IND vs ENG: రోహిత్, గంభీర్‌లకు అసలైన టెస్ట్.. 17 ఏళ్ల ఓటమికి చెక్ పెట్టేనా?
India vs England Test Series Schedule: భారత క్రికెట్ జట్టు వచ్చే ఏడాది ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఇండ్లండ్ జట్టుతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. టెస్టు సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. జూన్ 20 నుంచి లీడ్స్‌లో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుండగా, చివరి టెస్టు జులై 31న జరగనుంది. దీంతో పాటు బర్మింగ్‌హామ్, లార్డ్స్, మాంచెస్టర్‌లలో కూడా టీమిండియా టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.
India vs England Test Series Schedule: వచ్చే ఏడాది ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు అక్కడ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో బీసీసీఐ షెడ్యూల్‌ను ప్రకటించింది. వచ్చే ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో మహిళల జట్టు ఐదు టీ20లు, మూడు వన్డేలు కూడా ఆడనుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
భారత క్రికెట్ జట్టు వచ్చే ఏడాది ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఇండ్లండ్ జట్టుతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. టెస్టు సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. జూన్ 20 నుంచి లీడ్స్‌లో భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుండగా, చివరి టెస్టు జులై 31న జరగనుంది. దీంతో పాటు బర్మింగ్‌హామ్, లార్డ్స్, మాంచెస్టర్‌లలో కూడా టీమిండియా టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఇది కాకుండా, మహిళల జట్టు కూడా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది, అక్కడ ఐదు T20, మూడు ODI మ్యాచ్‌లు ఆడునుంది. భారత్-ఇంగ్లండ్ మహిళల టీ20 సిరీస్ జూన్ 28 నుంచి జులై 12 వరకు జరగనుండగా, వన్డే సిరీస్ మ్యాచ్‌లు జులై 16, 19, 22 తేదీల్లో జరగనున్నాయి.
భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్..
మొదటి టెస్ట్, జూన్ 20-24, హెడ్డింగ్లీ
రెండవ టెస్ట్, 2-6 జూలై, బర్మింగ్‌హామ్
మూడవ టెస్ట్, 10-14 జూలై, లార్డ్స్
నాల్గవ టెస్ట్, 23-27 జూలై, మాంచెస్టర్
ఐదవ టెస్ట్, 31 జూలై-4 ఆగస్టు, లండన్.
Announced! 🥁
A look at #TeamIndia‘s fixtures for the 5⃣-match Test series against England in 2025 🙌#ENGvIND pic.twitter.com/wS9ZCVbKAt
— BCCI (@BCCI) August 22, 2024
ఇంగ్లాండ్ పర్యటనలో భారత మహిళల జట్టు షెడ్యూల్..
1వ టీ20, జూన్ 28, నాటింగ్‌హామ్
2వ టీ20, జూలై 1, బ్రిస్టల్
3వ టీ20, జూలై 4, లండన్
4వ టీ20, జూలై 9, మాంచెస్టర్
5వ T20, 12 జూలై, బర్మింగ్‌హామ్.
వన్డే సిరీస్ షెడ్యూల్..
1వ ODI, జూలై 16, సౌతాంప్టన్
2వ వన్డే, జూలై 19, లార్డ్స్
3వ ODI, జూలై 22, చెస్టర్-లీ-స్ట్రీట్
17 ఏళ్లుగా ఇంగ్లండ్‌లో టీమిండియా గెలవలే..
ఇంగ్లండ్ టూర్ భారత క్రికెట్ జట్టుకు చాలా కీలకం కానుంది. గత 17 ఏళ్లుగా ఇంగ్లండ్‌లో టీమిండియా టెస్టు సిరీస్‌ను గెలవలేదు. 2007లో ఇంగ్లండ్‌లో చివరి టెస్టు సిరీస్ విజయం సాధించింది. చివరి టూర్‌లో టీమిండియా కచ్చితంగా విజయానికి చేరువైంది. 2021-22 ఇంగ్లండ్ పర్యటనలో టెస్ట్ సిరీస్ 2-2తో డ్రా అయింది. గత సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్ చివరి టెస్టులో ఓడి సిరీస్‌ను డ్రా చేసుకుంది. దీంతో పాటు ఇంగ్లండ్‌లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా రెండు ఫైనల్స్‌లోనూ ఓడిపోవడంతో రోహిత్, గంభీర్ జోడీకి ఈ టూర్ అంత సులువు కాదన్నది స్పష్టం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..