Ind vs Eng: కష్టాల్లో టీమిండియా.. స్వల్ప వ్యవధిలో వరుస వికెట్లు.. విజయం దిశగా ఇంగ్లాండ్..

India vs England: చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. స్వల్ప వ్యవధిలో వరుస వికెట్లు కోల్పోవడంతో...

Ind vs Eng: కష్టాల్లో టీమిండియా.. స్వల్ప వ్యవధిలో వరుస వికెట్లు.. విజయం దిశగా ఇంగ్లాండ్..
Follow us

|

Updated on: Feb 09, 2021 | 11:34 AM

India vs England: చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. స్వల్ప వ్యవధిలో వరుస వికెట్లు కోల్పోవడంతో 117 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ(32), అశ్విన్(1) ఉన్నారు. ఇక 37 ఓవర్లు ముగిసేసరికి భారత్ 126/6 పరుగులు చేసింది.

అంతకుముందు 39 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో ఐదో రోజు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఇంగ్లాండ్ షాక్ ఇచ్చింది. క్రీజులో కుదురుకున్న పుజారా(15) లీచ్ పెవిలియన్ బాట పట్టించాడు. ఇక ఆ తర్వాత ఆండర్సన్.. గిల్(50), రహనే(0), పంత్(11)లను స్వల్ప వ్యవధిలో ఔట్ చేశాడు. అటు వాషింగ్టన్ సుందర్(0)ను డొమినిక్ బెస్ డకౌట్ చేయడంతో టీమిండియా కష్టాల్లో పడింది. ప్రస్తుతం టీమిండియా గెలవాలంటే ఇంకా 294 పరుగులు చేయాల్సి ఉంది.

ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ వివరాలు..

అంతకముందు 241 పరుగుల ఆధిక్యంతో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్‌ను.. అశ్విన్ బెంబేలెత్తించాడు. ఇంగ్లాండ్ భారీ టార్గెట్ నిర్దేశించకుండా నిలువరించాడు. కీలకమైన ఆరు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఈ క్రమంలోనే ఇంగ్లీష్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియాకు 420 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. రూట్(40) మరోసారి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోర్ వివరాలు..

ఇక తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 337 పరుగులకు ఆలౌట్ అయింది. 257/6 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్ మరో 80 పరుగులు జోడించి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ వాషింగ్టన్ సుందర్(85*) రాణించడంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బెస్ నాలుగు వికెట్లు.. ఆర్చర్, లీచ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ వివరాలు..

అంతకముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 578 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. కెప్టెన్ జో రూట్(218: 377 బంతుల్లో 19×4, 2×6) సూపర్ డబుల్ సెంచరీతో ఇన్నింగ్స్‌కి వెన్నుముకగా నిలవగా.. ఓపెనర్ సిబ్లీ(87: 286 బంతుల్లో 12×4, 0x6), ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(82: 118 బంతుల్లో 10×4, 3×6) మంచి భాగస్వామ్యాలను నెలకొల్పడంలో సహాయపడ్డారు. అటు లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ బెస్(34) కూడా రాణించడంతో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోర్ సాధించింది. టీమిండియా బౌలర్లలో ఇషాంత్, నదీమ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. బుమ్రా, అశ్విన్ చెరో మూడు వికెట్లు తీశారు.

Also Read: ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా.. తొలి టెస్టులో విజయం దిశగా ఇంగ్లాండ్…