AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: వచ్చాడయ్యా పెద్ద పోటుగాడు..! ఆఫ్రిదికి అధికారం ఉంటేనట..

IND vs PAK: టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా కొలంబో వేదికగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ 61 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమి కేవలం ఒక మ్యాచ్ ఫలితం మాత్రమే కాదు, పాక్ క్రికెట్ పునాదులను కదిలించేలా ఉంది. టీమిండియా నిర్దేశించిన 176 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ బ్యాటర్లు చేతులెత్తేయడంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు నిప్పులు చెరుగుతున్నారు.

IND vs PAK: వచ్చాడయ్యా పెద్ద పోటుగాడు..! ఆఫ్రిదికి అధికారం ఉంటేనట..
Shahid Afridi Comments On India Vs Pakistan
Rakesh
|

Updated on: Feb 16, 2026 | 5:18 PM

Share

IND vs PAK: టీ20 ప్రపంచకప్‌ 2026లో భాగంగా కొలంబో వేదికగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ 61 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమి కేవలం ఒక మ్యాచ్ ఫలితం మాత్రమే కాదు, పాక్ క్రికెట్ పునాదులను కదిలించేలా ఉంది. టీమిండియా నిర్దేశించిన 176 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ బ్యాటర్లు చేతులెత్తేయడంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు నిప్పులు చెరుగుతున్నారు. బాబర్ అజామ్, షాహీన్ అఫ్రిది వంటి దిగ్గజాలపై తీవ్ర విమర్శలు రావడమే కాకుండా, వారిని జట్టు నుంచి శాశ్వతంగా తప్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఈ ఓటమిపై స్పందిస్తూ చాలా కఠినమైన వ్యాఖ్యలు చేశారు. “జట్టు ఎంపికలో నా చేతిలో అధికారం ఉంటే బాబర్ అజామ్, షాదాబ్ ఖాన్, షాహీన్ అఫ్రిదిలను వెంటనే జట్టు నుంచి తప్పించేవాడిని. వారికి ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చాం, కానీ కీలక సమయాల్లో వారు పదేపదే విఫలమవుతున్నారు. సీనియర్లు ఫలితాలను ఇవ్వనప్పుడు, బెంచ్‌పై ఉన్న యువకులను ఎందుకు ఆడించకూడదు?” అని ప్రశ్నించారు. బాబర్ అజామ్ జట్టుకు భారంలా మారాడనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.

పాక్ క్రికెట్ దిగ్గజం జావెద్ మియాందాద్ మాట్లాడుతూ.. పెద్ద మ్యాచుల్లో ఆటగాళ్లకు ఉండాల్సిన క్యారెక్టర్ పాక్ క్రికెటర్లలో కనిపించలేదన్నారు. టీమ్ మేనేజ్మెంట్ తీసుకున్న ఆరుగురు స్పిన్నర్ల నిర్ణయం కూడా ఘోర తప్పిదమని ఎత్తిచూపారు. మరో మాజీ కెప్టెన్ మహ్మద్ యూసుఫ్ అయితే.. పాక్ క్రికెట్‌లో రాజకీయ జోక్యం, వ్యక్తిగత ఎజెండాల వల్లే ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. బలహీనమైన జట్లపై గెలిచి గొప్పలు చెప్పుకోవడం కాదు, భారత్ వంటి జట్లపై ఆడినప్పుడే అసలు సత్తా తెలుస్తుంది. షాహీన్, బాబర్‌ల సమయం ముగిసింది అని ఆయన X వేదికగా ధ్వజమెత్తారు.

రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ ఎప్పటిలాగే తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. బాబర్ అజామ్‌ను విరాట్ కోహ్లీతో పోల్చడంపై మండిపడుతూ.. కోహ్లీ తన వారసత్వాన్ని తానే నిర్మించుకున్నాడు. కానీ బాబర్ మాత్రం ఒక్క మ్యాచ్ కూడా గెలిపించలేకపోతున్నాడు. మీరు ఒక సూపర్ స్టార్‎ను తయారు చేశారు, కానీ అతడికి మ్యాచ్ గెలిపించే సత్తా లేదని దుయ్యబట్టారు. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీని కూడా అసమర్థుడు అని అక్తర్ అభివర్ణించడం గమనార్హం.

పాక్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ కూడా బాబర్ అజామ్ ప్రదర్శనపై పెదవి విరిచారు. భారత్‌పై బాబర్ మరోసారి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. బహుశా టీ20 ఫార్మాట్‌లో బాబర్‌కు ఇదే చివరి మ్యాచ్ కావచ్చేమో అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న బాబర్‌ను జట్టులో కొనసాగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us