IND vs BAN 2nd Test: డ్రా అంచున కాన్పుర్ టెస్ట్.. మిగిలింది రెండే రోజులు..
IND vs BAN 2nd Test, Day 3 Called Off: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట ఆదివారం నేల తడి కారణంగా రద్దు చేసింది. అయితే, మూడో రోజు ఉదయం నుంచి వర్షం కురవలేదు. కానీ, మైదానంలోని పలు ప్రాంతాలు తడిగా ఉండడంతో అంపైర్లు ఆటను రద్దు చేయాలని నిర్ణయించారు. మైదానంలోని అంపైర్లు ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ఫీల్డ్‌ను పరిశీలించారు.
IND vs BAN 2nd Test, Day 3 Called Off: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట ఆదివారం నేల తడి కారణంగా రద్దు చేసింది. అయితే, మూడో రోజు ఉదయం నుంచి వర్షం కురవలేదు. కానీ, మైదానంలోని పలు ప్రాంతాలు తడిగా ఉండడంతో అంపైర్లు ఆటను రద్దు చేయాలని నిర్ణయించారు. మైదానంలోని అంపైర్లు ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ఫీల్డ్‌ను పరిశీలించారు. అయితే, చివరికి ఆ రోజు ఆటను రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. నాలుగో రోజైన సోమవారం సమయానికి ఆట ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.
కాన్పూర్ టెస్టులో ఇప్పటి వరకు 35 ఓవర్లు మాత్రమే పడ్డాయి..
బంగ్లాదేశ్ తొలి రోజు మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. అయితే, ఆ తర్వాత వర్షం కారణంగా ఆట సాధ్యం కాలేదు. మూడవ రోజు ఉదయం ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు. ఉదయం 9:30 గంటలకు వరకు గ్రౌండ్ నుంచి కవర్లన్నీ తొలగించారు. కానీ నేలపై రెండు తడి పాచెస్ సమస్యగా మారాయి. ఒక పాచ్ బౌలింగ్ రన్-అప్‌కు సమీపంలో ఉంది. మరొకటి అవుట్‌ఫీల్డ్‌లో ఉంది. ఎండబెట్టడం సాధ్యం కాదు. మూడో రోజు ఆట రద్దు కావడంతో గ్రీన్ పార్క్ స్టేడియం వద్ద పెద్దఎత్తున తరలివచ్చిన ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పుడు మ్యాచ్‌కు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండగా కేవలం 35 ఓవర్లు మాత్రమే జరిగాయి.
కాన్పూర్ టెస్టు డ్రా అయితే భారత్‌కు ఎంత నష్టం?
భారత్, బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ టెస్టు డ్రాగా మారే అవకాశం ఉంది. కాన్పూర్ టెస్ట్ మ్యాచ్ డ్రా అయితే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో భారత్ భారీ నష్టాన్ని చవిచూడవచ్చు. కాన్పూర్ టెస్టు డ్రా కావడంతో భారత్ బంగ్లాదేశ్‌తో పాయింట్లు పంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ స్థితిలో భారత్, బంగ్లాదేశ్‌లు 4-4 పాయింట్లు పంచుకోవాల్సి ఉంటుంది. కాన్పూర్ టెస్టులో భారత్ గెలిస్తే 12 పాయింట్లు వస్తాయి. అంటే, టెస్టు మ్యాచ్ డ్రా అయితే భారత్ 8 పాయింట్లు కోల్పోవాల్సి వస్తుంది.
9 టెస్టుల్లో 5 మ్యాచ్‌లు..
కాన్పూర్ టెస్టు డ్రా కావడంతో భారత్‌కు 68.18 శాతం పాయింట్లు మిగిలాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యుటీసీ) ఫైనల్ టిక్కెట్‌ను పొందడానికి, భారత్ తదుపరి 9 టెస్ట్ మ్యాచ్‌లలో 5 గెలవాలి. బంగ్లాదేశ్‌తో కాన్పూర్ టెస్ట్ తర్వాత, భారత్ న్యూజిలాండ్‌తో 3 టెస్ట్ మ్యాచ్‌లు (హోమ్), ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ మ్యాచ్‌లు (విదేశాల్లో) ఆడాల్సి ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..