IND vs AUS: గిల్ కోసం బలయ్యేది ఆయనేనా.. తొలి టెస్టులో అరంగేట్రం చేయనున్న తెలుగబ్బాయ్.. భారత ప్లేయింగ్ 11 ఇదే?

India vs Australia 1st Test: ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా, బ్యాటింగ్ ఆర్డర్‌ను సెట్ చేసుకోవడం భారత్‌కు పెద్ద సవాలుగా మారింది.

IND vs AUS: గిల్ కోసం బలయ్యేది ఆయనేనా.. తొలి టెస్టులో అరంగేట్రం చేయనున్న తెలుగబ్బాయ్.. భారత ప్లేయింగ్ 11 ఇదే?
Ind Vs Aus Test Series
Follow us

|

Updated on: Feb 07, 2023 | 6:45 AM

భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఫిబ్రవరి 9 నుంచి ఇరు జట్ల మధ్య మాటల యుద్ధం జరగనుంది. తొలి మ్యాచ్‌ నాగ్‌పూర్‌లో జరగనుండడంతో ఇరు జట్లూ గెలుపు కోసం సన్నద్ధమవుతున్నాయి. దీంతో పాటు టీమిండియా ప్లేయింగ్ 11, బ్యాటింగ్‌ కాంబినేషన్‌, బౌలింగ్‌ కాంబినేషన్‌పై కూడా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్‌ను సెట్ చేయడం టీమిండియాకు పెద్ద టాస్క్‌గా మారింది. నిజానికి శ్రేయాస్ అయ్యర్ గాయం తర్వాత టీమిండియా పెద్ద ప్రశ్నకు సమాధానం వెతుకుతోంది.

శ్రేయాస్ అయ్యర్ స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది ప్రశ్నగా నిలిచింది. జట్టులో ఆయన స్థానాన్ని ఆక్రమించే ప్లేయర్లకు కొరత లేదు. శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ వంటి బ్యాట్స్‌మెన్స్ ఈ జట్టులో ఉన్నారు. గిల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అతను వన్డేలు, టీ20లలో సెంచరీల తర్వాత ప్లేయింగ్ ఎలెవెన్‌లో చేర్చడానికి బలమైన పోటీదారునిగా ప్రకటించుకున్నాడు. అయితే, శుభ్‌మన్ గిల్‌కు అవకాశం లభిస్తుందా లేదా అనేది ప్రశ్నగా నిలిచింది. అతను జట్టులో చేరితే అతని బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంటుంది? అనేది కూడా తేలాల్సి ఉంది.

మిడిల్ ఆర్డర్‌ లేదా ఓపెనర్‌లో ఆడతాడా?

శుభ్‌మన్ గిల్ తన అంతర్జాతీయ కెరీర్‌ను టెస్ట్ ఓపెనర్‌గా ప్రారంభించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో గిల్ కూడా కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ, ఈ ఫార్మాట్‌లో ఈ ఆటగాడు నిలకడగా రాణించలేకపోయాడు. గిల్ టెస్ట్ సగటు 32 మాత్రమే. ప్రస్తుతం గిల్‌ ఫామ్‌లో ఉన్నప్పటికీ అతడిని జట్టుకు దూరంగా ఉంచడం సరికాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో గిల్‌ను మళ్లీ టెస్టులో ఓపెనింగ్ చేయాలని టీమిండియా ఆలోచిస్తుందా? అంటే వేచి చూడాల్సిందే. ప్రస్తుతం టెస్టుల్లో రోహిత్, రాహుల్ ఓపెనర్లుగా ఉన్నారు. ఓపెనర్‌గా రాహుల్‌ ప్రదర్శన కూడా యావరేజ్‌గా ఉంది. అతని టెస్టు యావరేజ్ కూడా 35 కంటే తక్కువ. కాబట్టి గిల్ ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని రాహుల్‌ను టీమిండియా బలి ఇస్తుందా? మిడిలార్డర్‌లో రాహుల్‌ను ఆడిస్తార? అనేది చూడాల్సి ఉంది. వన్డే ఫార్మాట్‌లో మిడిల్ ఆర్డర్‌లో రాహుల్ అద్భుతంగా రాణించాడు. టీమ్ ఇండియా టెస్ట్ ఫార్మాట్‌లో కూడా అదే విధంగా ఆలోచించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

నివేదికల ప్రకారం, మిడిల్ ఆర్డర్‌లో శుభమాన్ గిల్‌కు అవకాశం ఇవ్వడంపై కూడా చర్చ జరిగింది. ఆస్ట్రేలియా-ఏ పర్యటనలో మిడిల్ ఆర్డర్‌లో గిల్ డబుల్ సెంచరీ సాధించాడు. గిల్ స్పిన్నర్లను బాగా ఆడగలడు. కాబట్టి, ఈ ఆటగాడిని అక్కడ కూడా ఉపయోగించుకోవచ్చు. వీటన్నింటి మధ్య సూర్యకుమార్ యాదవ్ ఆడతాడా లేదా అనేది వేచి చూడాల్సిందే.

భారత ప్లేయింగ్ XI ?

రోహిత్ శర్మ , కేఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, శ్రీకర్ భరత్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..