకు నాయకత్వం వహిస్తాడు. రోహిత్ ప్లేస్‌లో మయాంక్ అగర్వాల్ జట్టులోకి వచ్చాడు. 2018లో ఎడ్జ్‌బాస్టన్‌లో చివరిసారిగా సెంచరీ చేసిన విరాట్ కోహ్లీపై కూడా ఈ సిరీస్ కనిపిస్తుంది. అయితే అతని బ్యాట్ గత 3 సంవత్సరాలుగా బ్యాడ్ ఫాంలో కొనసాగుతోంది. ఎడ్జ్‌బాస్టన్‌లోని అభిమానులు కోహ్లి పాత స్టైల్‌ని చూడాలని మరోసారి తహతహలాడుతున్నారు.
ఇరు జట్లు..
టీమిండియా ప్లేయింగ్ XI: శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్)
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): అలెక్స్ లీస్, జాక్ క్రాలే, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), సామ్ బిల్లింగ్స్(కీపర్), మ్యాటీ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్, జేమ్స్ ఆండర్సన్
Key Events
టీమిండియా ఇక్కడ 55 ఏళ్లుగా ఒక్క టెస్ట్ మ్యాచ్ గెలవకపోవడం గమనార్హం.
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టీంల మధ్య జరుగుతోన్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో నిలిచింది.
LIVE Cricket Score & Updates
-
-
ముగిసిన తొలిరోజు ఆట.. టీమిండియా స్కోర్ ఎంతంటే..
ఎడ్జ్ బాస్టన్ టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 73 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (146) అద్భుత సెంచరీతో ఆకట్టుకోగా జడేజా (83) రాణించాడు. టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. క్రీజులో జడేజాతో పాటు షమీ (0) ఉన్నాడు.
-
-
ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా..
ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. స్టోక్స్ బౌలింగ్ లో శార్దూల్ (1) కీపర్ బిల్లింగ్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 323/7.
-
ఆరో వికెట్ డౌన్.. పెవిలియన్ చేరిన పంత్..
భారీ సెంచరీ సాధించిన రిషభ్ పంత్ (146) ఔటయ్యాడు. జో రూట్ బౌలింగ్‌లో జాక్ క్రాలేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో320 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది.
-
300 దాటిన స్కోరు..
ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియా స్కోరు 300 పరుగులు దాటింది. పంత్ (138), జడేజా (63) పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరి మధ్య భాగస్వామ్యం ఇప్పటికే 200 పరుగుల దాటింది. ప్రస్తుతం టీమిండియా స్కోరు 310/5.
-
-
పంత్ సూపర్ సెంచరీ..
ఎడ్జ్ బాస్టన్ టెస్ట్ లో రిషభ్ పంత్ అద్భుత సెంచరీ సాధించాడు. కేవలం 85 బంతుల్లోనే 15 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో మూడంకెల స్కోరును అందుకున్నాడు. మరో ఎండ్లో జడేజా కూడా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
-
200 దాటిన స్కోర్..
పీకల్లోతు కష్టాల నుంచి పంత్, జడేజా జోడీ భారత్‌ను ఆదుకున్నారు. ఈ క్రమంలో సెంచరీ భాగస్వామ్యంతో కీలక పాత్ర పోషించిన వీరు.. జట్టు స్కోర్‌ను కూడా 200 దాటించారు. 50 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులు సాధించింది. పంత్ 76(71 బంతులు, 11 ఫోర్లు, 1 సిక్స్), జడేజా 37(81 బంతులు, 5 ఫోర్లు) పరుగులతో క్రీజులో నిలిచారు.
-
టీ బ్రేక్..
టీ బ్రేక్ సమయానికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 53, జడేజా 32 పరుగులతో క్రీజులో నిలిచారు. పీకల్లోతు కష్టాల్లో మునిగిన భారత్‌ను పంత్, జడేజా జోడీ ఆదుకుంది. వీరిద్దరు కలిసి 76 పరుగుల భాగస్వామ్యంతో కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నారు.
-
పంత్ హాఫ్ సెంచరీ..
ఇంగ్లండ్‌తో జరుగుతోన్న టెస్టులో టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలమైన చోట.. వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ మాత్రం అద్భుతంగా ఆకట్టుకున్నాడు. వరుసగా వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడిన టీమిండియాను రిషబ్ పంత్ ఆదుకున్నాడు. ఈ క్రమంలోనే 52 బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. జడేజాతో కలిసి హాఫ్ సెంచరీకి పైగా భాగస్వామ్యాన్ని నిర్మించాడు.
-
150 పరుగులకు చేరిన టీమిండియా స్కోర్..
టీమిండియా ప్రస్తుతం 37.1 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 150 పరుగులు చేసింది. పంత్ 39, జడేజా 26 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరు కలిసి హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నిర్మించారు.
-
ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా..
శ్రేయాస్ అయ్యర్ (15) రూపంలో టీమిండియా 5వ వికెట్‌ను కోల్పోయింది. ఆండర్సన్ బౌలింగ్‌లో కీపర్ బిల్లింగ్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 27.5 ఓవర్లకు భారత్ 5 వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది.
-
కోహ్లీ ఔట్..
విరాట్ కోహ్లీ(11)కి లక్ కలసి రావడం లేదు. తన బ్యాడ్ ఫాంతో సతమవుతోన్న కోహ్లీ.. ఇంగ్లండ్‌తో జరుగుతోన్న 5వ టెస్టులోనూ ఇదే వరుసలో కేవలం 11 పరుగులు చేసి నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా కష్టాలు మరింత పెరిగాయి.
-
మూడో వికెట్ డౌన్..
వర్షం తర్వాత మ్యాచ్ మొదలైన వెంటనే టీమిండియాకు మరోషాక్ తగిలింది. తెలుగబ్బాయ్ హనుమ విహారి (20) ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో ప్రస్తుతం 23 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్లు నష్టపోయి 69 పరుగులు చేసింది. కోహ్లీ 10, పంత్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
-
లంచ్ బ్రేక్..
20.1 ఓవర్లు ముగిసే సరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. తెలుగబ్బాయి విహారి 14, కోహ్లీ 1 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్ 2 వికెట్లు పడగొట్టాడు. శుభ్మన్ గిల్ 17, పుజారా 13 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. తొలి సెషన్ ముగిసే సరికి ఇంగ్లండ్ బౌలర్లు ఆధిక్యం చూపించారు. ఇక రెండో సెషన్ బాధ్యత అంతా విహారి, విరాట్ కోహ్లీ పైనే ఆధారపడి ఉంది. లేదంటే తొలిరోజే భారత్ పీకల్లోతు కష్టాల్లోకి జారిపోనుంది.
-
50 పరుగులకు చేరిన భారత్..
19 ఓవర్లు ముగిసే సరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 52 పరుగులు చేసింది. తెలుగబ్బాయి విహారి 14, కోహ్లీ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. మరోవైపు ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్ 2 వికెట్లు పడగొట్టాడు. శుభ్మన్ గిల్ 17, పుజారా 13 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.
-
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా..
పుజారా(13) రూపంలో టీమిండియా రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆండర్సన్ బౌలింగ్‌లో క్రాలీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో టీం స్కోర్ 46 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్‌ను కోల్పోయింది.
-
తొలి వికెట్ డౌన్..
శుభ్మన్ గిల్(17) రూపంలో టీమిండియా తొలి వికెట్‌ను కోల్పో్యింది. ఆండర్సన్ బౌలింగ్‌లో క్రాలీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో టీం స్కోర్ 27 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది.
-
England vs India, 5th Test: టీమిండియా ప్లేయింగ్ XI:
శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్)
-
England vs India, 5th Test: ఇంగ్లండ్ ప్లేయింగ్ XI:
అలెక్స్ లీస్, జాక్ క్రౌలీ, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, సామ్ బిల్లింగ్స్, మాథ్యూ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్ మరియు జేమ్స్ ఆండర్సన్
-
India vs England: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. టీమిండియా బ్యాటింగ్..
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నేడు 5వ టెస్టు మ్యాచ్ జరగనుంది. కాగా, టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది.
Published On - Jul 01,2022 2:32 PM