IND vs SCO, T20 World Cup 2021: భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేసిన స్కాట్లాండ్.. కోహ్లీసేన టార్గెట్ 86 పరుగులు
IND vs SCO: స్కాట్లాండ్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 85 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో కోహ్లీసేన ముందు 86 పరుగుల లక్ష్యం ఉంది.

India vs Scotland, T20 World Cup 2021: సూపర్ 12లో గ్రూపు2 డబుల్ హెడర్ మ్యాచుల్లో భాగంగా రెండో గేమ్‌లో భారత్ వర్సెస్ స్కాట్లాండ్ టీంలు తలపడుతున్నాయి. అయితే కీలక మ్యాచులో భారీ విజయం సాధించాల్సిన మ్యాచులో టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో స్కాట్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. స్కాట్లాండ్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 85 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో కోహ్లీసేన ముందు 86 పరుగుల లక్ష్యం ఉంది.
భారత బౌలింగ్ లైనప్ దెబ్బకు స్కాట్లాండ్ టీం వరుసగా వికెట్లు కోల్పోయింది. 13 పరుగుల వద్ద స్కాట్లాండ్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. బుమ్రా వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన కోయోట్టర్(1) బౌల్డయ్యాడు. అనంతరం 24(19 బంతులు, 4 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేసిన మరో ఓపెనర్ జార్జ్ మున్సీ రెండో వికెట్‌గా షమీ బౌలింగ్‌లో హార్దిక్ అద్భుత క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. మాథ్యూ క్రాస్ (2), రిచీ బెరింగ్టన్ (0) లను ఒకే ఓవర్లో రవీంద్ర జడేజా పెవిలియన్ చేర్చి స్కాట్లాండ్‌ను భారీ దెబ్బ తీశాడు.
58 పరుగుల వద్ద ఐదో వికెట్ రూపంలో లీస్క్ వెనుదిరిగాడు. జడేజా బౌలింగ్‌లో లీస్క్(21 పరుగులు, 12 బంతులు, 2 ఫోర్లు, 1సిక్స్) ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం అశ్విన్ దెబ్బకు స్కాట్లాండ్ ఆరో వికెట్‌ను కోల్పోయింది. క్రిస్ గ్రీవ్స్(1) భారీ షాట్ ఆడబోయి హార్ధిక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం సఫ్యాన్ షరీఫ్ 0, ఎవాన్స్ 0, క్రిస్ గ్రీవ్స్ 1, ఎవాన్స్ 0 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. షమీ వేసిన 17వ ఓవర్లో స్కాట్లాండ్ టీం వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లను కోల్పోయింది.
టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరే అవకాశాలను ఏదో విధంగా కాపాడుకుంటూ వస్తున్న టీమ్ ఇండియాకు శుక్రవారం చాలా ముఖ్యమైన రోజు. సెమీఫైనల్‌లో ఇతర జట్ల ప్రదర్శనపైనే ఆధారపడిన కోహ్లీ సేన ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలుపొందాలనే ఉద్దేశంతో స్కాట్లాండ్‌తో మ్యాచ్‌కు సిద్ధమైన సంగతి తెలిసిందే. అఫ్గానిస్థాన్‌పై 66 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత ఆ జోరును కొనసాగించడంపైనే భారత్ దృష్టి సారించింది. భారత్ విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా రన్ రేట్‌ను మెరుగుపరుచుకోవడానికి భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.
Scotland are all out for 85 ☝️
An excellent performance from the Indian bowlers ?#T20WorldCup | #INDvSCO | https://t.co/YLpksRdaKV pic.twitter.com/R0Vsx7eoS9
— ICC (@ICC) November 5, 2021
T20 World Cup 2021: తృటిలో తప్పిన ప్రమాదం.. తలకు బాల్ తగలడంతో కుప్పకూలిన కివీస్ బౌలర్.. అసలేమైందంటే?