AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL : అక్కడ సీనియర్స్.. ఇక్కడ జూనియర్స్.. సిరీసుల్లో చేతులెత్తేస్తున్న భారత క్రికెటర్లు

IND vs SL : శ్రీలంక అండర్-19తో జరిగిన యూత్ వన్డే సిరీస్‌ను భారత్ 1-2తో కోల్పోయింది. చివరి మ్యాచ్‌లో 291 పరుగుల లక్ష్యాన్ని లంక జట్టు చివరి బంతికి ఛేదించి ఒక వికెట్ తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.

IND vs SL : అక్కడ సీనియర్స్.. ఇక్కడ జూనియర్స్.. సిరీసుల్లో చేతులెత్తేస్తున్న భారత క్రికెటర్లు
Ind Vs Sl
Rakesh
|

Updated on: Jul 09, 2026 | 8:27 PM

Share

IND vs SL : భారత క్రికెట్ అభిమానులకు మరో చేదు వార్త ఎదురైంది. సీనియర్ జట్టు వరుస ఓటములతో ఇబ్బంది పడుతుంటే, ఇప్పుడు జూనియర్ జట్టు కూడా అదే బాటలో నడిచింది. శ్రీలంక అండర్-19 జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల యూత్ వన్డే సిరీస్‌ను భారత అండర్-19 జట్టు 1-2 తేడాతో కోల్పోయింది. సిరీస్ విజేతను నిర్ణయించే మూడో, చివరి వన్డే మ్యాచ్‌లో శ్రీలంక యువ జట్టు అద్భుత ప్రదర్శనతో భారత్‌కు గట్టి షాక్ ఇచ్చింది. చివరి బంతి వరకు అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో శ్రీలంక 1 వికెట్ తేడాతో విజయం సాధించి సిరీస్‌ను తన సొంతం చేసుకుంది.

ఈ కీలకమైన చివరి మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక అండర్-19 జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుని భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 290 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత ఇన్నింగ్స్‌లో నంబర్ త్రీ బ్యాటర్ వికే వినీత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆయన కేవలం 13 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 131 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. అతనికి తోడుగా లక్ష్య రాజేష్ రాయ్‌చందానీ 61 పరుగులతో రాణించాడు. శ్రీలంక బౌలర్లలో సెథమిక సెనెవిరత్నె అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టి భారత బ్యాటింగ్‌ను కట్టడి చేశాడు.

291 రన్స్ కఠినమైన లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. లంక జట్టు గెలవడానికి ఆఖరి ఓవర్లో 11 పరుగులు కావాలి. క్రీజులో ఉన్న చమిక హీనాతిగాల మొదటి బంతిని డాట్ చేశాడు. కానీ రెండో బంతికి ఫోర్ కొట్టి టెన్షన్ తగ్గించాడు. ఆ తర్వాత మూడు మరియు నాలుగో బంతులు మళ్లీ డాట్ అవ్వడంతో భారత జట్టు విజయం ఖాయమనుకున్నారు. కానీ ఐదో బంతికి చమిక భారీ సిక్సర్ బాదడంతో మ్యాచ్ టై అయింది. ఇక ఆఖరి బంతికి 1 రన్ కావాల్సి ఉండగా, ఆయన సింగిల్ తీసి లంక జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు.

శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన చమిక హీనాతిగాల 68 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 84 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి మ్యాచ్ విన్నర్‌గా మారాడు. ఆయనతో పాటు సెనూజ వెకునాగోడ 67 పరుగులతో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. భారత బౌలర్లలో అన్మోల్‌జీత్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీసినప్పటికీ, జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. ఈ విజయంతో శ్రీలంక జట్టు సంబరాల్లో మునిగిపోయింది.

నిజానికి ఈ సిరీస్‌ను భారత్ ఎంతో ఘనంగా ప్రారంభించింది. మొదటి యూత్ వన్డే మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే ఆ తర్వాత శ్రీలంక జట్టు పుంజుకుని వరుసగా తదుపరి రెండు వన్డేల్లోనూ భారత్‌ను ఓడించి సిరీస్‌ను 2-1 తో ముగించింది. వన్డే సిరీస్ ముగియడంతో, ఈ రెండు జట్ల మధ్య త్వరలోనే రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులోనైనా భారత్ పుంజుకుంటుందో లేదో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
అక్కడ సీనియర్స్.. ఇక్కడ జూనియర్స్.. మొత్తానికి చేతులెత్తేశారు
అక్కడ సీనియర్స్.. ఇక్కడ జూనియర్స్.. మొత్తానికి చేతులెత్తేశారు
ఇంటిమేట్ సీన్స్ చేయడానికి కారణం ఇదే..
ఇంటిమేట్ సీన్స్ చేయడానికి కారణం ఇదే..
దంచికొడుతున్న వానలు.. రేపు బడులకు సెలవ్ ఆ రాష్ట్రాల్లో..!
దంచికొడుతున్న వానలు.. రేపు బడులకు సెలవ్ ఆ రాష్ట్రాల్లో..!
వరుణిడి విశ్వరూపం.. దేశరాధాని ఢిల్లీని ముంచెత్తిన వర్షాలు..
వరుణిడి విశ్వరూపం.. దేశరాధాని ఢిల్లీని ముంచెత్తిన వర్షాలు..
మిత్రుడి మరణం తట్టుకోలేక వెక్కివెక్కి ఏడ్చిన రషీద్ ఖాన్
మిత్రుడి మరణం తట్టుకోలేక వెక్కివెక్కి ఏడ్చిన రషీద్ ఖాన్
బీఎస్ఎన్‌ఎల్ నుంచి శాటిలైట్ ఫోన్.. ధర ఎంతంటే..?
బీఎస్ఎన్‌ఎల్ నుంచి శాటిలైట్ ఫోన్.. ధర ఎంతంటే..?
బ్యాక్టీరియాకు చెక్.. వర్షాకాలంలో ఈ పండ్లను డోంట్ మిస్..
బ్యాక్టీరియాకు చెక్.. వర్షాకాలంలో ఈ పండ్లను డోంట్ మిస్..
జబర్దస్త్ ఫైమా పెళ్లికి నాగబాబు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా? వీడియో
జబర్దస్త్ ఫైమా పెళ్లికి నాగబాబు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా? వీడియో
బెడ్‌రూమ్‌లో ఈ చిన్న పనిచేస్తే నిమిషాల్లో కునుకు పడుతుంది!
బెడ్‌రూమ్‌లో ఈ చిన్న పనిచేస్తే నిమిషాల్లో కునుకు పడుతుంది!
ల్యాప్‌టాప్‌తో తలపై కొట్టిన క్లాస్‌మేట్.. MBBS విద్యార్ధిని మృతి
ల్యాప్‌టాప్‌తో తలపై కొట్టిన క్లాస్‌మేట్.. MBBS విద్యార్ధిని మృతి