Video: పాక్ టార్గెల్ 420.. ఓపెనర్స్ దూకుడితో తేలిపోయిన భారత్.. కట్‌చేస్తే.. 10 వికెట్లతో షాకిచ్చిన బౌలర్.. ఎవరంటే?
India vs Pakistan: 1999లో పాకిస్థాన్‌తో జరిగిన ఢిల్లీ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా దిగ్గజ బౌలర్ ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఆ సమయంలో ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు.
Anil Kumble: క్రికెట్‌లో ఎన్నో రికార్డులు వస్తుంటాయి. అవి బ్రేక్ అవుతూనే ఉంటాయి. కానీ, కొన్ని రికార్డులు మాత్రం ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి. అలాంటి లిస్టులో చాలా తక్కువ మాత్రమే ఉంటాయి. ఇలాంటి అదుదైన రికార్డులో ఓ భారత బౌలర్ కూడా ఉన్నాడు. ఆయనెవరో కాదు భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే. ఈ లెగ్ స్పిన్నర్ క్రికెట్ మైదానంలో బ్యాటర్లకు చుక్కలు చూపించేది. సరిగ్గా ఈ రోజు అంటే 7 ఫిబ్రవరి 1999న కుంబ్లే ఒంటిచేత్తో పాకిస్థాన్‌ను బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు. 1999లో పాకిస్థాన్‌తో జరిగిన ఢిల్లీ టెస్ట్ మ్యాచ్‌లో అనిల్ కుంబ్లే ఒక ఇన్నింగ్స్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఆ సమయంలో ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన రెండో బౌలర్‌గా నిలిచాడు.
1999లో పాకిస్థాన్‌తో జరిగిన 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు 12 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. దీంతో సిరీస్ సమం కావాలంటే భారత్ రెండో మ్యాచ్‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాల్సిందే. ఆ సమయంలో ఢిల్లీ టెస్టులో భారత కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకే కుప్పకూలింది. ఇందులో పాకిస్థాన్ బౌలర్ సక్లైన్ ముస్తాక్ 5 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత పాక్ జట్టు కూడా తమ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే కుప్పకూలడంతో భారత్‌కు కూడా మంచి ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 339 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్‌కు 420 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది.
2⃣6⃣.3⃣ Overs9⃣ Maidens7⃣4⃣ Runs1⃣0⃣ Wickets
?️ #OnThisDay in 1999, #TeamIndia legend @anilkumble1074 etched his name in record books, becoming the first Indian cricketer to scalp 1⃣0⃣ wickets in a Test innings ? ?
Revisit that special feat ? pic.twitter.com/wAPK7YBRyi
— BCCI (@BCCI) February 7, 2023
కుంబ్లే స్పిన్ మాయాజాలంతో పేకమేడలా కూలిన పాక్ జట్టు..
మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో పాక్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్లు జట్టుకు శుభారంభం అందించి 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత కుంబ్లే తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించి షాహిద్ అఫ్రిది, ఆ తర్వాత సయీద్ అన్వర్ వికెట్లు పడగొట్టాడు. ఇక్కడి నుంచి పాక్ బ్యాట్స్‌మెన్లు ఒక్కొక్కరుగా పెవిలియన్‌కు చేరుకోవడంతో జట్టు మొత్తం 207 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 212 పరుగుల తేడాతో గెలుపొందగా, అనిల్ కుంబ్లే ఈ ఇన్నింగ్స్‌లో 26.3 ఓవర్లలో 74 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టి తన టెస్టు కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..