AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం.. ఓపెనింగ్ జోడీలో కీలక మార్పు?

India tour of England 2026: ఇంగ్లాండ్ పిచ్‌లపై విజయం సాధించాలంటే పవర్‌ప్లేలో శుభారంభం దక్కడం ఎంతో కీలకం. ఫామ్‌లో లేని ఆటగాళ్లను పక్కన పెట్టి, వైభవ్ సూర్యవంశీ లాంటి యువ రక్తాన్ని ఓపెనింగ్‌లో పరీక్షించడం జట్టుకు కొత్త ఊపునిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ సరికొత్త వ్యూహం ఇంగ్లాండ్ గడ్డపై భారత్‌కు ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.

IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం.. ఓపెనింగ్ జోడీలో కీలక మార్పు?
Gambhir Teamindia
Venkata Chari
|

Updated on: Jul 01, 2026 | 10:15 AM

Share

India tour of England 2026: ఐర్లాండ్ పర్యటనలో ఎదురైన ఘోర పరాభవం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో జులై 1 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు జట్టు యాజమాన్యం కీలక మార్పులు చేయాలని భావిస్తోంది. వరుసగా విఫలమవుతున్న ఓపెనింగ్ జోడీని మార్చి, సరికొత్త వ్యూహంతో బరిలోకి దిగడానికి టీమ్ ఇండియా సిద్ధమవుతోంది.

ఐర్లాండ్ కొట్టిన దెబ్బ.. అభిమానుల్లో మొదలైన టెన్షన్..!

భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటన రేపటి నుంచే ప్రారంభం కానుంది. జులై 1 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్, ఆ తర్వాత జులై 14 నుంచి వన్డే సిరీస్ జరగనున్నాయి. అయితే, ఈ ప్రతిష్టాత్మక పర్యటనకు సరిగ్గా ముందే ఐర్లాండ్ చేతిలో టీమ్ ఇండియా 2-0తో క్లీన్‌స్వీప్ అవ్వడం అందరినీ షాక్‌కు గురిచేసింది. సులువుగా గెలుస్తామనుకున్న మ్యాచ్‌ల్లో భారత బ్యాటర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా పవర్‌ప్లేలో ఆశించిన స్థాయిలో పరుగులు రాకపోవడం, ఓపెనర్లు చేతులెత్తేయడం జట్టు పరాజయానికి ప్రధాన కారణాలుగా మారాయి. దీంతో ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టుతో తలపడే ముందు ఓపెనింగ్ జోడీని మార్చడం అనివార్యంగా మారింది.

సంజూ, అభిషేక్ జోడీ విఫలం.. నిరాశపరిచిన గణాంకాలు..

ఐర్లాండ్ సిరీస్‌లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ఓపెనర్లుగా బరిలోకి దిగినప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదు. మొదటి మ్యాచ్‌లో 183 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత జట్టు కేవలం 148 పరుగులకే పరిమితమైంది. ఆ మ్యాచ్‌లో ఓపెనర్లు కేవలం 16 పరుగులు మాత్రమే జోడించగలిగారు. సంజూ కేవలం 5 పరుగులకే అవుట్ కాగా, అభిషేక్ శర్మ 20 బంతుల్లో 49 పరుగులు చేసి కాస్త ఆకట్టుకున్నాడు. కానీ, రెండో టీ20 మ్యాచ్‌లో ఇద్దరూ దారుణంగా విఫలమయ్యారు. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ మొదటి బంతికే అవుట్ కాగా, ఆ తర్వాత అభిషేక్ శర్మ కూడా డకౌట్ అయి పెవిలియన్ చేరాడు. గత టీ20 ప్రపంచకప్‌లోనూ వీరిద్దరి కాంబినేషన్ పెద్దగా క్లిక్ కాలేదు.

ఇవి కూడా చదవండి

తెరపైకి ఐపీఎల్ హీరో.. అభిషేక్‌కు తోడుగా వైభవ్ సూర్యవంశీ?

వరుస వైఫల్యాల నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో ఓపెనింగ్ స్థానంలో భారీ మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్‌లో అద్భుత ఫామ్‌తో దూసుకుపోయిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వైపు సెలెక్టర్లు మొగ్గు చూపుతున్నారు. ఐపీఎల్‌లో 16 మ్యాచ్‌లలో ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న వైభవ్‌కు ఐర్లాండ్ సిరీస్‌లోనే అరంగేట్రం చేసే అవకాశం వస్తుందని అందరూ భావించారు. కానీ అక్కడ నిరాశే ఎదురైంది. ఇప్పుడు సంజూ శాంసన్ పేలవ ఫామ్ కారణంగా వైభవ్ సూర్యవంశీని అభిషేక్ శర్మకు జోడీగా ఓపెనర్‌గా బరిలోకి దించాలని మేనేజ్‌మెంట్ గట్టిగా భావిస్తోంది. అదే జరిగితే వికెట్ కీపర్ బాధ్యతలను ఇషాన్ కిషన్ చేపట్టే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?