IND Vs AUS: భారత్‌తో తొలి టెస్ట్.. ఆసీస్‌ ఆటగాళ్లలో గుబులు.. కంగారుపెట్టిస్తోన్న 4 అంశాలు ఇవే!

టెస్టుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క అన్నట్లుగా..

IND Vs AUS: భారత్‌తో తొలి టెస్ట్.. ఆసీస్‌ ఆటగాళ్లలో గుబులు.. కంగారుపెట్టిస్తోన్న 4 అంశాలు ఇవే!
4 టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. దీంతో 4 టెస్టుల సిరీస్‌లో టీమిండియా 1-0తో ముందంజలో ఉంది. ఇప్పుడు ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌లో రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించాలనే ఉద్దేశ్యంతో భారత జట్టు బరిలోకి దిగనుంది. అదే సమయంలో ఢిల్లీ టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని ఆస్ట్రేలియా జట్టు భావిస్తోంది. అయితే ఢిల్లీ టెస్టులో ఈ 5గురు ఆస్ట్రేలియన్ ఆటగాళ్లతో భారత జట్టు జాగ్రత్తగా ఉండాల్సిందే. వీరికి మ్యాచ్ గమనాన్ని మార్చే సామర్థ్యం ఉంది. సో రోహిత్ సేన వీరిపై ఓ కన్నేయాల్సి ఉంటుంది. వారెవరో చూద్దాం..
Follow us

|

Updated on: Feb 07, 2023 | 1:32 PM

టెస్టుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క అన్నట్లుగా.. టీమిండియాను ఓడించడం ఆసీస్‌కు అంత ఈజీ కాదు.. కచ్చితంగా భయపడాలి. ఆతిధ్య జట్టును తక్కువ అంచనా వేస్తే వైట్‌వాష్ తప్పదు. ఇందుకు నిదర్శనంగా ఇప్పటివరకు ఆస్ట్రేలియా జట్టు పూర్తిగా ప్రతికూల వైఖరిని చూపిస్తోంది. మొదటిగా ప్రాక్టిస్ మ్యాచ్‌లు వద్దన్న కంగారూలు.. ఆ తర్వాత ఇక్కడి పిచ్‌లపై విమర్శలు గుప్పించారు. అలాగే భారత్‌లో టీమిండియాపై గెలవడం యాషెస్ సిరీస్ కంటే ఎక్కువని కామెంట్స్ చేశారు. మరి ఇవన్నీ చూస్తుంటే ఆసీస్ ప్లేయర్స్ అంతలా భయపడటానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • మొదటి పాయింట్:

నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ స్టేడియం ఆస్ట్రేలియా ప్లేయర్స్‌ను టెన్షన్ పెడుతోంది. ఈ మైదానం పూర్తిగా స్పిన్ ఫ్రెండ్లీ. ఫాస్ట్ పిచ్‌లపై అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ ప్లేయర్స్.. ఇక్కడ ఆడాలంటే కష్టపడాల్సిందే. ఒక్క నాగ్‌పూర్‌లోనే కాదు, మిగిలిన టెస్ట్ మ్యాచ్‌ల్లో కూడా దాదాపుగా స్పిన్ పిచ్‌లే తయారవుతున్నాయి.

  • రెండో పాయింట్:

స్పిన్ పిచ్‌లు అటుంచితే.. వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు మరో ఎత్తు. భారత బౌలింగ్ విభాగంలో ప్రపంచ స్థాయి స్పిన్నర్లు ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్.. ప్రస్తుతం ఈ నలుగురు స్పిన్నర్లు కంగారూలను కంగారుపెట్టిస్తున్నారు. గతంలో అనేక సందర్భాల్లో ఆస్ట్రేలియా జట్టును అశ్విన్‌ ముప్పుతిప్పలు పెట్టాడు. కాబట్టి అతడు ఆసీస్‌కు ముందున్న పెద్ద సవాల్. అలాగే, అక్షర్ పటేల్ స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలోనూ ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఇబ్బందిపడిన సందర్భాలు లేకపోలేదు.

  • మూడో పాయింట్:

ఆస్ట్రేలియా చివరిసారిగా 19 ఏళ్ల క్రితం భారత్‌లో టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. 2004లో టీమిండియాపై టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న ఆసీస్.. ఆ తర్వాత వరుసగా ఓటములు ఎదుర్కుంటూ వచ్చింది. 2012-13లో అయితే ఏకంగా ఆస్ట్రేలియాను వైట్‌వాష్ చేసింది భారత్. ఇదొక్కటే కాదు, టీమిండియా స్వదేశంలో వరుసగా రెండు టెస్టు సిరీస్‌లు గెలుచుకుంది.

  • నాలుగో పాయింట్:

టీమిండియా వన్‌డౌన్ ఆటగాడు ఛతేశ్వర్ పూజారా ఆస్ట్రేలియా బౌలర్లను దడపుట్టిస్తున్నాడు. అతడు ఒక్కసారి నిలదొక్కుకున్నాడంటే.. అవుట్ చేయడం కష్టం. మొన్నటి సిరీస్‌లోనూ ఇదే జరిగింది. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఎప్పుడూ ఆస్ట్రేలియాపై పరుగులు సాధిస్తాడు. ఇప్పటిదాకా పుజారా ఆస్ట్రేలియాపై 20 టెస్టుల్లో 54కి పైగా సగటుతో 1893 పరుగులు చేశాడు.

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..