AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: భారత్ చేతిలో ఘోర పరాభవం.. పాకిస్థాన్ మహిళల జట్టు చరిత్రలోనే చెత్త రికార్డు

IND vs PAK: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు భారత కచ్చితమైన బౌలింగ్ దాటికి తాళలేక 18.1 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే పాకిస్థాన్ మహిళల జట్టుకు ఇదే అత్యంత తక్కువ స్కోరు కావడం గమనార్హం.

IND vs PAK: భారత్ చేతిలో ఘోర పరాభవం.. పాకిస్థాన్ మహిళల జట్టు చరిత్రలోనే చెత్త రికార్డు
Ind Vs Pak (2)
Rakesh
|

Updated on: Sep 06, 2026 | 1:44 PM

Share

IND vs PAK: దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో శనివారం జరిగిన మహిళల ఆసియా కప్ 2026 గ్రూప్-ఎ మ్యాచ్‌లో భారత బౌలర్లు చారిత్రక విజయాన్ని నమోదు చేశారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను కేవలం 55 పరుగులకే కుప్పకూల్చి, తమ ఆధిపత్యాన్ని సగర్వంగా చాటుకున్నారు. మహిళల ఆసియా కప్ తొమ్మిదో మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు తీవ్ర నిరాశపరిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు భారత కచ్చితమైన బౌలింగ్ దాటికి తాళలేక 18.1 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే పాకిస్థాన్ మహిళల జట్టుకు ఇదే అత్యంత తక్కువ స్కోరు కావడం గమనార్హం. గతంలో 2024 టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై చేసిన 56 పరుగుల రికార్డును అధిగమించి, ఈ మ్యాచ్ ద్వారా సరికొత్త చేదు జ్ఞాపకాన్ని మూటగట్టుకుంది.

ఇన్నింగ్స్ ఆరంభంలో పాకిస్థాన్ ఓపెనర్లు వికెట్ నష్టపోకుండా మొదటి నాలుగు ఓవర్లలో 23 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. అయితే తొలి ఓవర్ బౌలింగ్‌కు వచ్చిన భారత స్టార్ ఆల్‌రౌండర్ షెఫాలీ వర్మ వెంటనే వికెట్ తీసి విచ్ఛిన్నానికి నాంది పలికింది. పవర్‌ప్లే ముగిసే సమయానికి పాకిస్థాన్ 23/0 నుంచి 29/3 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. అక్కడి నుంచి భారత స్పిన్ విభాగానికి తిరుగులేకుండా పోయింది.

పవర్‌ప్లే తర్వాత భారత స్పిన్నర్లు దీప్తి శర్మ, ప్రేమా రావత్, శ్రీ చరణి మైదానంలో వికెట్ల పండగ చేసుకున్నారు. వీరి ధాటికి పాకిస్థాన్ స్కోరు 27/0 నుంచి ఒక్కసారిగా 35/6కి పడిపోయింది. ఉమ్మా-ఎ-హానీ, ఐమన్ ఫాతిమా కొంతసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, ఒక రనౌట్ రూపంలో వారి పోరాటం ముగిసింది. ఆఖరి వరుస బ్యాటర్లు కూడా క్యూ కట్టడంతో పాక్ ఇన్నింగ్స్ 55 పరుగుల వద్దే ముగిసింది.

భారత్‌పై నమోదైన ఐదో అత్యల్ప స్కోరు

పాకిస్థాన్ నమోదు చేసిన 55 పరుగుల స్కోరు వారికి ఆల్-టైమ్ లోయెస్ట్ కాగా, భారత మహిళల జట్టుపై ప్రత్యర్థులు చేసిన ఐదో అత్యల్ప స్కోరుగా నిలిచింది. ఈ జాబితాలో 2018లో క్ౌలాలంపూర్‌లో భారత్‌పై 27 పరుగులకే ఆలౌట్ అయిన మలేషియా అగ్రస్థానంలో ఉండగా, థాయిలాండ్ (37 పరుగులు), బంగ్లాదేశ్ (51, 54 పరుగులు) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో థాయిలాండ్‌పై విజయం సాధించి ఆసియా కప్‌లోకి అడుగుపెట్టిన పాకిస్థాన్‌కు, భారత్ చేతిలో ఎదురైన ఈ ఘోర పరాభవం కోలుకోలేని దెబ్బగా మారింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
మరోసారి గొప్ప మనసు చాటుకున్న మోహన్ బాబు.. ఏం చేశారంటే? వీడియో
మరోసారి గొప్ప మనసు చాటుకున్న మోహన్ బాబు.. ఏం చేశారంటే? వీడియో
టెన్షన్‌తో సతమతమవుతున్నారా? ఈ ఆసనాలు మస్ట్ ట్రై
టెన్షన్‌తో సతమతమవుతున్నారా? ఈ ఆసనాలు మస్ట్ ట్రై
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌