ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. 20 ఓవర్లకు 186 పరుగులు.. హాఫ్ సెంచరీతో అదరగొట్టిన సూర్యకుమార్..
India vs England 4th T20 : భారత్- ఇంగ్లాండ్ ఐదు టీ ట్వంటీ సిరీస్‌లో భాగంగా.. ఈ రోజు అహ్మదాబాద్‌లో నాలుగో మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భాగంగా టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ 20 ఓవర్లు ముగిసేసరికి
India vs England 4th T20 : భారత్- ఇంగ్లాండ్ ఐదు టీ ట్వంటీ సిరీస్‌లో భాగంగా.. ఈ రోజు అహ్మదాబాద్‌లో నాలుగో మ్యాచ్ జరుగుతోంది. ఇందులో భాగంగా టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. టీమిండియా ప్లేయర్ సూర్యకుమార్ తొలి మ్యాచ్‌లోనే చెలరేగిపోయాడు. హాఫ్ సెంచరీ సాధించి అరంగ్రేటం మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. సూర్యకుమార్ 31 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ 18 బంతుల్లో 37 పరుగులు చేసి వేగంగా ఆడాడు. రిషబ్ పంత్ 23 బంతుల్లో 30 పరుగులు చేసి వెనుదిరిగాడు. మిగిలిన వారిలో ఎవ్వరూ పెద్దగా రాణించలేదు. కోహ్లీ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ మొదటి బంతికే సిక్స్ బాది మంచి ఊపుమీదున్నట్లు కనిపించినా పేలవమైన షాట్ ఆడబోయి వికెట్ చేజార్చుకున్నాడు. ఇక ఇంగ్లీష్ బౌలర్లలో జోప్రా ఆర్చర్ 4 వికెట్లు సాధించాడు.