TV9 Telugu
10 March 2025
ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా సురేష్ రైనా వ్యాఖ్యాతగా వార్తల్లో నిలిచాడు. ఈ సమయంలో భారత విజయం పట్ల సంతోషిస్తున్నట్లు కూడా కనిపించాడు.
2020 సంవత్సరంలో రైనా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు పూర్తిగా వీడ్కోలు పలికాడు. అయితే, అతను తన చివరి మ్యాచ్‌ను 2018లో ఆడాడు.
రైనా భారతదేశం తరపున 312 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 7000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. 226 వన్డేలు, 78 టీ20లు, 18 టెస్టులు ఉన్నాయి.
కానీ, భారత మాజీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా రిటైర్మెంట్ తర్వాత బీసీసీఐ అతనికి ఎంత పెన్షన్ ఇస్తుందో తెలుసా?
నివేదికల ప్రకారం, సురేష్ రైనాకు బీసీసీఐ నుంచి లభించే పెన్షన్ మొత్తం రూ. 60 వేలుగా ఉంది.
జూన్ 2022లో బీసీసీఐ భారత క్రికెటర్ల పెన్షన్‌ను దాదాపు రెట్టింపు చేసింది. దీంతో మాజీ ఆటగాళ్లకు పెన్షన్ భారీగా పెరిగింది.
సురేష్ రైనా తన కెరీర్‌లో కేవలం 18 టెస్టులు మాత్రమే ఆడాడు. కాబట్టి, అతనికి రూ.70,000 పెన్షన్ రాదు. దీనికోసం కనీసం 25 టెస్టులు ఆడటం అవసరం.
25 కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన వారికి 70000 రూపాయల పెన్షన్ బీసీసీఐ అందిస్తోంది. ఈ లెక్కన సురేష్ రైనాకే రూ.10వేలు తక్కువ పెన్షన్ వస్తోంది.