రిటైర్మెంట్ తర్వాత విలియమ్సన్‌కు ఎంత పెన్షన్ లభిస్తుంది?
TV9 Telugu
09 March 2025
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం దుబాయ్‌లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ తర్వాత కొందరు ఆటగాళ్లు రిటైర్మెంట్ చేసే ఛాన్సుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత చాలా మంది అనుభవజ్ఞులైన ఆటగాళ్ళు రిటైర్ కావొచ్చు. ఇందులో కేన్ విలియమ్సన్ పేరు ముందంజలో ఉందని చెబుతున్నారు.
విలియమ్సన్ న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్టును విడిచిపెట్టాడు. అతని వయస్సు 34 సంవత్సరాలు అయినప్పటికీ, అతను వన్డే ఫార్మాట్‌ను విడిచిపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ప్రశ్న ఏమిటంటే, కేన్ విలియమ్సన్ పదవీ విరమణ చేస్తే, అతని పెన్షన్ ఎంత అవుతుంది? న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నియమాలను ఓసారి చూద్దాం.
కేన్ విలియమ్సన్‌కు పదవీ విరమణ తర్వాత ఎలాంటి పెన్షన్ రాదు. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు పదవీ విరమణ తర్వాత ఎవరికీ పెన్షన్ ఇవ్వదు.
పదవీ విరమణ తర్వాత, చాలా మంది పెద్ద కివీస్ ఆటగాళ్ళు చిన్న ఉద్యోగాలు చేస్తూ కనిపించారు. ఇందులో మాథ్యూ సింక్లైర్, నాథన్ ఆస్టిల్, క్రిస్ కైర్న్స్ పేర్లు ఉన్నాయి.
ఇటీవల రిటైర్ అయిన మార్టిన్ గుప్టిల్ టీ20 లీగ్‌లో ఆడుతూ డబ్బు సంపాదిస్తున్నాడు. భవిష్యత్తులో విలియమ్సన్ కూడా అలాగే చేయాల్సి ఉంటుంది.
అయితే, కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ చేస్తాడని అంతా అనుకుంటున్నారు. మరి మ్యాచ్ తర్వాత నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.