IND vs AUS 5th Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 5వ టెస్టులో ఆస్ట్రేలియాకు భారత్ 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో లంచ్ వరకు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 3 వికెట్లకు 71 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్ క్రీజులో ఉన్నారు. స్టీవ్ స్మిత్ (4 పరుగులు), మార్నస్ లాబుషాగ్నే (6 పరుగులు), సామ్ కాన్స్టాన్స్ (22 పరుగులు)లను ప్రసిద్ధ్ కృష్ణ పెవిలియన్‌కు పంపాడు.
అంతకుముందు మూడో రోజు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 157 పరుగులకు ఆలౌటైంది. 141/6 స్కోరుతో ఉదయం ఆట ప్రారంభించిన భారత జట్టు కేవలం 17 పరుగులు జోడించి చివరి 4 వికెట్లు కోల్పోయింది. ప్రసిద్ధ్ కృష్ణ ఒక పరుగు చేసి నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా జీరోకే ఔట్ కాగా, మహ్మద్ సిరాజ్ (4 పరుగులు)ను స్కాట్ బోలాండ్ పెవిలియన్ చేర్చాడు. ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో బోలాండ్ మెరిశాడు. పాట్ కమిన్స్ వాషింగ్టన్ సుందర్ (12 పరుగులు), రవీంద్ర జడేజా (13 పరుగులు) వికెట్లు పడగొట్టారు. శనివారం ఆస్ట్రేలియా జట్టు 181 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగుల ఆధిక్యం లభించింది.
That’s Lunch on Day 3 in Sydney.
Three wickets in the session for #TeamIndia
Australia need 91 more runs to win.
Scorecard – https://t.co/NFmndHLfxu#AUSvIND pic.twitter.com/QFcGrY3epe
— BCCI (@BCCI) January 5, 2025
నవంబర్ 22 నుంచి మొదలైన ఈ 5 టెస్టుల సిరీస్‌లో పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించగా, ఆ తర్వాత గెలవలేకపోయింది. మరోవైపు ఆస్ట్రేలియా రెండు, నాలుగో మ్యాచ్‌ల్లో విజయం సాధించి సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో మ్యాచ్ డ్రా అయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..