AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రికెట్‌ మ్యాచ్‌లో అపశ్రుతి.. క్యాచ్‌ పడుతూ తీవ్రంగా గాయపడ్డ క్రికెటర్‌.. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలింపు

డొమినిక్ ఇంటర్నేషనల్ లీగ్ T20లో గల్ఫ్ జెయింట్స్ తరపున ఆడుతున్నప్పుడు డ్రేక్స్ తీవ్రంగా గాయపడ్డాడు. క్యాచ్ పట్టే యత్నంలో డ్రేక్స్‌ ముఖం నేలకు బలంగా తాకింది. దీంతో వెంటనే అతడు తీవ్రమైన నొప్పితో విలవిల్లాడు.

క్రికెట్‌ మ్యాచ్‌లో అపశ్రుతి.. క్యాచ్‌ పడుతూ తీవ్రంగా గాయపడ్డ క్రికెటర్‌.. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలింపు
Dominic Drakes
Basha Shek
|

Updated on: Feb 07, 2023 | 12:05 PM

Share

ఆటల్లో గాయాలు సహజమే. క్రికెట్‌తో పాటు అన్ని క్రీడల్లోనూ తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆటగాళ్లు గాయపడుతుంటారు. క్రికెట్‌ ఇందుకు మినహాయింపేమీ కాదు. బ్యాటర్లు, బౌలర్లతో సహా ఫీల్డర్లు కూడా తీవ్రంగా గాయపడుతుంటారు. తాజాగా వెస్టిండీస్‌కు చెందిన డొమినిక్ డ్రేక్స్ విషయంలో జరిగింది . డొమినిక్ ఇంటర్నేషనల్ లీగ్ T20లో గల్ఫ్ జెయింట్స్ తరపున ఆడుతున్నప్పుడు డ్రేక్స్ తీవ్రంగా గాయపడ్డాడు. క్యాచ్ పట్టే యత్నంలో డ్రేక్స్‌ ముఖం నేలకు బలంగా తాకింది. దీంతో వెంటనే అతడు తీవ్రమైన నొప్పితో విలవిల్లాడు. దీంతో గ్రౌండ్‌ సిబ్బంది వెంటనే అతనిని స్ట్రెచర్‌పై ఆస్పత్రికి తరలించారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే .. తీవ్రంగా గాయపడినా డ్రేక్స్‌ క్యాచ్‌ను విడిచిపెట్టలేదు. నొప్పితోనే బంతిని ఒడిసి పట్టుకున్నాడు. ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో భాగంగా సోమవారం జరిగిన షార్జా వారియర్స్, గల్ఫ్ జెయింట్స్ సందర్భంగా ఈ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు, క్రికెట్‌ ఫ్యాన్స్‌ వెస్టిండీస్‌ క్రికెటర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. షార్జా వారియర్స్‌ పై గల్ఫ్ జెయింట్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన షార్జా 107 పరుగులకే కుప్పకూలింది. గల్ఫ్ జెయింట్స్ బౌలర్లలో డేవిడ్‌ వైస్ ఐదు వికెట్లతో షార్జాను హడలెత్తించాడు. బ్రాత్‌వైట్ రెండు, సంచిత్‌ శర్మ,హెల్మ్‌ తలా వికెట్‌ సాధించారు. అనంతరం 108 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జెయింట్స్ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..