AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఉప్పల్ మైదానంలో అలజడి.. రోహిత్ పాదాలు తాకిన కోహ్లీ అభిమాని.. హిట్‌మ్యాన్ రియాక్షన్ ఏంటంటే?

Fan Meet Rohit Sharma Video: అయితే, రోహిత్ శర్మను కలిసేందుకు ఒక అభిమాని భద్రతా చర్యలను ఉల్లంఘించి మైదానంలోకి ప్రవేశించాడు. రోహిత్ శర్మను చేరుకుని, ఏకంగా ఆయన పాదాలకు నమస్కారం చేశాడు. దీంతో ఊహించని పరిణామంతో షాకైన రోహిత్.. ఆ అభిమానిని వారించాడు. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది స్పందించి పరిస్థితిని చక్కదిద్దారు. ఆ అభిమానిని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. దీంతో కొద్దిసేపు ఆటకు అంతరాయం కలిగింది.

Video: ఉప్పల్ మైదానంలో అలజడి.. రోహిత్ పాదాలు తాకిన కోహ్లీ అభిమాని.. హిట్‌మ్యాన్ రియాక్షన్ ఏంటంటే?
Hyd Fan Meet Rohit Sharma V
Venkata Chari
|

Updated on: Jan 25, 2024 | 4:30 PM

Share

India vs England 1st Test: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ తొలి రోజు మొదలైంది. అయితే, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు టీమిండియా ఓపెనర్స్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ క్రీజులోకి వచ్చారు. ఇంతలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

అయితే, రోహిత్ శర్మను కలిసేందుకు ఒక అభిమాని భద్రతా చర్యలను ఉల్లంఘించి మైదానంలోకి ప్రవేశించాడు. రోహిత్ శర్మను చేరుకుని, ఏకంగా ఆయన పాదాలకు నమస్కారం చేశాడు. దీంతో ఊహించని పరిణామంతో షాకైన రోహిత్.. ఆ అభిమానిని వారించాడు. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది స్పందించి పరిస్థితిని చక్కదిద్దారు. ఆ అభిమానిని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. దీంతో కొద్దిసేపు ఆటకు అంతరాయం కలిగింది.

మ్యాచ్‌ గురించి మాట్లాడితే, ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత స్పిన్నర్లు రవి అశ్విన్, రవీంద్ర జడేజా జోడీ సత్తా చాటారు. తలో మూడు వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా సాగలేదు. అలాగే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్ తరపున బెన్ స్టోక్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 70 పరుగుల వద్ద జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్‌ 246 పరుగులకు ఆలౌట్ అయింది.

2012లో చివరి ఓటమి తర్వాత తమ సొంతగడ్డపై భారత్‌ను ఓడించిన మొదటి జట్టుగా అవతరించడం లక్ష్యంగా పెట్టుకున్న ఇంగ్లండ్.. భారత్‌లో చారిత్రాత్మక సిరీస్ విజయంపై దృష్టి సారిస్తోంది. భారత్ స్వదేశంలో ఆధిపత్యం చెలాయిస్తోంది. 2013 నుంచి వరుసగా 16 టెస్ట్ సిరీస్‌లను గెలుచుకుంది.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ క్వాలిఫికేషన్ సందర్భంలో భారత్, ఇంగ్లండ్ జట్లకు రెండింటికీ ఈ సిరీస్ ప్రాముఖ్యతను కలిగి ఉంది. ప్రస్తుతం భారత్ 54.16 శాతం పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, ఇంగ్లండ్ 15 శాతం పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..