Pink Ball Test: పింక్ బాల్ అంటే భయంపోలేగా పుష్ప.. కష్టాల్లో భారత్.. డిన్నర్ బ్రేక్‌లోపే 4 వికెట్లు డౌన్..

|

Dec 06, 2024 | 11:57 AM

Australia vs India, 2nd Test: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టు అడిలైడ్ వేదికగా జరుగుతోంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాత్రి భోజన విరామ సమయానికి భారత్ 4 వికెట్లకు 82 పరుగులు చేసింది.

Pink Ball Test: పింక్ బాల్ అంటే భయంపోలేగా పుష్ప.. కష్టాల్లో భారత్.. డిన్నర్ బ్రేక్‌లోపే 4 వికెట్లు డౌన్..
Aus Vs Ind 2nd Test Score
Follow us on

Australia vs India, 2nd Test: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టు అడిలైడ్ వేదికగా జరుగుతోంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాత్రి భోజన విరామ సమయానికి భారత్ 4 వికెట్లకు 82 పరుగులు చేసింది. క్రీజులో రిషబ్ పంత్ (4), రోహిత్ శర్మ (1) ఉన్నారు. 31 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ అవుటయ్యాడు. అతన్ని స్కాట్ బోలాండ్ ఎల్‌బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. విరాట్ కోహ్లీ (7 పరుగులు), కేఎల్ రాహుల్ (37 పరుగులు), యశస్వి జైస్వాల్ (0)లను మిచెల్ స్టార్క్ పెవిలియన్ పంపాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే భారత్ వికెట్ కోల్పోయింది.

సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. పెర్త్ టెస్టులో భారత జట్టు 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. అడిలైడ్‌లో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు జరిగాయి. భారత్ ఇక్కడ 2 మ్యాచ్‌లు గెలిచింది.

ఇవి కూడా చదవండి

డిన్నర్ బ్రేక్- తొలి సెషన్‌లో ఆస్ట్రేలియా పేసర్లు ఆధిపత్యం..

అడిలైడ్ టెస్టు తొలి రోజు తొలి సెషన్‌లో ఆస్ట్రేలియా పేసర్లు ఆధిపత్యం చెలాయించారు. 23 ఓవర్ల ఈ సెషన్‌లో భారత జట్టు 82 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.

ఇరుజట్ల ప్లేయింగ్ XI..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), నాథన్ మెక్‌స్వీనీ, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..